CM Chandrababu : ఇకపై రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం-amaravati cm chandrababu key decision to grant land passbook with govt symbol ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Cm Chandrababu : ఇకపై రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu : ఇకపై రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

Bandaru Satyaprasad HT Telugu
Jul 29, 2024 06:45 PM IST

CM Chandrababu : ఇకపై పట్టాదారు పాసు పుస్తకాలు రాజముద్రతో ముద్రించాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. గత ప్రభుత్వం పాసు పుస్తకాలపై జగన్ బొమ్మల కోసం రూ.15 కోట్లు వృధా చేసిందని మండిపడ్డారు. జగన్ బొమ్మలతో సర్వే రాళ్ల ఏర్పాటుకు రూ.650 కోట్ల ఖర్చు చేసిందన్నారు.

ఇకపై రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం
ఇకపై రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు, సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం

CM Chandrababu : సీఎం చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించారు. సీఎం చంద్రబాబు సోమవారం రెవెన్యూ స్టాంపులు రిజిస్ట్రేషన్లపై సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో పట్టాదారు పాసు పుస్తకాల ముద్రణపై కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రభుత్వ రాజముద్రతో భూ యజమానులకు పట్టాదారు పాసు పుస్తకాలు అందించాలని నిర్ణయించారు. ఇకపై జనం ఆస్తులపై జగన్ బొమ్మలు వద్దని, గత ప్రభుత్వం జగన్ బొమ్మల కోసం రూ.15 కోట్లు తగలేసిందని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు ఇకపై రాజముద్రతో కొత్త పాసు పుస్తకాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇంతో పాటు పాసు పుస్తకంపై క్యూ ఆర్ కోడ్ ముద్రించాలన్నారు. ఈ క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఆస్తి వివరాలు, యజమాని అడ్రస్ తెలిపే మ్యాప్ వచ్చేలా ఉండాలన్నారు.

రూ.700 కోట్ల ప్రజాధనం వృధా

భూముల రీ సర్వే పేరుతో గత ప్రభుత్వం పొలాల సర్వే చేయించిదని, ఇందుకోసం భారీగా నిధులు ఖర్చు చేసిందని సీఎం చంద్రబాబు తెలిపారు. ఈ సర్వేకు వాడిన సరిహద్దు రాళ్లపై జగన్ తన బొమ్మలు ముద్రించుకున్నారని, దాని కోసం రూ.650 కోట్లు ఖర్చు చేశారని అధికారులు సీఎం చంద్రబాబు దృష్టికి తెచ్చారు. అయితే కేంద్రం చెప్పిన రీసర్వేలో ఎక్కడా సరిహద్దు రాళ్లు పాతమని చెప్పలేదన్నారు. అయితే ప్రచారం కోసం జగన్ తన బొమ్మలతో గ్రానైట్ రాళ్లను సిద్ధం చేశారని చంద్రబాబు అన్నారు. జగన్ బొమ్మతో ఉన్న 77 లక్షల గ్రానైట్ రాళ్లను ఏం చేయాలనేదానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు. ఆ రాళ్లపై జగన్ బొమ్మలు చెరపడానికి మరో రూ.15 కోట్లు ఖర్చు అవుతుందని అధికారులు తాత్కాలికంగా అంచనా వేశారు. జగన్ ప్రచార పిచ్చి వల్ల ప్రజాధనం రూ.700 కోట్ల వరకు వృధా అయిందని సీఎం చంద్రబాబు మండిపడ్డారు.

పాసు పుస్తకాల్లో కొత్త టెక్నాలజీ

"పట్టాదారు పాసు పుస్తకాలను ఇకపై రాజముద్రతో జారీ చేస్తాం. వైసీపీ ప్రభుత్వం జగన్ బొమ్మతో పాసు పుస్తకాలు ఇచ్చింది. జగన్ ఫొటో పిచ్చితో ప్రజాధనం వృధా అయ్యింది. కొత్త పాసు పుస్తకాలలో క్యూ ఆర్ కోడ్ వస్తుంది. ఇందులో భూమి విస్తీర్ణం, యాజమాని వివరాలు అన్ని ఉంటాయి. కొత్త టెక్నాలజీ అమలు చేస్తున్నారు. దీనికి రూ.20 కోట్లు వ్యయం అవుతుంది. గత ప్రభుత్వంలో వాళ్ల అనుయాయులు కోసం 22ఏ తో కొత్త చట్టాలు తీసుకొచ్చారు. విశాఖ, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరులో భూముల అవకతవలు, అసైన్డ్ భూముల వ్యవహారంపై ప్రభుత్వ అధికారులు పర్యటించి వివరాలు సేకరిస్తారు. ప్రజల నుంచి ఫిర్యాదు కూడా తీసుకుంటాం. గత ప్రభుత్వంలో భూముల అవకతవకలపై విచారణ చేపడతాం. గత పాలకులు భూదాహంతో రెవెన్యూ శాఖను నాశనం చేశారు. భూముల అవకతవకలపై దర్యాప్తు చేసి దోషులను చట్టం ముందు నిలబెడతాం"- మంత్రి అనగాని సత్యప్రసాద్

Whats_app_banner

సంబంధిత కథనం