Amaravati Funds : అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్, రూ.4285 కోట్ల నిధులు విడుదల-amaravati gets major boost 4285 crore funds released for andhra pradesh capital ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Amaravati Funds : అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్, రూ.4285 కోట్ల నిధులు విడుదల

Amaravati Funds : అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్, రూ.4285 కోట్ల నిధులు విడుదల

Amaravati Funds : ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం రూ.4285 కోట్లు విడుదల చేసింది. రాజధాని నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులు 25 శాతం అడ్వాన్స్ గా ఇచ్చింది. కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4285 కోట్లు విడుదల చేసింది.

అమరావతి కేంద్రం గుడ్ న్యూస్, రూ.4285 కోట్ల నిధులు విడుదల

Amaravati Funds : ఏపీ రాజధాని అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. రాజధాని నిర్మాణానికి రూ.4285 కోట్ల నిధులు విడుదల చేసింది. రాజధాని నిర్మాణ పనుల కోసం ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులు 25 శాతం విడుదల చేసింది. ఈ నిధులకు కేంద్రం వాటా రూ.750 కోట్లు కలిపి మొత్తం రూ.4285 కోట్లు ఇచ్చింది. అమరావతిలో పనులు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో 25 శాతం నిధులు అడ్వాన్స్‌గా ఇవ్వాలని సీఆర్డీఏ కేంద్రాన్ని కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా నిధులను విడుదల చేసింది.

అమరావతిలో ప్రధాని మోదీ పర్యటన

ప్రధాని మోదీ ఏపీ రాజధాని అమరావతిలో పర్యటనకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి ప్రధాని మోదీ ఏప్రిల్ మూడో వారంలో ఏపీకి రానున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. ఈ కార్యక్రమానికి లక్షల్లో ప్రజలు హాజరయ్యే అవకాశం ఉండటంతో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాట్లు చేస్తుంది. వెలగపూడి సచివాలయం సమీపంలో 250 ఎకరాల్లో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు పనులు ప్రారంభించారు. సామాన్య ప్రజలతో పాటు వీవీఐపీలు, వీఐపీల రాకపోకలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సభాస్థలికి చేరుకునేందుకు మొత్తం 8 మార్గాలను గుర్తించారు.

దేశంలోకెల్లా అతిపెద్ద రైల్వే స్టేషన్

నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం అవుతున్నాయి. అమరావతి నగరాన్ని రోడ్డు, రైలు, వాయు మార్గాల ద్వారా నేరుగా అనుసంధానించేలా, అత్యధునిక పరిజ్ఞానంతో మౌలిక వసతులు కల్పించేలా చర్యలు చేపడుతున్నారు. అమరావతిలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన రైల్వేస్టేషన్‌ను నిర్మించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. నెక్కల్లు-పెదపరిమి సమీపంలో దేశంలోకెల్లా అతిపెద్ద రైల్వేస్టేషన్‌ను నిర్మించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో కోసం ఏపీ ప్రభుత్వం రైల్వేశాఖకు సుమారు 1500 ఎకరాలు అప్పగించేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

అమరావతి రైల్వేలైన్‌ను రెండు దశలుగా చేపట్టాలని కేంద్ర రైల్వేశాఖ ఇటీవల నిర్ణయించింది. మొత్తం 56.53 కి.మీ. రైల్వేలైన్‌లో ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం నుంచి 27 కి.మీ. లైన్‌ను మొదటి దశగా చేపట్టనున్నారు. ఈ రైల్వే లైన్ కోసం రెండు నెలల్లో టెండర్లను ఆహ్వానించనున్నారు. తొలి దశలోనే దాములూరు-వైకుంఠపురం మధ్య కృష్ణానదిపై 3.2 కి.మీ. మేర రైల్వే బ్రిడ్జి నిర్మాణం చేపడతారు. వచ్చే రెండు నెలల్లోగా భూసేకరణ పూర్తి చేయగలమని రైల్వే శాఖ ధీమా వ్యక్తం చేసింది. తొలిదశ పనుల కోసం సుమారు రూ.800 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. తాడికొండ మండలంలో రైల్వే లైన్ కోసం భూములిచ్చేందుకు కొందరు రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో అక్కడ భూసేకరణ ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది.

అమరావతి రైల్వేస్టేషన్‌ను ఎయిర్ పోర్టు తరహాలో నగర శివారులో ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. దేశంలోకెల్లా అతిపెద్ద మోడల్‌ రైల్వేస్టేషన్‌గా అత్యాధునిక సౌకర్యాలతో ఎంతో ప్రతిష్ఠాత్మకంగా దీనిని నిర్మించాలని సీఎం చంద్రబాబు కేంద్రాన్ని విజ్ఞప్తి చేశారు.

బండారు.సత్యప్రసాద్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలు, పొలిటికల్ వార్తలను రాస్తారు. అలాగే ఆరోగ్యం, విద్యా ఉద్యోగ, లైఫ్ స్టైల్ వార్తలు రాస్తారు. జర్నలిజంలో 6 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఆంధ్ర యూనివర్సిటీలో జర్నలిజం(MJMC) పీజీ చేశారు. గతంలో ఈటీవీ భారత్, ఇన్ షార్ట్స్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పనిచేశారు. సత్యప్రసాద్ 2023లో హెచ్.టి.తెలుగులో చేరారు.

సంబంధిత కథనం