Amazon Women Delivery Station : ఏపీలో అమెజాన్ డెలివరీ స్టేషన్.. ఓన్లీ మహిళలే-amazon all women delivery station started in rajahmundry ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Amazon All Women Delivery Station Started In Rajahmundry

Amazon Women Delivery Station : ఏపీలో అమెజాన్ డెలివరీ స్టేషన్.. ఓన్లీ మహిళలే

HT Telugu Desk HT Telugu
Sep 14, 2022 07:13 PM IST

Amazon Delivery Services : ఆంధ్రప్రదేశ్‌లో డెలివరీ సర్వీస్ పార్ట్‌నర్‌తో కలిసి అతిపెద్ద మహిళా డెలివరీ స్టేషన్‌ను ప్రారంభించింది అమెజాన్. మహిళ సాధికారతలో భాగంగా అమెజాన్ ఇండియా భారతదేశంలో అతి పెద్ద మహిళా డెలివరీ స్టేషన్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.

అమెజాన్ ఆల్ ఉమెన్ డెలివరీ స్టేషన్
అమెజాన్ ఆల్ ఉమెన్ డెలివరీ స్టేషన్

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో డెలివరీ సర్వీస్ పార్టనర్ ద్వారా అమెజాన్ ఇండియా డెలివరీ స్టేషన్ ను ప్రారంభించింది. కొత్తగా ప్రారంభించిన ఈ డెలివరీ కేంద్రం రాష్ట్రంలో రెండోది. ఈ ప్రాంతం నుంచి సుమారుగా 50 మంది మహిళలకు ఉద్యోగ అవకాశాలను అందిస్తోంది. మోరంపూడి, లాలాచెరువు, దానవాయిపేట, ప్రకాశ్ నగర్, తిలక్ రోడ్డు, ఇతర ప్రాంతాలలోని వినియోగదారులకు అమెజాన్ ప్యాకేజీలను అందించేందుకు ఈ కేంద్రం సహకరించనుంది. ఆంధ్రప్రదేశ్‌లో మొట్టమొదటి మహిళా డెలివరీ స్టేషన్‌ను గుంటూరు జిల్లా పిడుగురాళ్ల పట్టణంలో 2021 నవంబర్‌లో ప్రారంభించారు.

ట్రెండింగ్ వార్తలు

ఆంధ్రప్రదేశ్‌లో ఈ డెలివరీ స్టేషన్‌ను ప్రారంభించడం ద్వారా పండుగ సీజన్‌కు ముందుగా అమెజాన్ ఇండియా వినియోగదారులకు మరింత చేరువకావడమే కాకుండా, డెలివరీ సర్వీస్ భాగస్వాములు, వారు తీసుకునే అసోసియేట్‌లకు వృద్ధి, పని అవకాశాలనూ అందిస్తుంది. వీటిలో స్టేషన్ మేనేజర్లు, ప్రాసెస్ అసోసియేట్‌లు, డెలివరీ అసోసియేట్‌ల వరకు ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. ఏదైనా మద్దతు, సహాయం కోసం డయల్ చేసేందుకు అసోసియేట్‌ల ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్‌ను అందుబాటులో ఉంచింది అమెజాన్.

పూర్తిగా మహిళల భాగస్వామి డెలివరీ స్టేషన్ ప్రారంభం గురించి అమెజాన్ లాజిస్టిక్స్, ఇండియా డైరెక్టర్ డా.కరుణ శంకర్ పాండే మాట్లాడుతూ..'అమెజాన్ ఇండియాలో మహిళలకు పని, వృద్ధి అవకాశాలు, సమాన అవకాశాలను అందించేందుకు మేం కట్టుబడి ఉన్నాం. భారతదేశంలోనే అతిపెద్ద మహిళా డెలివరీ స్టేషన్‌ను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభించడం ద్వారా రాష్ట్రంలో మహిళలకు పెట్టుబడులు పెట్టడానికి, అవకాశాలను సృష్టించేందుకు మా మద్దతు ఉంటుంది.' అని ఆయన అన్నారు.

ఈ ఆల్-ఉమెన్ డెలివరీ స్టేషన్‌ను ప్రారంభించి, లాజిస్టిక్స్ రంగంలో మహిళలకు అవకాశాలను వృద్ధి చేసేందుకు ప్రయత్నం చేస్తున్నట్టు అమెజాన్ ప్రకటించింది. కంపెనీకి ఇప్పటికే మొత్తం ఆరు మహిళా డెలివరీ స్టేషన్లను భాగస్వాములతో నిర్వహిస్తున్నారు. తమిళనాడు, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, మిజోరాంలలో ఒక్కొక్కటి, కేరళలో రెండు ఉన్నాయి.

అమెజాన్ కోసం డెలివరీ చేయడం ఆనందంగా ఉందని డెలివరీ అసోసియేట్ మాధవి నాగళ్ల అన్నారు. రాజమండ్రిలోని పూర్తిగా మహిళలు నిర్వహిస్తున్న కేంద్రంలో భాగంగా అమెజాన్ కోసం డెలివరీ చేయడం తన జీవితాన్ని సానుకూలంగా మార్చిందని వ్యాఖ్యానించారు.

IPL_Entry_Point