Sathya Sai district : ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం..! ఆపై హత్య చేసి పూడ్చిపెట్టిన పెద్దనాన్న!
Sri Sathya Sai district Crime News :సత్యసాయి జిల్లాలో దారుణం...ఎనిమిదేళ్ల బాలికను అత్యాచారం చేసి హత్యచేసిన పెదనాన్న...సైకోలా ప్రవర్తించిన వ్యక్తి
Sri Sathya Sai district Crime News : సత్యసాయి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. అణ్యంపుణ్యం తెలియని చిన్నారిపై పెద్దనాన్నే అత్యాచారం చేసి హత్యకు పాల్పడ్డాడు. సైకోగా మారి ఆ చిన్నారిని అతి దారుణంగా కొట్టి చంపేసి పెన్నా నది ఇసుక మేటల్లో పూడ్చి పెట్టాడు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
శుక్రవారం సత్యసాయి జిల్లా హిందూపురం రూరల్ మండల పరిధిలోని ఓ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గ్రామ దేవత పండగ ఉండటంతో ఒక మహిళ తన చెల్లిలి కుటుంబాన్ని ఆహ్వానించింది. చెల్లిలు బాలింత కావడంతో తాను రాలేనని భర్తతో పాటు కుమార్తెను(8) పంపింది. శుక్రవారం ఉదయాన్ని బాలికను పెదనాన్న గంగాధర్ పెన్నా నది ఒడ్డుకు తీసుకొని వెళ్లాడు. పెన్నానదిని చూపిస్తాడనుకున్న ఆ చిన్నారి… పెద్ద నాన్నతో పాటు వెళ్లింది.
అప్పటికే మద్యం సేవించి ఉన్న పెద్ద నాన్న అభం శుభం తెలియని ఆ చిన్నారిపై పెన్ననది ఒడ్డున అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత చిన్నారి గొంతు నులిమి హత్య చేశాడు. అక్కడే పెన్నానది ఇసుక మేటల్లో ఆ చిన్నారిని పూడ్చి పెట్టి ఏమీ తెలియని వాడిలా ఇంటికి వెళ్లిపోయాడు. అయితే ఇంటి నుంచి బాలికతో కలిసి వెళ్లిన గంగాధర్ ఇంటికి ఒక్కడే రావడంపై కుటుంబ సభ్యులు చిన్నారి కోసం గంగాధర్‌ను నిలదీశారు.
అయితే సరైన సమాధానం ఇవ్వకపోవడంతో అనుమానం వచ్చి… హిందూపురం రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి గంగాధర్‌ను అదుపులోకి తీసుకుని విచారించడంతో తానే చిన్నారిని హత్య చేసి, ఇసుక మేటలో పూడ్చినట్లు ఒప్పుకున్నాడు. మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రాంతాన్ని చూపించాడు. అడిషనల్ ఎస్‌పీ విష్ణువర్ధన్ ఘటనా స్థలాన్ని సందర్శించారు. సీఎస్‌డీటీ హారతి, హిందూపురం రూరల్ సీఐ శ్రీనివాసులు ఆధ్వర్యంలో రెవెన్యూ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని వెలికి తీశారు.
అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దీంతో చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అయ్యారు. బంధువులు శోకసంద్రంలోకి ఉన్నాయి. ఆ గ్రామంలో కలకలం రేపింది. ఆ ప్రాంతమంతా విషాద చాయలు అలుముకున్నాయి. నిందితుడు గంగాధర్‌ను డీఎస్పీ కంజాక్షన్ అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.
గతంలోనూ కేసులు…!
గంగాధర్ మద్యం, గంజాయికి బానిసయ్యాడు. ఆయన ఇప్పటికే పలు నేరాలకు పాల్పడ్డాడు. కేసులను ఎదుర్కొన్నాడు. 2012లో పెనుకొండ నాగలూరుకు చెందిన హనుమక్క మహిళనను హత్య చేసి చెరువలో పడేసిననట్లు ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు గంగాధర్‌పై కేసు నమోదు చేశారు. అయితే 2017లో కేసును సరైనా ఆధారాలు లేవని కోర్టు కొట్టేసింది.
2020లో తూముకుంటలోని ఓ పాఠశాలలో పని చేసే నాగరత్నమ్మ అనే 70 ఏళ్ల వృద్ధ మహిళతో రూ. మూడు వేల విషయంలో ఘర్షణ పడి ఆమెను బండరాయితో కొట్టి హత్య చేశాడు. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో ఉంది. నిందితుడు గంగాధర్ బెయిల్‌పై ఈ ఏడాది జనవరిలో బయటకు వచ్చి ఇప్పుడు చిన్నారిపై ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు. నిందితుడు సైకో అని… ఆయన చేష్టలతో తమను భయబ్రాంతులకు గురి చేసేవాడని గ్రామస్థులు చెప్తున్నారు.