AP TS Weather : హీటెక్కిస్తున్న సూర్యుడు, కూల్ చేస్తున్న వరుణుడు-ఏపీ, తెలంగాణలో వచ్చే మూడ్రోజుల వెదర్ ఇలా!-amaravati ap ts weather report coming three days heat wave moderate rains ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ts Weather : హీటెక్కిస్తున్న సూర్యుడు, కూల్ చేస్తున్న వరుణుడు-ఏపీ, తెలంగాణలో వచ్చే మూడ్రోజుల వెదర్ ఇలా!

AP TS Weather : హీటెక్కిస్తున్న సూర్యుడు, కూల్ చేస్తున్న వరుణుడు-ఏపీ, తెలంగాణలో వచ్చే మూడ్రోజుల వెదర్ ఇలా!

Bandaru Satyaprasad HT Telugu
Apr 07, 2024 02:46 PM IST

AP TS Weather : తెలుగు రాష్ట్రాల్లో ఒక పక్క సూర్యుడు హీటెక్కిస్తుంటే, మరోవైపు వరుణుడు కూల్ చేస్తున్నాడు. ఏపీ, తెలంగాణలోని పలు జిల్లాల్లో వడగాల్పులు వీస్తున్నాయి. ఆదిలాబాద్ లో చిరుజల్లులు కురిశాయి.

ఏపీ, తెలంగాణలో వచ్చే మూడ్రోజుల వెదర్
ఏపీ, తెలంగాణలో వచ్చే మూడ్రోజుల వెదర్

AP TS Weather : తెలుగు రాష్ట్రాల్లో ఎండలు(Summer Heat Wave) మండిపోతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఉక్కపోత స్టార్ట్ అవుతుంది. ఇక మధ్యాహ్నం అయితే సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. దాదాపు అన్ని జిల్లాల్లో పగటి పూట ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు పైనే నమోదు అవుతున్నాయని వాతావరణ కేంద్రాలు చెబుతున్నాయి. ఏపీలో(AP Weather) ఇవాళ(ఏప్రిల్ 7న) 64 మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీయగా, 222 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇక రేపు(ఏప్రిల్ 8న) 22 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపింది.

CTA icon
మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

వడగాల్పులు

విజయవాడ, విశాఖతో పాటు ఏపీలోని ప్రధాన నగరాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదు అవుతున్నాయి. వేడి వడగాలులు వీస్తుండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు సాహసం చేయడంలేదు. దీంతో మధ్యాహ్న సమయాల్లో రోడ్లన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. శనివారం ఏడు జిల్లాలలో సుమారు 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వాతావరణ కేంద్రాలు ప్రకటించాయి. అనకాపల్లి జిల్లా రావికమతం, నంద్యాల జిల్లా బ్రాహ్మణ కొట్కూరు, పల్నాడు జిల్లా రావిపాడు, ప్రకాశం జిల్లా తోకపల్లెలో 44.9 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి.

ఏపీకి చల్లటి కబురు

ఎండల ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఏపీ వాసులకు ఐఎండీ(IMD) చల్లని కబురు చెప్పింది. రేపు, ఎల్లుండి ఉత్తర కోస్తా, యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. రాబోయే మూడు రోజు వాతావరణ సూచనలను అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ ఉత్తర కోస్తా, యానాంలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని ప్రకటించింది. ఒకటి లేదా రెండు చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు(Moderate Rains) లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం పలు చోట్ల ఏర్పడవచ్చని పేర్కొంది. దక్షిణ కోస్తాంధ్రలో ఇవాళ ఒకటి లేదా రెండు చోట్ల వడగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది. రేపు, ఎల్లుండి దక్షిణ కోస్తాలో వాతావరణం(Weather Report) పొడిగా ఉందని తెలిపింది. ఇక రాయలసీమలో ఇవాళ, రేపు వడగాలులు వీస్తాయని తెలిపింది. ఎల్లుండి వేడి, తేమ, అసౌకర్యమైన వాతావరణం ఉంటుందని పేర్కొంది.

తెలంగాణలో హీవ్ వేవ్ పరిస్థితులు

తెలంగాణలో భానుడు భగభగలాడుతున్నాడు. రాష్ట్రంలో హీట్ వేవ్ అలర్ట్(Heat Wave Alert) జారీ చేశారు వాతావరణ అధికారులు. పలు జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని ప్రకటించారు. రాష్ట్రంలో పలు జిల్లాలకు ఆరెంజ్(Orange Alert), ఎల్లో అలర్ట్ జారీ చేశారు. 11 జిల్లాల్లో 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయని తెలిపారు. హైదరాబాద్(Hyderabad) లో 42 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. మరో రెండు రోజులు హీట్ వేవ్ పరిస్థితులు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఖమ్మం, నల్గొండ, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న రెండు నెలల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

పలు జిల్లాల్లో చిరు జల్లులు

అయితే ఆదిలాబాద్(Adilabad) సహా పలు జిల్లాల్లో చిరు జల్లులు పడ్డాయి. ఆదిలాబాద్, నిజామాబాద్, మంచిర్యాల, కుమురం భీమ్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. వచ్చే మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో పలు జిల్లాల్లో వానలు(Rains) పడతాయని వెల్లడించింది.

IPL_Entry_Point

సంబంధిత కథనం