APRSCAT APRJC DC CET Results : ఏపీ గురుకుల విద్యాలయాల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి!
APRSCAT APRJC DC CET Results : ఏపీ గురుకుల పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. విద్యార్థులు అధికారిక వెబ్ సైట్ లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు.
APRSCAT APRJC DC CET Results : ఏపీ గురుకుల ప్రవేశ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో గురుకుల పాఠశాలలు, జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలలో 2024-25 విద్యాసంవత్సరానికి గాను ఏప్రిల్ 25న ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఈ ప్రవేశ పరీక్ష ఫలితాలను మంగళవారం విద్యాశాఖ కమిషనర్ సురేష్ కుమార్, ఇతర అధికారులు విడుదల చేశారు.
విద్యార్థులకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం
ఎంపికైన విద్యార్థుల జాబితాను https://aprs.apcfss.in/ వెబ్ సైట్ లో విడుదల చేశారు. సంబంధిత పాఠశాలల jnbnivas లాగిన్స్ ఎంపిక జాబితా వివరాలు పంపినట్లు అధికారులు తెలిపారు. అదే విధంగా సెలెక్ట్ అయిన విద్యార్థులకు మే 15వ తేదీ సాయంత్రం లోపు SMS ద్వారా సమాచారం పంపిస్తామన్నారు. విద్యార్థులు తమ ఫలితాలను https://aprs.apcfss.in/ అధికారిక వెబ్ సైట్ లో విద్యార్థి ఐడీ, హాల్ టికెట్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు.
కౌన్సిలింగ్ షెడ్యూల్
ఎంపికైన విద్యార్థులకు మే 16 నుంచి సంబంధిత పాఠశాలల్లో అడ్మిషన్లను 1:1 నిష్పత్తి ప్రకారం మెరిట్, రిజర్వేషన్, పాఠశాల ప్రాధాన్యత క్రమంలో కల్పిస్తారు. జూనియర్ కాలేజీల్లో 1:5 నిష్పత్తిలో మెరిట్, రిజర్వేషన్ ప్రకారం మే 20 నుంచి మే 22 వరకు ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో విడివిడిగా కౌన్సిలింగ్ నిర్వహించి విద్యార్థులకు కాలేజీలు కేటాయిస్తారు. డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థులను 1:10 నిష్పత్తిలో మే 23 తేదీన గుంటూరులో కౌన్సిలింగ్ నిర్వహించి అడ్మిషన్లు కల్పిస్తారు. అలాగే 12 మైనార్టీ స్కూళ్లలో, 3 మైనార్టీ కాలేజీల్లో మైనార్టీలకు ప్రవేశ పరీక్షతో నిమిత్తం లేకుండా నేరుగా ప్రవేశాలు కల్పిస్తారు.
రిజల్ట్స్ ఇలా చెక్ చేసుకోండి?
- విద్యార్థులు https://aprs.apcfss.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- APR Schools Admission , APRJC & APRDC Admission సెక్షన్లపై క్లిక్ చేయండి.
- తర్వాతి పేజీలో రిజల్ట్స్ పై క్లిక్ చేయండి.
- APREIS ఫలితాలు పేజీలో విద్యార్థి ఐడీ, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
- ప్రవేశాలకు ఎంపికైన విద్యార్థి ఫలితాలు స్క్రీన్ పై కనిపిస్తారు.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసి ఫలితాలను డౌన్ లోడ్ చేసుకోండి.
ఆంధ్రప్రదేశ్ గురుకుల విద్యాలయాల్లో 5వ తరగతిలో ప్రవేశాల కోసం ఏపీ రెసిడెన్షియల్ స్కూల్స్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ 2024, జూనియర్ కాలేజీల్లో ప్రవేశాలకు ఏపీఆర్జేసీ 2024, డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు ఏపీఆర్డీసీ 2024, మైనార్టీ విద్యా సంస్థల్లో ప్రవేశాలకు ఏపీఆర్‌ఎస్ క్యాట్ పరీక్షలు నిర్వహించారు. వీటిల్లో ప్రవేశాల కోసం APRS CAT - 2024ను నిర్వహించారు. ఇందులో వచ్చిన ర్యాంకుల ఆధారంగా ఆయా తరగతుల్లో అడ్మిషన్లు కల్పిస్తారు. ఈ ఎగ్జామ్ ఏప్రిల్ 25వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా పలు కేంద్రాల్లో జరిగింది. ఈ ఫలితాలను అధికారులు తాజాగా విడుదల చేశారు.
సంబంధిత కథనం