Pawan on Hanuma Vihari: భారత క్రికెటర్ కంటే వైసీపీ కార్పొరేటర్ ముఖ్యమా? హనుమ విహారి వ్యవహారంపై పవన్ కీలక వ్యాఖ్యలు-amaravati news in telugu pawan kalyan supported hanuma vihari criticizes andhra cricket association cm jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Amaravati News In Telugu Pawan Kalyan Supported Hanuma Vihari Criticizes Andhra Cricket Association Cm Jagan

Pawan on Hanuma Vihari: భారత క్రికెటర్ కంటే వైసీపీ కార్పొరేటర్ ముఖ్యమా? హనుమ విహారి వ్యవహారంపై పవన్ కీలక వ్యాఖ్యలు

Bandaru Satyaprasad HT Telugu
Feb 27, 2024 03:21 PM IST

Pawan Kalyan on Hanuma Vihari : ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్ హనుమ విహారికి రాజకీయ పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఈ వ్యవహారంపై పవన్ కల్యాణ్ స్పందించారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ కు భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా అని ప్రశ్నించారు.

పవన్ కల్యాణ్
పవన్ కల్యాణ్

Pawan Kalyan on Hanuma Vihari : ఆంధ్ర రంజీ టీమ్ కెప్టెన్ గా హనుమ విహారిని(Hanuma Vihari) తొలగించడంపై వివాదం చెలరేగింది. జట్టులోని 17వ ఆటగాడిపై దురుసుగా ప్రవర్తించాడని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(Andhra Cricket Association) హనుమ విహారిపై చర్యలు తీసుకుంది. కానీ దీని వెనుక రాజకీయ కోణం ఉందని హనుమ విహారి ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఏపీలో రాజకీయ దుమారం రేపింది. ప్రతిపక్ష పార్టీలు హనుమ విహారికి మద్దతుగా నిలిచాయి. అధికార వైసీపీకి(Ysrcp) చెందిన కార్పొరేటర్ కుమారుడే ఆ 17వ ఆటగాడు కావడంతో... తన రాజకీయ బలం ఉపయోగించి హనుమ విహారిని కెప్టెన్ పదవి నుంచి తప్పించారని ఆరోపణలు వస్తున్నాయి. తాజాగా ఈ వ్యవహారంపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan)స్పందించారు. భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ముఖ్యమా అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. హనుమ విహారి భారత క్రికెట్ జట్టుకు 16 టెస్టుల్లో ప్రాతినిధ్యం వహించి ఐదు హాఫ్ సెంచరీలు, ఒక సెంచరీ సాధించారని గుర్తుచేశారు. ఆస్ట్రేలియాతో సిడ్నీ టెస్టులో అతడు కనబరిచిన ప్రతిభ మరువలేనిదన్నారు.

ట్రెండింగ్ వార్తలు

భారత క్రికెటర్ కంటే వైసీపీ నాయకుడే ఎక్కువ- పవన్ కల్యాణ్

ఆంధ్ర రంజీ జట్టు కెప్టెన్‌గా హనుమ విహారి గత ఏడేళ్లలో ఐదుసార్లు నాకౌట్‌కు అర్హత సాధించేలా చేశారని పవన్ అన్నారు. చేయి విరిగినా, మోకాలికి గాయమైనా జట్టు కోసం క్రీజ్ లోకి వచ్చి ఆడారని అన్నారు. ఇంతటి ప్రతిభ కలిగిన వ్యక్తిని కేవలం ఒక వైసీపీ కార్పొరేటర్ కారణంగా కెప్టెన్ గా తొలగించడం సరికాదన్నారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ వ్యవహరించిన తీరు కారణంగానే విహారి ఆంధ్ర జట్టు నుంచి తప్పుకోవాల్సి పరిస్థితి ఏర్పడిందన్నారు. ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌కు భారత క్రికెటర్, రంజీ టీమ్ కెప్టెన్ ఎలాంటి క్రికెట్ బ్యాక్‌గ్రౌండ్ లేని వైసీపీ నేతే చాలా విలువైన వ్యక్తిగా మారటం చాలా అవమానకరమన్నారు. ఆంధ్ర క్రికెట్ జట్టు కెప్టెన్‌ను రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఇంత దారుణంగా అవమానించినప్పుడు, ఇక ఆడుదాం ఆంధ్రా (Aadudam Andhra)అంటూ కోట్లు పెట్టి కార్యక్రమాలు చేయడం ఎందుకని ప్రశ్నించారు.

"హనుమ విహారి మీరు రాష్ట్రానికి, దేశానికి ఛాంపియన్ ప్లేయర్. మీ సేవలతో ఆంధ్రాలోని చిన్న పిల్లలు, క్రీడాకారులను ప్రేరేపించినందుకు మేము మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తెలుగు క్రికెట్‌ను ఇష్టపడే వారందరూ ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వ్యవహరించిన తీరుకు చింతిస్తున్నాం. మీకు చాలా మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆటగాళ్లను గౌరవించడం, గౌరవంగా చూడడం తెలిసిన స్టేట్ బోర్డ్‌తో మీరు వచ్చే ఏడాది మళ్లీ ఆంధ్రా తరపున ఆడతారని నేను ఆశిస్తున్నాను" - పవన్ కల్యాణ్

పృథ్వీరాజ్ తండ్రి విహారిపై తీవ్ర విమర్శలు

ఆంధ్ర రంజీ జట్టు మాజీ కెప్టెన్, క్రికెటర్ హనుమ విహారిపై క్రికెటర్ పృథ్వీరాజ్ తండ్రి, వైసీపీ కార్పొరేటర్ నరసింహాచారి తీవ్ర ఆరోపణలు చేశారు. విహారి తాగుబోతు, గంజాయి తాగే వ్యక్తి అని ఆరోపించారు. విహారి తన కుమారుడిని క్రికెట్ లో ఎదగనివ్వకుండా అణగదొక్కాలని చూశాడని ఆరోపించారు. జట్టుతో ఆడేందుకు అవకాశం ఇవ్వకుండా 17వ ఆటగాడిగా ఉంచాడన్నారు. తన కుమారుడ్ని అకారణంగా బూతులు తిడుతూ, దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఏసీఏకు ఫిర్యాదు చేశానన్నారు. అలాంటి వ్యక్తికి రాజకీయ పార్టీలు మద్దతు తెలపడం దారుణమని నరసింహాచారి అన్నారు.

ఆంధ్రా జట్టుకు ఆడను- విహారి

తనను కెప్టెన్ గా తొలగించడానికి రాజకీయ కారణాలు ఉన్నాయని క్రికెటర్ హనుమ విహారి నిన్న ఇన్ స్టా గ్రామ్ లో నిన్న పోస్టు పెట్టారు. ఇకపై తాను ఆంధ్రా జట్టుకు ఆడడని ప్రకటించారు. జట్టు సభ్యుల మద్దతు తనకు ఉందని చెబుతూ మిగత క్రికెటర్లు సంతకాలు చేసిన లేఖను పోస్టుచేశారు. దీనిపై వైసీపీ నేత కుమారుడు, క్రికెటర్ పృథీరాజ్ కూడా స్పందిస్తూ... ఇంత కన్నా ఏం పీకలేవు అంటూ పోస్టు పెట్టడం పెద్ద దుమారమే రేపింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం