AP Rains : ఏపీలో చల్లబడిన వాతావరణం, పలు జిల్లాల్లో భారీ వర్షాలు- రేపు ఇక్కడ రెయిన్స్
AP Rains : ఏపీలో వాతావరణం చల్లబడింది. బుధవారం సాయంత్రం పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాబోయే రెండు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ పేర్కొంది.
AP Rains : ఏపీలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. ఉమ్మడి పశ్చిమగోదావరితో పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో పిడుగులు పడ్డాయి.
రేపు ఈ జిల్లాల్లో వర్షాలు
రేపు విజయనగరం, మన్యం,అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.
రేపు, ఎల్లుండి వర్షాలు
ఏపీలో రాబోయే రెండు రోజులు పలు జిల్లాల్లో వర్షాలు కురిసి అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. కోస్తాంధ్ర, యానాం, రాయలసీమలో ఇవాళ, రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్లు సంభవించే అవకాశం ఉందని తెలిపింది. పిడుగులు పడే అవకాశం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
రాబోయే 3, 4 రోజుల్లో రుతుపవనాలు విస్తరణ
రాబోయే మూడు, నాలుగు రోజుల్లో నైరుతి రుతుపవనాలు తెలంగాణ, కోస్తాంధ్రలోని ఇతర ప్రాంతాలలో విస్తరించే పరిస్థితులు అనుకూలంగా వాతావరణ అధికారులు వివరించారు. నైరుతి బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తనం బుధవారం ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో సముద్రమట్టానికి 3.1 నుంచి 4.5కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది.
హైదరాబాద్ లో భారీ వర్షం
హైదరాబాద్ లో భారీ వర్షం కురిస్తోంది. బుధవారం సాయంత్రం నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. పలు ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. నగరంలోని బేగంపేట, అమీర్ పేట, యూసఫ్ గూడా, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాదాపూర్, హై టెక్ సిటీ, కూకట్ పల్లి, జేఎన్టీయూ, కేపీహెచ్బీ, మూసాపేట్, బాచుపల్లి పరిసర ప్రాంతాల్లో ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తోంది.
అలాగే గచ్చిబౌలి, మాదాపూర్, మియాపూర్, కొండాపూర్, లింగంపల్లి, ఎర్రగడ్డ, పంజాగుట్ట, ఖైరతాబాద్, లక్డీకాపూల్, ట్యాంక్‌బండ్, లిబర్టీ, హిమాయత్‌నగర్, బషీర్‌బాగ్, నాంపల్లి, అబిడ్స్, పాతబస్తీ, చాంద్రాయణగుట్ట, ఫలక్‌నుమా, ఎల్బీనగర్, వనస్థలిపురం, దిల్ సుఖ్ నగర్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో కూడా వర్షం పడింది.
సంబంధిత కథనం