AP New VCs : ఏపీలోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం-andhra pradesh government appoints new vice chancellors for universities ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap New Vcs : ఏపీలోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం

AP New VCs : ఏపీలోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం

AP New VCs : ఏపీలోని పలు యూనివర్సిటీలకు గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ వైఎస్ ఛాన్సలర్లను నియమించారు. ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్ రాజశేఖర్ నియమితులయ్యారు. కాకినాడ జేఎన్టీయూ వీసీగా సీఎస్ఆర్కే ప్రసాద్ నియమితులయ్యారు.

ఏపీలోని పలు యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ల నియామకం

AP New VCs : ఆంధ్రప్రదేశ్ లోని పలు యూనివర్సిటీలకు వైఎస్ ఛాన్సలర్లను నియమిస్తూ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ నోటీఫికేషన్ ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ వీసీగా ప్రొఫెసర్‌ జి.పి. రాజశేఖర్‌ నియమితులయ్యారు. రాజశేఖర్ ప్రస్తుతం ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మ్యాథ్స్ ప్రొఫెసర్ గా చేస్తున్నారు. కాకినాడ జేఎన్టీయూ వీసీగా ప్రొఫెసర్‌ సీఎస్‌ఆర్‌కె ప్రసాద్‌ను నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం వరంగల్ నిట్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

యోగి వేమన యూనివర్సిటీకి వీసీగా ప్రొఫెసర్‌గా పి.ప్రకాశ్‌బాబును నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బయో టెక్నాలజీ సీనియర్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. వీరంతా మూడేళ్ల పాటు ఆయా వర్సిటీలకు వీసీలుగా పనిచేయనున్నారు.

కొత్త వీసీలు వీళ్లే

  • తిరుమల పద్మావతి మహిళా యూనివర్సిటీ - ఉమ
  • ఆదికవి నన్నయ యూనివర్సిటీ - ప్రసన్న శ్రీ
  • రాయలసీమ యూనివర్సిటీ - వెంకట బసవరావు
  • అనంతపురం జేఎన్టీయూ వర్సిటీ- హెచ్‌.సుదర్శనరావు
  • విక్రమ సింహపురి వర్సిటీ - అల్లం శ్రీనివాసరావు
  • మచిలీపట్నం కృష్ణా యూనివర్సిటీ - కె.రాంజీ

జేఎన్టీయూ హైదరాబాద్ వీసీగా కిషన్ కుమార్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం జేఎన్‌టీయూ హైదరాబాద్ యూనివర్సిటీకి వైఎస్ ఛాన్సలర్ ను నియమించింది. వైస్ ఛాన్సలర్ గా టి.కిష‌న్ కుమార్ రెడ్డిని నియమించింది. కిషన్ కుమార్ రెడ్డిని వీసీగా నియమిస్తూ గ‌వ‌ర్నర్ జిష్ణుదేవ్ వ‌ర్మ ఆదేశాలు ఇవ్వడంతో ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జేఎన్‌టీయూ వీసీగా కిష‌న్ కుమార్ రెడ్డి మూడేళ్ల పాటు కొన‌సాగ‌నున్నారు. గతేడాది మే 21న వర్సిటీ వీసీ పోస్టును భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించినా సాంకేతిక కారణాల రీత్యా ఈ ప్రక్రియ వాయిదా పడింది.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం