CAG Sanjaymurthy: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్‌గా ఆంధ్రా ఐఏఎస్ కొండ్రు సంజయ్ మూర్తి
CAG Sanjaymurthy: భారతదేశ కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్‌గా కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు.ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సంజయ్ మూర్తి ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు.సంజయ్ మూర్తి తండ్రి రిటైర్డ్ ఐఏఎస్ కేఎస్‌ఆర్‌మూర్తి గతంలో అమలాపురం కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు.
CAG Sanjaymurthy: భారత కంప్ట్రోలర్ అండ్ జనరల్ ఆంధ్రప్రదేశ్ మూలాలు ఉన్న ఐఏఎస్ అధికారి కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. ప్రస్తుతం కేంద్ర ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్న ఆయన్ను కాగ్‌గా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నియమించారు. ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ జారీ చేశారు.
1989 ఐఏఎస్ బ్యాచ్ హిమాచల్‌ప్రదేశ్ క్యాడర్‌కు చెందిన సంజయ్‌మూర్తి నియామకంపై కేంద్రం నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం కాగ్‌గా కొనసాగుతున్న గిరిశ్ చంద్ర పదవీ కాలం నవంబర్ 20తో ముగియనుండటంతో ఆయన స్థానంలో కె.సంజయ్ మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు.
దేశంలో ప్రతిష్టాత్మక రాజ్యాంగ పదవుల్లోఒకటైన కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్‌గా తొలిసారి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. భారతదేశ 15వ కాగ్‌గా సంజయ్‌మూర్తిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ప్రస్తుత కాగ్ గిరీశ్ చంద్ర పదవీ కాలం ముగియనుండటంతో ఆయన స్థానంలో సంజయ్‌మూర్తి నియామకానికి రాష్ట్రపతి అమోదం తెలిపారు.
సంజయ్ మూర్తి తండ్రి కేఎస్‌ఆర్ మూర్తి ఏపీలోని అమలాపురం ఎంపీగా పనిచేశారు. 1964 డిసెంబర్ 24న జన్మించిన సంజయ్‌మూర్తి 1989లో హిమాచల్ ప్రదేశ్ క్యాడర్‌లో ఐఏఎస్‌గా ఎంపికయ్యారు. 2021 సెప్టెంబర్ నుంచి జాతీయ ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంలో సంజయ్‌మూర్తి కీలక పాత్ర పోషించారు.
ఈ ఏడాది డిసెంబర్‌లో సంజయ్ పదవీ విరమణ చేయాల్సి ఉండగా ఆయనకు కాగ్‌గా బాధ్యతలు అప్పగించారు. దేశ కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్‌గా బాధ్యతలు చేపడుతున్న తొలి తెలుగు అధికారిగా సంజయ్ మూర్తి కానున్నారు. కాగ్ పదవిలో గరిష్టంగా ఆరేళ్ల పాటు లేదా 65ఏళ్ల వరకు కొనసాగవచ్చు. సంజయ్ మూర్తి తండ్రి కేఎస్‌ఆర్‌మూర్తి 1996లో అమలాపురం నుంచికాంగ్రెస్ ఎంపీగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన కూడా గతంలో ఐఏఎస్ అధికారిగా కేంద్ర ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశారు.
ఆంధ్రప్రదేశ్ కు చెందిన మూర్తి ప్రస్తుతం కేంద్ర విద్యాశాఖలో ఉన్నత విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ఆర్థిక వ్యవహారాల విభాగం (డీఈఏ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం మూర్తి బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి కాగ్ గా వ్యవహరిస్తారు.
రాజ్యాంగంలోని 148వ అధికరణలోని క్లాజ్ (1) ద్వారా తనకు సంక్రమించిన అధికారాన్ని పరిగణనలోకి తీసుకుని, కె.సంజయ్ మూర్తిని భారత కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రస్తుత కాగ్ గిరీష్ చంద్ర ముర్ము స్థానంలో మూర్తి బాధ్యతలు చేపట్టనున్నారు. ముర్ము కాగ్ కాకముందు కేంద్రపాలిత ప్రాంతమైన జమ్ముకశ్మీర్ కు తొలి లెఫ్టినెంట్ గవర్నర్ గా పనిచేశారు.
కాగ్‌కు విస్తృత అధికారాలు…
రైల్వే, రక్షణ, ఇండియా పోస్ట్, టెలికమ్యూనికేషన్స్ సహా అన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విభాగాలను ఆడిట్ చేసే అధికారం కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియాకు ఉంది. దేశంలోని 1500 పైగా ప్రభుత్వ వాణిజ్య సంస్థలు, 400 కి పైగా వాణిజ్యేతర స్వయంప్రతిపత్తి సంస్థలు, వివిధ సంస్థలు మరియు కేంద్ర ప్రభుత్వ సంస్థలు మరియు స్థానిక సంస్థలు, పంచాయితీ రాజ్ సంస్థలను, "గణనీయంగా నిధులు పొందిన" అధికారులను కాగ్ ఆడిట్ చేయగలదు.
కాగ్ తన ఆడిట్ కు లోబడి ఏదైనా కార్యాలయం లేదా సంస్థను తనిఖీ చేయవచ్చు, వాటిలోని అన్ని లావాదేవీలను పరిశీలించవచ్చు. వాటి కార్యనిర్వాహకుడిని ప్రశ్నించవచ్చు మరియు సంస్థల నుండి ఏదైనా రికార్డులు, పత్రాలు, పత్రాలను కోరవచ్చు.
1971లో కాగ్ డ్యూటీస్, పవర్స్ అండ్ కండిషన్స్ యాక్ట్ అని పిలువబడే రాజ్యాంగంలోని ఆర్టికల్ 149 ద్వారా కాగ్ కు అధికారం లభిస్తుంది. ఈ చట్టం కార్యాలయం యొక్క ఆదేశాన్ని వివరిస్తుంది.ప్రభుత్వాలు (కేంద్రం మరియు రాష్ట్రాలు) చేసే ప్రతి ఖర్చు, ఆదాయ సేకరణ లేదా సహాయం / గ్రాంట్ స్వీకరించే యూనిట్ తన ఆడిట్ డొమైన్ కింద పరిశీలిస్తుంది.
కాగ్ తన రాజ్యాంగబద్ధమైన పాత్రను నిర్వర్తించడానికి ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ (ఐఎ అండ్ ఎడి) సహాయపడుతుంది. ఈ కార్యాలయంలో సుమారు 600 మంది టాప్, మిడిల్ మేనేజ్మెంట్ స్థాయి అధికారులు ఉన్నారు. అదనంగా కాగ్ కార్యాలయాల్లో సుమారు 47000 మంది "సబార్డినేట్ కేడర్" సిబ్బంది దేశవ్యాప్తంగా ఉన్నారు.