Ambati On CBN: మధ్యంతర బెయిల్‌ వస్తే న్యాయం గెలిచినట్టేలా అవుతుందన్న అంబటి-ambati rambabu says that chandrababu got interim bail due to ill health ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Ambati Rambabu Says That Chandrababu Got Interim Bail Due To Ill Health

Ambati On CBN: మధ్యంతర బెయిల్‌ వస్తే న్యాయం గెలిచినట్టేలా అవుతుందన్న అంబటి

Sarath chandra.B HT Telugu
Oct 31, 2023 01:38 PM IST

Ambati On CBN: చంద్రబాబుకు అనారోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ మంజూరు చేస్తే టీడీపీ నేతలు న్యాయం గెలిచింది, ధర్మం గెలిచింది చంద్రబాబు బయటకు వచ్చారంటూ హంగామా చేస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేశా చేశారు.

అంబటి రాంబాబు
అంబటి రాంబాబు

Ambati On CBN: చంద్రబాబు నిజం గెలిచి బయటకు రాలేదని, దర్యాప్తు పూర్తై ఛార్జిషీటు వేయడంతో కూడా బెయిల్ ఇవ్వలేదని, మధ్యంతర బెయిల్ కంటి చికిత్స కోసం ఇచ్చారని, ఓ కంటి ఆపరేషన్ చేయించుకున్నారు, మరో కంటి ఆపరేషన్ చేయించుకోవాలని ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులు చెప్పడంతో నాలుగు వారాలు చికిత్స కోసం అనుమతించారని అంబటి చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు

చంద్రబాబు నాలుగు వారాల తర్వాత కోర్టులో లొంగిపోవాలని చెప్పారన్నారు. యుద్ధం ఇప్పుడు ప్రారంభమైందని లోకేష్‌ అనడాన్ని తప్పు పట్టారు. ఆరోగ్యం బాగోలేదు, చెమటలు పడుతున్నాయంటే ఏసీలు కావాలంటే ఏర్పాటు చేశారన్నారు. జైల్లో కోర్టులు ఏసీలు పెట్టగలరు కానీ శస్త్ర చికిత్సలు జైల్లో చేయలేరు కాబట్టి మానవతా ధృక్పథంతో మాత్రమే కోర్టు అనుమతి మంజూరు చేసిందన్నారు.

న్యాయం గెలిచిందని ఊరేగింపులు చేస్తామంటే కుదరదన్నారు. విచారణ పూర్తై కేసు కొట్టేస్తే న్యాయం జరిగిందని భావించవచ్చన్నారు. కేసు దర్యాప్తులో ఉందని, కొందరిని చంద్రబాబు అమెరికా పంపేశారని వారిని కూడా విచారించాల్సి ఉందని అప్పుడే కేసు కొలిక్కి వస్తుందన్నారు. కంటి ఆపరేషన్ కు బెయిల్ ఇస్తే.. ధర్మం గెలిచినట్టా అని ప్రశ్నించారు. నిజం గెలిచి చంద్రబాబుకు బెయిల్ రాలేదని చెప్పారు.

టీడీపీ నేతలు రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం, అత్యుత్సాహంతో నోటికొచ్చినట్లు మాట్లాడటం మంచి పద్ధతి కాదన్నారు.చంద్రబాబు పూర్తి రిలీఫ్ తో బయటకు ఏమీ రాలేదని మానవతాదృక్పథంతో కంటి ఆపరేషన్ చేయించుకోవడం కోసం, నిబంధనలతో ఇచ్చిన మధ్యంతర బెయిల్ మాత్రమే.. దీనికి ఊరేగింపులు, సంబరాలు చేసుకోవడం అంటే అంతకంటే అజ్ఞానం మరొకటి ఉండదన్నారు.

ఎక్కడైతే, నందమూరి తారక రామారావు టీడీపీని ప్రారంభించాడో, స్థాపించాడో, ఆ పార్టీ జెండా పాతాడో.. ఎక్కడైతే హైదరాబాద్ నడిబొడ్డులో టీడీపీ జెండా ఎగురవేశాడో.. అక్కడే టీడీపీ జెండాను చంద్రబాబు పీకేశాడని, తెలంగాణలో టీడీపీ దుకాణం బంద్ అయిందని అంబటి ఎద్దేవా చేశారు. అక్కడ ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న జ్ఞానేశ్వర్ కు జ్ఞానోదయం అయిందన్నారు

జ్ఞానేశ్వర్ ను పార్టీ అధ్యక్షుడిగా పెట్టి, ఆయన చేత డబ్బులు ఖర్చు పెట్టించి, బీసీలకు పట్టం కడతామని చంద్రబాబుతో పాటు ఆ పార్టీ నేతలు పెద్ద పెద్ద ఉపన్యాసాలు చెప్పి, చివరికి ఆ పార్టీ జెండానే పీకేసే పరిస్థితికి వచ్చారన్నారు.ఎన్నికలకు నెల రోజుల ముందు వరకూ.. తెలంగాణలో పోటీ చేస్తామని, అభ్యర్థుల జాబితాను తయారు చేయాలని జ్ఞానేశ్వర్ కు చెప్పి, ఈలోపే పార్టీ జెండాను చంద్రబాబు పీకేశారని తెలంగాణలో పోటీ చేయకుండా పారిపోయారన్నారు

ఆంధ్రాలో కూడా ఎన్నికల ముందో,ఆ తర్వాతో టీడీపీ జెండా పీకేస్తారు.బహుశా ఎన్నికల తర్వాత పీకేయడం ఖాయం అన్నారు. ఇతర పార్టీల గెలుపు కోసం తెలుగుదేశాన్ని తాకట్టు పెట్టారని జ్ఞానేశ్వర్ చెప్పాడని ఇతర పార్టీలంటే ఏ పార్టీలో తాను చెప్పాల్సిన పనిలేదన్నారు.

చంద్రబాబు రాజకీయాలు ఎంత దుర్మార్గంగా ఉంటాయన్నది.. తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. జ్ఞానేశ్వర్ ఫోన్లు చేస్తుంటే.. లోకేష్ ఫోన్లు కూడా ఎత్తడం లేదని, లోకేష్ వల్లే సర్వనాశనం అయిందని కూడా జ్ఞానేశ్వర్ చెప్పాడన్నారు. ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా టీడీపీకి చంద్రబాబు ఇచ్చిన గిఫ్ట్ ఏంటంటే.. తెలంగాణాలో ఆ పార్టీ జెండా పీకేయడమే అన్నారు.

IPL_Entry_Point