AP TS Weather : ఏపీ, తెలంగాణలో మండిపోతున్న ఎండలు- ఈ మండలాల్లో వడగాల్పులు-amaravati ap ts weather report heat wave prevailed in many district moderate rains in some areas ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ts Weather : ఏపీ, తెలంగాణలో మండిపోతున్న ఎండలు- ఈ మండలాల్లో వడగాల్పులు

AP TS Weather : ఏపీ, తెలంగాణలో మండిపోతున్న ఎండలు- ఈ మండలాల్లో వడగాల్పులు

Bandaru Satyaprasad HT Telugu
Apr 12, 2024 07:29 AM IST

AP TS Weather : తెలుగు రాష్ట్రాలపై భానుడు తీవ్ర ప్రతాపం చూపుతున్నారు. పలు జిల్లాల్లో 40 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అయితే ఆవర్తనం ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి.

ఏపీ, తెలంగాణ వాతావరణం
ఏపీ, తెలంగాణ వాతావరణం

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

AP TS Weather : ఏపీలో ఎండలు (AP Heat Wave)మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఉక్కపోత మొదలవుతుంది. ఇక మధ్యాహ్నం అయితే రోడ్లపైకి రావాలంటే జనం భయపడుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వడగాల్పులు విస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ ప్రకటించారు. శుక్రవారం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలంలో తీవ్రవడగాల్పులు, 62 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎల్లుండి 33 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

ఇవాళ వడగాల్పులు వీచే అవకాశం ఉన్న మండలాలు(62)

శ్రీకాకుళం 17 , విజయనగరం 21, పార్వతీపురం మన్యం 12, అల్లూరిసీతారామరాజు 2, అనకాపల్లి 3, కాకినాడ-1, తూర్పుగోదావరి 5, ఏలూరు జిల్లా వేలేర్పాడు మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉంది.

ప్రజలకు అలర్ట్

గురువారం నంద్యాల జిల్లా నందవరంలో 42.6°C, వైఎస్సార్ జిల్లా(YSR District) చక్రాయపేటలో 42.5°C, ప్రకాశం జిల్లా దరిమడుగులో 41.7°C, కర్నూలు జిల్లా వగరూరులో 41.6°C, ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 41.4°Cఅధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. అలాగే శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలంలో తీవ్రవడగాల్పులు, 20 మండలాల్లో వడగాల్పులు(AP Heat Wave) వీచే అవకాశం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రజలు వీలైనంతవరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఇంట్లోనే ఉండాలని సూచించారు. వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తాగాలని విపత్తుల సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ సూచించారు.

ఉత్తర కోస్తా, యానాంలో ఇవాళ, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం(IMD Amaravati) తెలిపింది. దక్షిణ కోస్తా, రాయలసీమలో ఇవాళ, రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(AP Rains) ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. ఏపీలో ఈ వేసవిలో అసాధారణ ఉష్ణోగ్రతలు(AP Temperatures) నమోదు అయ్యే అవకాశం ఉందని వాతావరణ అధికారులు అంటున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌(April Temperatures) ఆరంభంలోనే మే నెలను తలపించేలా తీవ్ర వడగాడ్పులు, వడగాడ్పులు వీస్తున్నాయి. దీంతో మే నెలలో 50 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు భావిస్తున్నారు.

తెలంగాణలో వాతావరణం

తెలంగాణలో (TS Weather)ఒకవైపు ఎండలతో అల్లాడిపోతుంటే...మరోవైపు తేలికపాటి జల్లులు ప్రజలకు ఉపశమనం కల్పిస్తున్నాయి. తెలంగాణలో ఇవాళ ఓ మోస్తరు వర్షాలు(TS Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని జిల్లాలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించింది. అయితే రాష్ట్రంలో ఎండల తీవ్ర అధికంగా ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైగా నమోదు అవుతున్నాయని తెలిపింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం