Guntur Rape and Murder: గుంటూరులో ఘోరం, వృద్ధురాలిపై అత్యాచారం చేసి చంపేశాడు… బెయిల్‌పై విడుదలైనా మారని తీరు
Guntur Rape and Murder: గుంటూరు జిల్లాలో ఉన్మాది దాష్టీకానికి వృద్ధురాలు బలైపోయింది. ఒంటరిగా నివస్తున్న వృద్ధురాలిపై కన్నేసి బలాత్కరించి హత్యకు పాల్పడటం సంచలనం సృష్టించింది. నిందితుడు ఇటీవల బెయిల్‌పై విడుదలైనట్టు గుర్తించారు.
Guntur Rape and Murder: అత్యాచారం కేసులో జైలుకు వెళ్లి బెయిల్‌పై విడుదలైన వ్యక్తి వృద్ధురాలిపై అత్యాచారం హత్య చేయడం గుంటూరులో కలకలం రేపింది. జైలు నుంచి విడుదలైన మూడు రోజులకే మరో నేరానికి పాల్పడటం పోలీసులు విస్తుబోయేలా చేసింది. 64 ఏళ్ల వృద్ధురాలిపై అత్యాాచారం చేసి ఆపై హతమార్చాడు. గుంటూరు జిల్లా పెదనందిపాడులో జరిగిన ఈ దారుణ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

మొదట అనుమానాస్పద మృతిగా భావించి కేసు నమోదు చేసిన పోలీసులు, ఆ తర్వాత విచారణలో హత్యగా గుర్తించారు. స్థానికంగా ఉండే పాత నేరస్తుడు హత్య చేసినట్టు గుర్తించారు. నిందితుడు మంజు 2023లో ఇదే తరహా ఓ మహిళపై అత్యాచారం చేసి హత్య చేసి జైలుకు వెళ్లాడు. ఆ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చాక 2024లో కూడా ఓ మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ కేసులో కొన్ని నెలలుగా జైలులో ఉన్న నిందితుడు మూడు రోజుల క్రితమే బెయిల్ పై బయటకు వచ్చాడు.
హత్యకు గురైన వృద్ధురాలు స్థానికంగా పారిశుద్య కార్మికురాలిగా పనిచేస్తోంది. కుమార్తుకు వివాహం కావడంతో మరో చోట ఉంటోంది. శనివారం రాత్రి వృద్ధురాలిపై అత్యాచారం చేసిన తర్వాత హత్యకు పాల్పడ్డాడు. హత్య తర్వాత నిందితుడు పరారయ్యాడు.
ఆదివారం ఉదయం పనికి రాక పోవడంతో గ్రామంలో ఉంటున్న కుమార్తె గుడిసె వద్దకు వచ్చి చూడగా... వృద్ధురాలు విగతజీవిగా కనిపించింది. శరీరంపై రక్తం మరకలతో పాటు ఒంటిపై పంటి గాట్లతో కనిపించింది. దీంతో మృతురాలి కుమార్తె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
శనివారం రాత్రి పాత నేరస్తులు సాంబ, మంజులు గ్రామంలో అనుమానాస్పదంగా తిరగడం చూసినట్టు స్థానికులు తెలపడంతో పోలీసులు విచారణ చేపట్టారు. ప్రాథమిక ఆధారాలతో వృద్ధురాలిపై మంజు రేప్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఘటనా స్థలాన్ని పోలీస్ అధికారులు పరిశీలించారు. ప్రత్తిపాడు సీఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఘటనా స్థలంలో క్లూస్ టీం వేలిముద్రలు సేకరిం చింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం గుంటూరు జీజీహెచ్‌కు తరలించారు. వరుస అత్యచారాలు, హత్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో నిందితుడిపై తీరుపై పోలీసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.