Cyber Crime : సైబర్ వలలో దేశం, నాలుగు నెలల్లో రూ.7 వేల కోట్లు దోచేశారు!-amaravati cyber crimes increasing last four months 7 thousand crore cheated 10k firs registered ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cyber Crime : సైబర్ వలలో దేశం, నాలుగు నెలల్లో రూ.7 వేల కోట్లు దోచేశారు!

Cyber Crime : సైబర్ వలలో దేశం, నాలుగు నెలల్లో రూ.7 వేల కోట్లు దోచేశారు!

HT Telugu Desk HT Telugu
May 25, 2024 03:20 PM IST

Cyber Crime : దేశంలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. గత నాలుగు నెలల్లో రూ.7 వేల కోట్లు దోచేశారు. ఈ నాలుగు నెలల్లో 10 వేల ఎఫ్ఐఆర్ లను నమోదు అయ్యాయని ఇండియన్ సైబర్ క్రైమ్ నివేదిక చెబుతోంది.

సైబర్ వలలో దేశం, నాలుగు నెలల్లో రూ.7 వేల కోట్లు దోచేశారు!
సైబర్ వలలో దేశం, నాలుగు నెలల్లో రూ.7 వేల కోట్లు దోచేశారు! (pixabay )

Cyber Crime : దేశంలో సైబర్ నేరాలతో నాలుగు నెలల్లో రూ.7,061.51 కోట్లు లూటీ చేశారు నేరగాళ్లు.‌ అలాగే దేశంలో సైబర్ నేరాల సంఖ్య కూడా వేగంగా పెరుగుతోంది. ఈ ఏడాది మే వరకు సగటున ప్రతిరోజూ ఏడు వేల కంటే ఎక్కువ ఫిర్యాదులు నమోదయ్యాయి. ఈ విషయాన్ని ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సీఈవో రాజేష్ కుమార్ ఇటీవలి వెల్లడించారు. 2021-2022 మధ్య కాలంలో దేశంలో సైబర్ నేరాల ఫిర్యాదులు 113.7 శాతం పెరగాయి. 2019లో ఇటువంటి ఫిర్యాదుల సంఖ్య 26,049 ఉండగా, ఈ సంఖ్య 2020లో 2,55,777కు చేరుకుంది. 2021లో 4,52,414, 2022లో 9,56,790, 2023లో 15,56,215. 2024 ఏప్రిల్ నాటికి 7,40,957 ఫిర్యాదులు నమోదయ్యాయి.

డిజిటల్ మోసాలు

చాలా ఫిర్యాదులు నకిలీ ట్రేడింగ్ యాప్‌లు, లోన్ యాప్‌లు, గేమింగ్ యాప్‌లు, డేటింగ్ యాప్‌లకు సంబంధించినవిగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. సైబర్ క్రైం పట్ల అప్రమత్తంగా ఉండాలని నిపుణులు తెలుపుతున్నారు. ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్‌కు ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య డిజిటల్ మోసాలకు సంబంధించి మొత్తం 4,599 ఫిర్యాదులు అందాయి. వాటిలో స్కామర్లు మొత్తం రూ.1203.06 కోట్లను దోచేశారు. ఇది కాకుండా ట్రేడింగ్ మోసాలకు సంబంధించి 20,043 ఫిర్యాదులు అందాయి. వీటిలో ప్రజలు 14,205.83 కోట్ల రూపాయల నష్టాన్ని చవిచూశారు. పెట్టుబడి మోసాలపై 62,687 ఫిర్యాదులు అందాయి. వీటి ద్వారా సైబర్ నేరగాళ్లు రూ.2,225.82 కోట్ల మేర ప్రజలను మోసం చేశారు. ఇది కాకుండా 1,725 డేటింగ్ స్కామ్‌ల ఫిర్యాదులు అందాయి, ఇందులో రూ.132.31 కోట్ల మోసం జరిగింది.

10 వేల ఎఫ్ఐఆర్ లు నమోదు

దీంతో దేశంలో గత నాలుగు నెలల్లోనే సైబర్ క్రైమ్‌లలో పోగొట్టుకున్న మొత్తం రూ. 7,061.51 కోట్లు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. గత 4 నెలల్లో సుమారు 3.25 లక్షల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేశారు. ఇది కాకుండా 5.3 లక్షల సిమ్ కార్డులు బ్లాక్ చేశామని, వాట్సాప్ గ్రూపులతో సహా 3,401 సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేసినట్లు అధికారులు తెలుపుతున్నారు. సైబర్ నేరాలపై వివిధ సంస్థల ద్వారా మొత్తం 10,000 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

టీ20 వరల్డ్ కప్ 2024

సంబంధిత కథనం