Agnipath : అగ్నివీర్‌లకు ఆనంద్‌ మహీంద్ర ఆఫర్…. ఉద్యోగాలిస్తామని హామీ-anand mahindra assures job for agniveers ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Agnipath : అగ్నివీర్‌లకు ఆనంద్‌ మహీంద్ర ఆఫర్…. ఉద్యోగాలిస్తామని హామీ

Agnipath : అగ్నివీర్‌లకు ఆనంద్‌ మహీంద్ర ఆఫర్…. ఉద్యోగాలిస్తామని హామీ

HT Telugu Desk HT Telugu
Jun 20, 2022 11:11 AM IST

అగ్నిపథ్‌ పథకంపై దేశ వ్యాప్తంగా నిరసనలు పెల్లుబికుతున్న వేళ ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఆందోళనకారులకు భవిష్యత్తులో ఉద్యోగాలు కల్పిస్తామని ప్రకటించారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలపై విచారం వ్యక్తం చేసిన మహీంద్రా “అగ్నిపథ్‌” పథకంలో చేరే అగ్నివీర్‌లకు రిటైర్మెంట్‌ తర్వాత తమ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామన్నారు.

<p>అగ్నివీర్‌లకు రిటైర్మెంట్‌ తర్వాత మహీంద్రా సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆనంద్ మహీంద్రా హామీ</p>
అగ్నివీర్‌లకు రిటైర్మెంట్‌ తర్వాత మహీంద్రా సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తామని ఆనంద్ మహీంద్రా హామీ

అగ్నిపథ్‌ పథకాన్ని రద్దు చేయాలంటూ దేశవ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్న సమయంలో ఈ పథకంలో భాగంగా సైన్యంలో చేరే యువతకు రిటైర్మెంట్ తర్వాత తమ సంస్థల్లో ఉద్యోెగాలు కల్పిస్తామని ఆనంద్ మహీంద్రా హామీ ఇచ్చారు. దేశవ్యాప్తంగా చెలరేగుతున్న ఆందోళనలపై  ఆనంద్‌ మహీంద్రా విచారం వ్యక్తం చేశారు. 

అగ్నిపథ్‌ పథకంలో భాగంగా నియమితులయ్యే అగ్నివీర్‌లకు నాలుగేళ్ల రిటైర్మెంట్‌ తర్వాత  మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. గత ఏడాది అగ్నిపథ్‌ పథకం గురించి తెలిసినపుడు  తాను ఒక్కటే చెప్పానని, ఇప్పుడు అదే చెబుతున్నానని పునరుద్ఘాటించారు.  అగ్నిపథ్‌ పథకంలో భాగంగా శిక్షణ పొందే అగ్నివీర్‌లకు చక్కటి క్రమశిక్షణ అలవడటంతో పాటు వారికి లభించే మంచి నైపుణ్యాలు మంచి ఉపాధి లభించేలా చేస్తాయని అభిప్రాయపడ్డారు. సైన్యంలో శిక్షణ పొందిన సమర్ధులైన యువతకు మహీంద్రా సంస్థల్లో చేర్చుకునే అవకాశాన్ని  కల్పిస్తామన్నారు. 

ఆనంద్‌ మహీంద్రా ట్వీట్‌పై నెటిజన్ల నుంచి ప్రశ్నలు వెల్లువెత్తాయి.  అగ్నివీర్‌లకు మహీంద్రా గ్రూప్‌ ఎలాంటి ఉద్యోగాలు ఇస్తుందని నెటిజన్‌లు ప్రశ్నించారు.  ఆ ప్రశ్నకు  కూడా ఆనంద్‌ సమాధానం ఇచ్చారు. అగ్నివీరులకు  కార్పొరేట్‌ రంగంలో విస్తృత అవకాశాలు లభిస్తాయని, నాయకత్వ లక్షణాలు, టీం వర్క్‌ అలవడుతుందని, దేహదారుఢ్యంలో శిక్షణ ఉంటుందని, కార్పొరేట్ పరిశ్రమలకు వృత్తిపరమైన నైపుణ్యాలను సులువుగా అందిస్తారని అభిప్రాయపడ్డారు.  ఉత్పాదక కార్యకలాపాలు మొదలుకుని పాలనా వ్యవహారాలు, సప్లై ఛైన్, మేనేజ్మెంట్‌ ఇలా అన్ని విభాగాల్లో మాజీ సైనికులకు ఉపాధి లభిస్తుందన్నారు. 

మరోవైపు అగ్నిపథ్‌ పథకంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజకీయ పార్టీలు, పలు సంఘాలు భారత్‌ బంద్‌కు పిలుపునివ్వడంతో అన్ని రైల్వే స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద భారీ భద్రత కొనసాగుతోంది. అగ్నిపథ్‌ పథకంపై వెనక్కి తగ్గేది లేదని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో నిరసనల్ని ఉధృతం చేసేందుకు పార్టీలు సిద్ధమయ్యాయి. మరోవైపు కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మేరకు త్రివిధ దళాల్లో అగ్నిపథ్‌ పథకం ద్వారా సైన్యంలో నియామకాలకు నోటిఫికేషన్లు విడుదల

Whats_app_banner