Elephant Attack: పార్వతీపురం మన్యంలో ట్రావెల్స్ బస్సుపై ఏనుగు దాడి
Elephant Attack: పార్వతీపురం మన్యం జిల్లాలో ఏనుగు బీభత్సం సృష్టించింది. అంతరాష్ట్ర రహదారిపై చిందులు తొక్కింది. రోడ్డుపై వెళుతున్న వాహనాలను ధ‌్వంసం చేసింది.

Elephant Attack: పార్వతీపురం మన్యం జిల్లాలో గుంపు నుంచి తప్పిపోయిన మగ ఏనుగు బీభత్సం సృష్టించంిది. రాయగడ నుంచి పార్వతీపురం వెళుతున్న విజయదుర్గా ట్రావెల్స్ బస్సుపై ఏనుగు దాడి చేసింది. ఒడిస్సాలోని రాయగడ నుంచి శ్రీకాకుళం వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై దాడి చేసింది.
కొమరాడ మండలం అర్తం గ్రామ సమీపంలోని అంతరాష్ట్ర రహదారిపై ఏనుగు రెచ్చిపోయింది. ఏనుగు రావడం చూసి బస్సులో ప్రయాణికులు పారిపోయారు. మన్యం అటవీ ప్రాంతంలో ఆరు ఏనుగులు చాలా కాలంగా సంచరిస్తున్నాయి.
వీటిలో హరి అనే మగ ఏనుగు ఒంటరిగా తిరుగుతూ చుట్టు పక్కల ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తోంది. గతంలో కూడా చాలా సార్లు గుంపు నుంచి విడిపోయి అంతరాష్ట్ర సరిహద్దుల్లో సంచరిస్తూ ఆస్తినష్టానికి కారణమైనట్లు స్థానికులు చెబుతున్నారు.
మన్యం ప్రాంతంలో ఆరేడు ఏనుగులు చాలా కాలంగా సంచరిస్తుండటంతో వాటి కదలికల్ని నియంత్రించే అటవీ శాఖ ఇద్దరు ట్రాకర్లను కూడా నియమించింది. సోమవారం ఉదయం పార్వతీపురం మీదుగా శ్రీకాకుళం వస్తుండగా ఏనుగు బస్సును ధ్వంసం చేసింది బస్సును వెనక్కి నెట్టేయడంతో అద్దాలు పగిలిపోయాయి.
ఏనుగుల్ని అటవీ ప్రాంతంలో పంపేందుకు అటవీ శాఖ గతంలో ఇద్దరు ట్రాకర్లను ఏర్పాటు చేశారు. ఏనుగులను దారి మళ్లించే ట్రాకర్ చనిపోవడంతో నాగావళి పరివాహ ప్రాంతంలో ఇవి సంచరిస్తున్నాయి. స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఏనుగుల సమస్య పరిష్కారం కావట్లేదని ఆరోపిస్తున్నారు.