High Court On DSC Notification : బీఈడీ అభ్యర్థులతో ఎస్జీటీ పోస్టుల భర్తీ సుప్రీం నిబంధనలకు వ్యతిరేకం, హైకోర్టులో వాదనలు-amaravati news in telugu petitions on dsc notification sgt posts with bed candidates in ap high court ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  High Court On Dsc Notification : బీఈడీ అభ్యర్థులతో ఎస్జీటీ పోస్టుల భర్తీ సుప్రీం నిబంధనలకు వ్యతిరేకం, హైకోర్టులో వాదనలు

High Court On DSC Notification : బీఈడీ అభ్యర్థులతో ఎస్జీటీ పోస్టుల భర్తీ సుప్రీం నిబంధనలకు వ్యతిరేకం, హైకోర్టులో వాదనలు

Bandaru Satyaprasad HT Telugu
Feb 20, 2024 06:23 PM IST

High Court On DSC Notification : డీఎస్సీ నోటిఫికేషన్ లో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా బీఈడీ అభ్యర్థులు ఎలా అనుమతిస్తారా? హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నోటిఫికేషన్ ముందస్తు చర్యలొద్దని ఆదేశించింది.

ఏపీ హైకోర్టు
ఏపీ హైకోర్టు

High Court On DSC Notification : ఎన్నికల ముందు 6100 పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్(High Court On DSC Notification) ఇచ్చింది ఏపీ ప్రభుత్వం. అయితే ఇందులో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తామని ప్రకటించింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని బొల్లా సురేష్, మరికొంత మంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై మంగళవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్జీటీ పోస్టులకు(SGT Posts) బీఈడీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషన్ వాదించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతిస్తే డీఈడీ అభ్యర్థులకు తీవ్ర నష్టం జరుగుతుందని కోర్టుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్సీఈటీ నిబంధనలకు విరుద్ధంగా డీఎస్సీ ఉద్యోగాల భర్తీ చేపడుతుందని పిటిషన్ వాదించారు.

ముందస్తు చర్యలొద్దు

ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడాన్ని హైకోర్టు(High Court) సీజే ధర్మాసనం తప్పుబట్టింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉందని అభిప్రాయపడింది. నోటిఫికేషన్ ప్రక్రియపై ముందుకెళ్లొద్దని, హాల్ టికెట్లు(Hall Tickets) జారీ చేయవద్దని ఓ దశలో సీజే ధర్మాసనం స్పష్టం చేసింది. 2018లో సుప్రీం కోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎలా నోటిఫికేషన్ జారీ చేశారని హైకోర్టు ఏజీని ప్రశ్నించింది. నోటిఫికేషన్ పై ముందస్తు చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే నోటిఫికేషన్ పై మరిన్ని వివరాలు సమర్పించేందుకు ఏజీ సమయం కోరడంతో హైకోర్టు విచారణ రేపటికి వాయిదా వేసింది.

సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిఫికేషన్?

ఎస్జీటీ అభ్యర్థులు తక్కువగా ఉన్న కారణంగా బీఈడీ(B.Ed) అభ్యర్థులను అనుమతించాల్సి పరిస్థితి వచ్చిందని ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్‌ శ్రీరామ్‌ వాదించారు. అయితే అర్హలైన బీఈడీ అభ్యర్థులు రెండేళ్ల బ్రిడ్జి కోర్స్‌ చేసిన తర్వాతే టీచింగ్ కు అనుమతిస్తామని కోర్టుకు తెలిపారు. బ్రిడ్జి కోర్సుకు చట్టబద్ధత ఎలా ఉంటుందని ప్రశ్నించిన సీజే....సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా ఎలా నోటిఫికేషన్‌ ఎలా ఇస్తారని ఏజీని ప్రశ్నించారు. వెంటనే నోటిఫికేషన్‌ నిలుపుదల చేస్తామని చెప్పగా.... ప్రభుత్వ నిర్ణయం తీసుకునేందుకు ఒక్కరోజు సమయం కావాలని ఏజీ కోర్టును కోరారు. అయితే ఫిబ్రవరి 23 నుంచి డీస్సీ హాల్ టికెట్లు జారీ చేస్తున్న విషయాన్ని పిటిషనర్లు కోర్టుకు తెలిపారు. హాల్ టికెట్లు జారీ చేయకుండా ఆదేశాలు ఇస్తామని హైకోర్టు తెలిపింది.

డీఈడీ అభ్యర్థులకు తీవ్ర నష్టం

డీఎస్సీ నోటిఫికేషన్‌పై సోమవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని పిటిషనర్ న్యాయవాది వాదనలు వినిపించారు. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడం వల్ల పది లక్షల మంది డీఈడీ(D.Ed) అభ్యర్థులు నష్టపోతున్నారని కోర్టుకు తెలిపారు. సుప్రీంకోర్టు, ఎన్సీటీఈ నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసిందని వాదనలు వినిపించారు. సుప్రీం కోర్టు తీర్పులో బీఈడీ అభ్యర్థుల అనుమతిపై స్పష్టం నిబంధనలు ఉన్నా ఎలా అనుమతించారని హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. దేశ అత్యున్నత కోర్టు ఆదేశాలు మీకు వర్తించవా? అని వ్యాఖ్యానించింది.