పోలవరం ప్రాజెక్టు నిర్మాణం గడువులోగా పూర్తి చేయడం కష్టమేనని పార్లమెంటులో కేంద్ర జలశక్తి శాఖ ప్రకటించింది. 2020, 2022లో వచ్చిన వరదల కారణంగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణం నిర్ణీత గడువులోగా పూర్తి చేయలేమని తెలిపారు. 2024లోగా ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా వరదల కారణంగా పనుల్లో జాప్యం జరిగినట్లు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఇప్పటి వరకు రూ.13,226కోట్ల రుపాయలు కేంద్రం విడుదల చేసిందని మరో రూ.2,390 కోట్ల రుపాయలు విడుదల చేయాల్సి ఉందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించే విద్యుత్ కేంద్రానికి కేంద్రం నిధులు ఇవ్వదని తేల్చి చెప్పారు.