Prashant Kishor On Jagan : వచ్చే ఎన్నికల్లో జగన్ కు భారీ ఓటమి ఖాయం, ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు-amaravati news in telugu political analyst prashant kishor says jagan losing big in next elections ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Amaravati News In Telugu Political Analyst Prashant Kishor Says Jagan Losing Big In Next Elections

Prashant Kishor On Jagan : వచ్చే ఎన్నికల్లో జగన్ కు భారీ ఓటమి ఖాయం, ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
Mar 03, 2024 09:41 PM IST

Prashant Kishor On Jagan : వచ్చే ఎన్నికల్లో జగన్ కు భారీ ఓటమి ఖాయమని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ప్రశాంత్ కిషోర్
ప్రశాంత్ కిషోర్

Prashant Kishor On Jagan : వచ్చే ఎన్నికల్లో జగన్ భారీ ఓటమి ఖాయమని పొలిటికల్ ఎనలిస్ట్ ప్రశాంత్ కిశోర్(Prashant Kishor On Jagan) సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన... సమకాలీన రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్(Jagan) కు ఓటమి కాదు భారీ ఓటమి ఖాయమన్నారు. చదువుకున్న వాళ్లు ఉద్యోగాలు కోరుకుంటున్నారు, ఉచిత పథకాలు కాదన్నారు. సంక్షేమ పథకాల పేరుతో డబ్బులిస్తున్నామంటే ఓట్లు రాలవన్నారు. సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి ముఖ్యమన్నారు. తెలంగాణలో కేసీఆర్ ఓటమి కూడా ఇదే కారణన్నారు. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికల్లో వైసీపీ వ్యూహకర్తగా పనిచేశారు. వైసీపీ విజయం పీకే కీలక పాత్ర పోషించారు. అయితే తాజాగా ఆయన వైసీపీ(Ysrcp) పాలనపై ఈ తరహా వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతున్నాయి. పీకే(PK) కామెంట్స్ పై వైసీపీ శ్రేణులు సామాజిక మాధ్యమాల్లో కౌంటర్ ఇస్తున్నాయి. సర్వేలన్నీ వైసీపీకి అనుకూలంగా ఉన్నాయని... జగన్ ప్రభుత్వమే వస్తుందని చెబుతున్నాయి.

ట్రెండింగ్ వార్తలు

అదే జగన్ కు పెద్ద మైనస్

హైదరాబాద్‌లో ఓ పత్రికా కాంక్లేవ్‌లో మాట్లాడిన ప్రశాంత్ కిషోర్... ఏపీ రాజకీయాలపై స్పందించారు. ప్రజల బాగోగులు చూస్తున్నామంటూ వాళ్ల సొమ్మును ఖర్చు చేయడం తప్పు అన్నారు. ఏపీ సీఎం జగన్ ఇలా చేస్తుండడం వల్లే రాజకీయంగా నష్టపోతున్నారన్నారు. తెలంగాణలో కేసీఆర్‌ ఈ కారణంగానే ఓడిపోయారన్నారు. గత ఏదేళ్లలో ఏం చేశారనేది చూసి ప్రజలు ఓట్లు వేస్తున్నారన్నారు. ఎన్నికలపై విద్య, ఉపాధి, అభివృద్ధి ప్రభావిత అంశాలు అన్నారు. ప్యాలెస్‌లో కూర్చొని బటన్స్ నొక్కితే ఓట్లు పడవన్నారు. ప్రజల మధ్యలోకి రాకపోవడం సీఎం జగన్‌కు మైనస్ అవుతుందని పీకే జోస్యం చెప్పారు. గతంలోనూ వైసీపీ పాలనపై ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు. సంపద సృష్టించకపోతే డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చి పంచుతారన్నారు. సంపద సృష్టించే బాధ్యత ప్రభుత్వాలదేనన్నారు. సంపద సృష్టికి ప్రభుత్వాలే సహకరించకపోతే పంచటానికి సొమ్ము ఎక్కడి నుంచి వస్తుందన్నారు.

గతంలో చంద్రబాబుతో భేటీ

గత ఎన్నికల్లో వైసీపీకి పనిచేసి ప్రశాంత్ కిషోర్... ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబును కలిశారు. దీంతో పీకే టీడీపీ తరఫున పనిచేస్తున్నారని ప్రచారం జరిగింది. కానీ ఇందులో వాస్తవంలేదని, ఆయన మర్యాదపూర్వకంగానే కలిశారని తెలిసింది. చంద్రబాబుకు తనకు సన్నిహితుడైన ముఖ్యమైన ఓ ప్రముఖ నాయకుడు కోరడంతోనే తాను విజయవాడ వెళ్లానని ప్రశాంత్‌ కిషోర్‌ స్పష్టం చేశారు. చంద్రబాబును కలిసే అంశం చాలా రోజులుగా పెండింగ్‌లో ఉందని, తన మిత్రుడు చంద్రబాబును కలవాలని కోరడంతో విజయవాడ వెళ్లినట్టు ప్రశాంత్‌ కిషోర్ అప్పట్లో చెప్పారు.

పీకేపై వైసీపీ నేతలు ఫైర్

ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు తీవ్రంగా మండిపడుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఏమైనా మాయల ఫకీరా అని ఎద్దేవా చేస్తున్నారు. బిహార్ లో రాజకీయ పార్టీ పెట్టి, వివిధ పార్టీలకు పొలిటికల్ ఎనలిస్ట్ గా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ కు ఏపీ రాజకీయాలతో సంబంధం ఏంటని మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. ప్రశాంత్ కిషోర్ చెప్పిన మాటలకు ఎల్లో మీడియా విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను ఏమార్చేందుకు ప్రయత్నిస్తుందన్నారు. మంత్రి అంబటి సైతం పీకే కామెంట్స్ కు కౌంటర్ ఇచ్చారు. గతంలో లగడపాటి కూడా ఏపీ ఎన్నికల ఫలితాలపై జోస్యం చెప్పారని, ఇప్పుడు లగడపాటి రాజగోపాల్ రాజకీయ సన్యాసం తీసుకున్నారన్నారు. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సైతం ఏపీ ఎన్నికల ఫలితాలపై తప్పుడు జోస్యం చెప్పి సన్యాసానికి సిద్ధంగా ఉన్నారంటూ అంబటి రాంబాబు ట్వీట్ చేశారు.

IPL_Entry_Point