AP Cabinet Decisions : బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు - ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
Andhra Pradesh Cabinet Decisions: ఏపీ కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నామినేటెడ్ పదవుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్, పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణ ప్రతిపాదనలపై కేబినెట్ లో చర్చ జరిగింది.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్ లో రాష్ట్ర కేబినెట్ భేటీ జరిగింది. ఇందులో పలు కీలక అంశాలపై చర్చించారు. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
కీలక నిర్ణయాలు….
విశాఖ గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో అభ్యంతరం లేని భూములను క్రమబద్ధీకరించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అంతేకాకుండా ఏపీ నాలెడ్జ్ సొసైటీ కేపాసిటీ బిల్డింగ్, పట్టాదార్ పాస్ పుస్తకం చట్ట సవరణకు ప్రతిపాదనపై కేబినెట్ లో చర్చ జరిగింది. రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
ఏపీ కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారధి వెల్లడించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు మేలు జరిగేలా కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఎంఎస్ఎంఈ ఫుడ్‌ప్రాసెసింగ్, ఈవీ పాలసీల్లో సవరణలు చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కేబినెట్ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు వివిధ ప్రోత్సాహకాలు అందిస్తామని చెప్పారు.
- ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ 2025కు మంత్రివర్గం ఆమోదం
- నీరు-చెట్టు పనులకు పెండింగ్ బిల్లులు చెల్లించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- జలవనరులశాఖ ఇంజినీర్లపై కేసులు విత్‌డ్రా చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
- రాష్ట్రంలోని మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కేబినెట్ నిర్ణయం
- ఎంఎస్ఎంఈ ఫుడ్‌ప్రాసెసింగ్, ఈవీ పాలసీల్లో సవరణలు చేస్తూ మంత్రివర్గం నిర్ణయం.
- పోలవరం నిర్వాసిత కాలనీల్లో అన్ని వసతులతో కొత్త ఇళ్ల నిర్మాణానికి టెండర్లు పిలిచేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
సంబంధిత కథనం