Kodikathi Case : పక్కా ప్లాన్ ప్రకారమే కోడికత్తితో దాడి, కేసు విశాఖకు బదిలీలో ప్రభుత్వ ఒత్తిడి లేదు-సీఎం జగన్ న్యాయవాది-amaravati kodikathi case cm jagan lawyer says nia report proved srinivas intentionally attacked ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
Telugu News  /  Andhra Pradesh  /  Amaravati Kodikathi Case Cm Jagan Lawyer Says Nia Report Proved Srinivas Intentionally Attacked

Kodikathi Case : పక్కా ప్లాన్ ప్రకారమే కోడికత్తితో దాడి, కేసు విశాఖకు బదిలీలో ప్రభుత్వ ఒత్తిడి లేదు-సీఎం జగన్ న్యాయవాది

Bandaru Satyaprasad HT Telugu
Aug 30, 2023 08:34 PM IST

Kodikathi Case : కోడికత్తి కేసు విశాఖకు బదిలీ అయితే తర్వాత జరిగిన విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి. అయితే జగన్ తరఫు న్యాయవాది

కోడికత్తి కేసు
కోడికత్తి కేసు

Kodikathi Case : విశాఖ ఎయిర్ పోర్టులో జగన్ పై కోడికత్తితో దాడి చేసిన ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. కోడికత్తి కేసులో ముఖ్య నిందితుడు జనుపల్లి శ్రీనివాస్ కాదని, మంత్రి బొత్స సత్యనారాయణ మేనల్లుడు మజ్జి శ్రీను,వైసీపీ నేతలని నిందితుడి తరఫు న్యాయవాది సలీమ్ ఆరోపిస్తున్నారు. సీఎం జగన్ కోర్టుకు హాజరైతే వాస్తవాలు బయట పెడతామని సలీమ్ అంటున్నారు. అయితే సీఎం జగన్ తరఫున వాదిస్తున్న న్యాయవాది వెంకటేశ్వరరెడ్డి బుధవారం మాట్లాడుతూ... నిందితుడు శ్రీనివాస్‌కు నేర చరిత్ర ఉందని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో ఆ విషయాన్ని దాఖలు చేసిందని తెలిపారు. కోడికత్తి కేసులో ఎన్‌ఐఏ 39 మంది సాక్షులను విచారించిందన్నారు. 2017లో శ్రీనివాస్‌పై కేసు నమోదైందన్నారు. నిందితుడు శ్రీనివాస్‌ పదునైన ఆయుధంతో జగన్ పై హత్యాయత్నానికి పాల్పడ్డారని ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌లో నమోదు చేశారన్నారు.

ట్రెండింగ్ వార్తలు

విశాఖకు కేసు బదిలీతో ప్రభుత్వానికి సంబంధంలేదు

విశాఖ ఎయిర్ పోర్టులో శ్రీనివాస్ అక్రమంగా ప్రవేశించారని లాయర్ వెంకటేశ్వరరెడ్డి ఆరోపించారు. శ్రీనివాస్‌ మంచివాడని తప్పుడు రిపోర్టు ఇచ్చి ఉద్యోగంలో చేర్చారని ఆరోపించారు. ఎయిర్ పోర్టులో ఉద్యోగం చేస్తున్ననాటికి శ్రీనివాస్ పై కేసు పెండింగ్ లో ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో విశాఖ ఎన్ఐఏ కోర్టుకు కేసు బదిలీ చేశారనేది అవాస్తవం అన్నారు. ఎన్ఐఏ ఎలాంటి ఆధారాలు సేకరించకుండా ఛార్జ్ షీట్‌ దాఖలు చేసిందని ఆరోపించారు. జగన్‌పై పక్కా ప్లాన్‌ ప్రకారమే కోడికత్తితో దాడి జరిగిందని న్యాయవాది వెంకటేశ్వరరెడ్డి అన్నారు. జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ఎన్‌ఐఏ స్పష్టం చేసిందన్నారు. ఈ కేసుపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. హత్యాయత్నం చేసినట్లు శ్రీనివాస్ గతంలో ఓ ఇంటర్వ్యూలో ఒప్పుకున్నాడని, కానీ ఇప్పుడు కేసు తీవ్రతను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు.

WhatsApp channel
తెలంగాణ ఎన్నికలసవివరమైన అప్‌డేట్స్ కోసం హెచ్‌టీ తెలుగు చదవండి. కీలక నియోజకవర్గాలు , కీలక అభ్యర్థులు , పార్టీ ప్రొఫైల్స్ ,  ఎగ్జిట్ పోల్స్, గత ఫలితాలు, లైవ్ టాలీ అన్నీ ఇక్కడ చూడొచ్చు.