AP JAC Fight :ఉద్యోగుల డిమాండ్ల కోసం ఏపీజేఏసీ ఉద్యమ కార్యాచరణ
AP JAC Fight చాయ్, బిస్కెట్ మీటింగులకు కాలం చెల్లింందని ఏపీజేఏసి ప్రకటించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉద్యోగుల ఉద్యమ కార్యాచరణను లిఖితపూర్వకంగా అందించారు.
AP JAC Fight వేతన చెల్లింపులు మొదలుకుని ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలపై రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై రగిలిపోతున్న ఉద్యోగులు పోరుబాట పట్టనున్నట్లు ప్రకటించారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఉద్యమ కార్యాచరణ నోటీసును ఏపీజేఏసి అమరావతి అందచేసింది.
ఆంధ్రప్రధేశ్ ఉద్యోగ, ఉపాధ్యయ,కార్మిక,రిటైర్డు కాంట్రాక్టు, ఔట్ సోర్శింగు ఉద్యోగుల సమస్యలు పరిష్కారానికి గత ఏడాది పిభ్రవరి నెలలో 11 వ పిఆర్సీపై ఉద్యమం జరిగిన సందర్బంగా ముఖ్యమంత్రి,మంత్రివర్గ ఉపసంఘం అంగీకరించిన డిమాండ్లను అమలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి అవలంబిస్తున్నందున మార్చి 9 నుండి ఏప్రీల్ 3 వరకు దశలవారిగా ఆందోళన కార్యక్రమాలను ప్రకటించారు. ఉద్యోగుల ఆందోళనకు సంబందించిన షెడ్యూల్ నోటీసును మంగళవారం సచివాలయంలో చీఫ్ సెక్రటరీ కె.యస్.జవర్ రెడ్డికి కి ఏపిజెఏసి అమరవాతి రాష్ట్ర కమిటి అందచేసింది.
ఉద్యోగసంఘ నాయకులకు ముఖ్యమంత్రీ ఇచ్చిన హామీలు అమలు కానప్పుడు ఇంకా ఎవరికి చెప్పుకోవాలో అర్దంకాని పరిస్దితి ఉందని, అసలు ఉద్యోగుల జీత భత్యాలకు కేటాయించిన బడ్జెట్, ఏమవుతుందో తెలియడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించేందుకు కేటాయించిన ఉద్యోగుల బడ్జెట్ ఏమవుతుందో తెలియ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉద్యోగులకు సంబంధించిన డబ్బులు ఎవరికి మళ్లీస్తున్నారని,పని చేసిన కాలానికి 1వ తేదీన జీతాలు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఉద్యోగులు దాచుకున్న డబ్బులు తిరిగి వారి అవసరాలకు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. ఉద్యోగులకు రావల్సిన అరియర్సు/ డిఏ బకాయిలు, కొత్త డిఏ , లీవ్ ఎన్ క్యాష్ మెంట్లు ఇలాంటి ఆర్దికపరమైన అంశాలు అన్నింటిపై స్పష్టమైన లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలని లేకుంటే మాత్రం మార్చి 9 నుండి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం తప్పదని ప్రకటించారు.
ఉద్యోగుల ఉద్యమం వలన ప్రజలకు ఎటువంటీ అసౌకర్యాలు కలిగినా సరే దాని ఉద్యోగులుగా తాము బాద్యులుం కాదని, ప్రభుత్వమే భాధ్యత వహించాలని, ఉద్యోగుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమౌతుందని ఏపిజెఏసి అమరావతి చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు.
మార్చి 1 నుండి ఉద్యమానికి కలసి వచ్చే ఉద్యోసంఘాల/ట్రేడ్ యూనిన్లు/ప్రజాసంఘాల మద్దతు కోరేకార్యక్రమాలు ప్రారంభిస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.
మార్చి రెండు నుండి 5 వరకు 26 జిల్లాలలో ఉద్యమానికి ఉద్యోగులను సిద్దం చేసేందుకు అన్నిసంఘాలతో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించనున్నారు. మార్చి 9,10 తేదీలలో నల్ల బ్యాడ్జ్ లతో విధులకు హాజరు కానున్నట్లు వెల్లడించారు. మార్చి 13,14,భోజన విరామ సమయంలో ఆందోళన నిర్వహిస్తారు. మార్చి 15/17/20 తేదీలలో అన్ని జిల్లాల్లో కలెక్టర్ కార్యాలయాలవద్ద ధర్నాలు చేపడతారు. మార్చి 21 న ఒక్క రోజు సెల్ డౌన్ కార్యక్రమం నిర్వహిస్తారు. మార్చి 21 నుండి వర్క్ టూ రూల్ ప్రారంభిస్తారు. మార్చి 24 న అన్ని హెడ్ ఆఫీస్ ల వద్ద ధర్నాలు చేపట్టనున్నట్టు వెల్లడించారు.
మార్చి 27న కరోనా తో చనిపోయిన ఉద్యోగులు కుటుంబ సభ్యులు పరామర్శిస్తారని, ఏప్రిల్ ఒకటిన సిపియస్ ఉద్యోగులు కుటుంబాల పరామర్శ నిర్వహించనున్నరాు. ఏప్రిల్ 3 న ఛలో కలక్టరేట్ కార్యక్రమం ద్వారా స్పందన లో ఉద్యోగుల సమస్యతో రిప్రజెంటేషన్ ఇస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 5న రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించి రెండో ఫేజ్ భవిష్యత్ కార్యాచరణ,కీలకనిర్ణయాలు ప్రకటన చేస్తామని ప్రకటించారు.