AP Govt Housing : 2014-19 మధ్య నిర్మించిన ఇళ్లకు కూడా డబ్బులు చెల్లిస్తాం, మంత్రి పార్థసారథి కీలక ప్రకటన
AP Govt Housing : రానున్న 100 రోజుల్లో 1.20 లక్షల ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గత ప్రభుత్వం గృహనిర్మాణాలను వ్యాపార ధోరణిలో చూసిందన్నారు. 2014-19 మధ్య నిర్మించిన గృహాలకు కూడా డబ్బు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారన్నారు.
AP Govt Housing : సీఎం చంద్రబాబు నిర్ణయం మేరకు 2014-19 మధ్య నిర్మించిన ఇళ్లకు కూడా డబ్బులు చెల్లిస్తామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. రాష్ట్రంలో వంద రోజుల్లో 1.20 లక్షల ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాబోయే రోజుల్లో మొత్తంగా 7 లక్షల ఇళ్ల నిర్మాణమే లక్ష్యమన్నారు. మంగళవారం గృహనిర్మాణ శాఖపై సమీక్ష చేపట్టామని తెలిపారు. మైలవరంలో ఇళ్ల స్థలాల అంశంలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. వైసీపీ ప్రభుత్వంలో నిర్ణయించిన స్థలాలు నివాసయోగ్యంగా లేవన్నారు. గత ప్రభుత్వం సాధ్యాసాధ్యాలు పరిశీలించకుండా భూములు కొనుగోలు చేసిందన్నారు. కొన్నిచోట్ల వరదలకు నీట మునిగే అవకాశం ఉందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాజకీయ కక్షపూరిత ఆలోచనలు కారణంగా ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడ్డారన్నారు.
మట్టికి బదులుగా ఫ్లై యాష్ వినియోగం
రాష్ట్ర ప్రభుత్వం గృహ నిర్మాణాల్లో మట్టి కోసం కొత్త విధానం ఆలోచించామని మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. మట్టికి బదులుగా ఫ్లై యాష్‌ను ఉపయోగించే విధంగా ఆలోచన చేస్తున్నామన్నారు. వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా 2014-2019 మధ్య నిర్మించిన గృహ నిర్మాణాలు మనుగడపై కొన్ని ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయన్నారు. 2014-19 మధ్య నిర్మించిన గృహాలకు కూడా డబ్బు ఇవ్వాలని చంద్రబాబు నిర్ణయించారన్నారు. గత ప్రభుత్వం గృహనిర్మాణాలను వ్యాపార ధోరణిలో చూసిందని విమర్శించారు. వైసీపీ హయాంలో చాలా నిర్మాణ సంస్థలు డబ్బులు తీసుకొని ఇళ్లు నిర్మించకుండా ఎగ్గొట్టారని మంత్రి తెలిపారు.
రుణం తీసుకుని ఇల్లు కట్టుకోపోతే
సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకు ఇళ్ల నిర్మాణాలను క్వాలిటీ చెక్ చేస్తామని మంత్రి పార్థసారథి తెలిపారు. 500 ఇళ్లు లోబడి నిర్మాణాలు చేసిన సంస్థలను గుర్తించి వారికి నగదు చెల్లించే ఏర్పాటు చేస్తున్నామన్నారు. అయితే లబ్ధిదారులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం ప్రభుత్వానికి లేదని, కానీ రుణం తీసుకుని ఇల్లు నిర్మాణం చేపట్టని వారు భవిష్యత్తులో ఇబ్బందిపడతారని హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణానికి 1.5 లక్షలు మాత్రమే ఇస్తుందన్నారు.
ఇళ్ల నిర్మాణానికి రూ.4 లక్షలు
ఏపీలో కొత్త ఇల్లు నిర్మించుకునే వారికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.4 లక్షలు ఆర్థిక సాయం అందించనున్నాయి. నాలుగు లక్షల్లో కేంద్ర ప్రభుత్వం వాటా రూ.2.50 లక్షల కాగా, రాష్ట్ర ప్రభుత్వం వాటా రూ.1.50 లక్షలు. దీంతో పాటు ఉపాధి హామీ పథకం కింద అదనంగా రూ.30 వేలు సైతం చెల్లిస్తారు. 2024-25 నుంచి అమలుచేయనున్న ప్రధానమంత్రి ఆవాస్ యోజన(పట్టణ)2.0 పథకం మార్గదర్శకాలను కేంద్రం సవరించింది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలపై దృష్టి పెట్టింది. ఇకపై ఇల్లు నిర్మించుకునే వారికి రూ.4 లక్షలు సాయం అందించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
టాపిక్