Anakapalli Crime : అనకాపల్లి జిల్లాలో ఘోరం, గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం-నిందితులపై పోక్సో కేసు నమోదు
Anakapalli Crime : అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గిరిజన బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి అనంతరం అత్యాచారం చేశారు.
Anakapalli Crime : అనకాపల్లి జిల్లాలో ఘోరమైన సంఘటన చోటు చేసుకుంది. గిరిజన బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధిత బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ముగ్గురు నిందితులపై పోక్సో కేసు నమోదు చేశారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొలుత బాలిక అదృశ్యం అయిందని అందరూ అనున్నారు. ఆ తరువాత బాలికను కిడ్నాప్ చేశారని స్పష్టం అయింది. బాలికను కిడ్నాప్ చేసి గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. అనంతరం బాలికను పాడేరులో వదిలేసి నిందితులు పరారయ్యారు.
ఈ ఘటన అనకాపల్లి జిల్లా జి. మాడుగులలో చోటు చేసుకుంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. జి.మాడుగుల గిరిజన ఆశ్రమ పాఠశాల నుంచి ఈనెల 25న బాలిక కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులకు తెలియగానే ఈనెల 28న తమ కుమార్తె కనిపించటం లేదని పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలికను సామూహికంగా అత్యాచారం చేసి పాడేరులో విడిచిపెట్టి, నిందితులు పరారయ్యారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు బాధిత బాలిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బాలిక పాడేరులో ఉందని పోలీసులు గుర్తించారు. వెంటనే బాలికను మాడుగుల పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు.
బాలికను ఏం జరిగిందని వివరాలు పోలీసులు అడిగి తెలుసుకున్నారు. జి.మాడుగుల మండలంలోని రెండు గ్రామాలకు చెందిన కొర్రా మల్లీశ్వరరావు (22), వంతాల సన్యాసిరావు (24), మరో 16 ఏళ్ల అబ్బాయి తనకు మాయ మాయమాటలు చెప్పి ఆటోలో ఎక్కించుకుని పాడేరు తీసుకెళ్లినట్లు బాలిక చెప్పింది. అక్కడ తనపై ఆ ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారని భయపడుతూ చెప్పింది. అనంతరం బాలికను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామని బాధితురాలకి భరోసా ఇచ్చారు. దీంతో బాధిత కుటుంబం వెళ్లిపోయింది.
నిందితులు కొర్రా మల్లీశ్వరరావు (22), వంతాల సన్యాసిరావు (24), మరో 16 ఏళ్ల అబ్బాయి పోక్సో కేసు నమోదు చేశారు. అందులో వంతాల సన్యాసిరావు అదుపులోకి తీసుకున్నారు. మిగతా ఇద్దరు పరారీలో ఉన్నారు. నిందితులిద్దరి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ బి. శ్రీనివాస్ తెలిపారు. పోక్సో కేసు అయినందున డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ జరుగనుంది. అయితే ఈ ఘటన తమ కుమార్తె చదువుతున్న గిరిజన ఆశ్రమ పాఠశాల టీచర్ల ప్రమేయంతోనే జరిగిందని బాలిక తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీచర్లను కూడా పోలీసులు విచారిస్తున్నారు.
అయితే రాష్ట్రంలో చిన్నారులపై అత్యాచారాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. చిన్నారులపై దాడులు, అత్యాచారాలపై ప్రజల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వీటి నియంత్రణ తగిన చర్యలు చేపట్టాలని, అత్యాచారాలకు పాల్పడిన వారిపట్ల కఠినంగా వ్యవహరించాలని కోరుతున్నారు. ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టినప్పటికీ, అత్యాచారాల నియంత్రణ కావటం లేదు. కనుక ప్రభుత్వం తగిన విధంగా నిర్ణయాలు తీసుకుని చర్యలకు పూనుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం