AP 10th Results Updates : ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్, మే మొదటి వారంలో ఫలితాలు!-amaravati ap ssc exams completed spot valuation from april 1st results released on may first week ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  Amaravati Ap Ssc Exams Completed Spot Valuation From April 1st Results Released On May First Week

AP 10th Results Updates : ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్, మే మొదటి వారంలో ఫలితాలు!

Bandaru Satyaprasad HT Telugu
Mar 30, 2024 03:54 PM IST

AP 10th Results Updates : ఏపీలో మార్చి 18న ప్రారంభమైన టెన్త్ పరీక్షలు నేటితో ముగిశాయి. ఏప్రిల్ 1 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ మొదలు కానుంది. మే మొదటి వారంలో ఫలితాలు విడుదల కానున్నాయి.

ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్
ఏపీ టెన్త్ విద్యార్థులకు అలర్ట్

AP 10th Results Updates : ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు(AP SSC Exams 2024) నేటితో(మార్చి 30) ముగిశాయి. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో ప‌దో త‌ర‌గ‌తి జవాబు పత్రాల మూల్యాంక‌నం వేగంగా చేయాలని ఎస్ఎస్సీ బోర్డు(AP SSC Board) అధికారులు భావిస్తు్న్నారు. ఈ మేరకు విద్యాశాఖ అధికారులు మూల్యాంకనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాడి రెగ్యులర్ అభ్యర్థులు 6,23,092 మంది పది పరీక్షలకు పేర్లు నమోదు చేసుకోగా...వీరిలో బాలుర సంఖ్య 3,17,939, బాలికల సంఖ్య 3,05,153గా ఉంది.

ట్రెండింగ్ వార్తలు

ఏప్రిల్ 1 నుంచి స్పాట్ వాల్యూయేషన్

ఇప్పటికే పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్(SSC Spto Valuation) కు అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారు. ఏప్రిల్ 8 లోపు స్పాట్ వాల్యూయేషన్ పూర్తి చేసేందుకు సిద్ధమైంది. ఏప్రిల్ 1 నుంచి టెన్త్ స్పాట్ వాల్యూయేషన్ (AP 10th Spot Valuation)ప్రక్రియను ప్రారంభించనున్నారు. కేవలం 8, 9 రోజుల్లో వాల్యూయేషన్ పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు షెడ్యూల్ సైతం సిద్ధం చేశారు. రాష్ట్రంలోని పలు జిల్లా కేంద్రాల్లో స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. సీనియర్ ఉపాధ్యాయులకు ప్రాధాన్యత ఇస్తూ...సిబ్బంది కొరత లేకుండా మూల్యాంఖనం చేపట్టాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

మే మొదటి వారంలో ఫలితాలు(AP Tenth Results)

ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ఏపీ పదో తరగతి ఫలితాలు(AP SSC Results) కాస్త ముందుగా వచ్చే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. గత ఏడాది ఏప్రిల్ 18కి పరీక్షల ముగియగా... ఈసారి మార్చి 18న ప్రారంభమైన పరీక్షలు (AP 10th Exams)మార్చి 30న ముగిశాయి. దీంతో గతంలో కంటే కాస్త ముందుగా ఫలితాలు రానున్నాయి. గతేడాది మే 6న పదో తరగతి ఫలితాలు వెలువడగా... ఈసారి మే మొదటి వారంలోనే పదో తరగతి ఫ‌లితాల‌ను(AP 10th Results) విడుద‌ల చేస్తామ‌ని రాష్ట్ర ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానంద్‌ రెడ్డి ప్రకటించారు. అయితే ఫలితాలు ప్రకటనకు ఎన్నికల సంఘం అనుమతి తీసుకోవాల్సి ఉందన్నారు. ఈ ఏడాది రాష్ట్ర వ్యాప్తంగా 6.23 లక్షల టెన్త్ విద్యార్థులు రెగ్యులర్‌గా, 1.02 లక్షల మంది విద్యార్థులు ప్రైవేటుగా పరీక్షలకు హాజరయ్యారని పేర్కొన్నారు. దాదాపుగా 50 లక్షల జవాబు పత్రాలకు ఏప్రిల్‌ 1 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ప్రారంభిస్తామన్నారు. ఏప్రిల్ 8వ తేదీకి మూల్యాంకనం(SSC Spot Valuation) పూర్తి చేయాలని ఆదేశించామన్నారు. స్పాట్ వాల్యూయేషన్ ప్రక్రియకు 25 వేల మంది సిబ్బందికి విధులు కేటాయించామని స్పష్టం చేశారు.

ఏపీ పదో తరగతి ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు(AP SSC Results 2024)

  • విద్యార్థులు ఏపీ ఎస్ఎస్సీ బోర్డు అధికారిక వెబ్సైట్ https://www.bse.ap.gov.in/ సందర్శించండి
  • హోమ్ పేజీలో AP SSC Results 2024 లింక్‌పై క్లిక్ చేయాలి
  • మీ హాల్ టికెట్ నంబర్, ఇతర వివరాలు నమోదు చేయాలి
  • అనంతరం విద్యార్థి టెన్త్ ఫలితాలు స్ర్కీన్ పై డిస్ ప్లై అవుతాయి
  • టెన్త్ ఫలితాలను డౌన్ లోడ్ చేసుకుని, భవిష్యత్ అవసరాల కోసం భద్రపరుచుకోండి

WhatsApp channel

సంబంధిత కథనం