AP Public Grievance : స్పందన పేరు మార్పు, ఇకపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం-amaravati ap public grievance spandana name changed every monday grievance taken ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Public Grievance : స్పందన పేరు మార్పు, ఇకపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం

AP Public Grievance : స్పందన పేరు మార్పు, ఇకపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం

HT Telugu Desk HT Telugu
Jun 15, 2024 03:09 PM IST

AP Public Grievance : ఏపీలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం...మార్పులు మొదలుపెట్టింది. ఇప్పటికే వైఎస్ఆర్ పెన్షన్ కానుకను...ఎన్టీఆర్ పెన్షన్ గా పేరు మార్చింది. తాజాగా ప్రజా ఫిర్యాదుల కార్యాక్రమం స్పందన పేరును పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్ గా మార్చింది.

స్పందన పేరు మార్పు, ఇకపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం
స్పందన పేరు మార్పు, ఇకపై ప్రతి సోమవారం గ్రీవెన్స్ కార్యక్రమం

AP Public Grievance : రాష్ట్రంలో ప్రజా ఫిర్యాదు నమోదు, వాటి పరిష్కారానికి 'స్పందన' కార్యక్రమం పేరుని 'పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్'గా ప్రభుత్వం మార్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులు వెంటనే అమలు చేయాలని అన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాలని ప్రజా ఫిర్యాదు నమోదు, వాటి పరిష్కారానికి 'స్పందన' కార్యక్రమాన్ని 'పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్'గా అమలు చేయాలని ఆదేశించారు. దీనికి అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ప్రజా పరిపాలనలో ప్రజా గ్రీవెన్స్ చాలా కీలక పాత్ర పోషిస్తాయని ఉత్తర్వుల్లో తెలిపారు.

ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్

ఇప్పటి వరకు ప్రతి సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించేవారు. దాన్ని ఇప్పుడు గ్రీవెన్స్ మార్చారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటికి గ్రీవెన్స్ గా ఈ కార్యక్రమాన్ని అమలు చేసేవారు. ప్రతి సోమవారం రాష్ట్ర స్థాయి సచివాలయం నుంచి జిల్లా కలెక్టరేట్ లోనూ, మండల ఏంఆర్ఓ కార్యాలయాల్లోనూ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించేవారు. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం గ్రీవెన్స్ కార్యక్రమాన్ని స్పందనగా మార్చారు. ఇటీవలి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో మళ్లీ అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం, గత ప్రభుత్వం మార్చిన పేర్లను ఒక్కొక్కటిగా మార్చుతుంది. మొదటిగా వైఎస్ఆర్ పెన్షన్ ను ఎన్టీఆర్ పెన్షన్ గా మార్చారు. ఇప్పుడు స్పందన కార్యక్రమం పేరును పబ్లిక్ గ్రీవెన్స్ గా మార్చారు. ఇక నుంచి ప్రతి సోమవారం పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించనున్నారు.

మంగళగిరిలో ప్రజాదర్బార్ ప్రారంభించిన లోకేశ్

మంగళగిరి ఎమ్మెల్యే, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ ప్రజాసమస్యలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజాదర్బార్‌ను ప్రారంభించారు. నియోజకవర్గంలోని సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బాన్ కార్యక్రమాన్ని ఏర్పాటుచేశారు. స్థానికంగా అందుబాటులో ఉన్నప్పుడు ప్రజలను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటానని లోకేశ్ అన్నారు. గత అయిదేళ్లుగా ప్రతిపక్షంలో ఉన్నా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించానన్నారు. భారీ మెజారిటీతో గెలిచిన తరువాత తనపై మరింత బాధ్యత పెరిగిందని లోకేశ్ తెలిపారు. నియోజకవర్గంలో అందుబాటులో ఉన్న రోజుల్లో ఉదయం 8 గంటలకు ప్రజల్ని కలిసి వారి సమస్యలు తెలుసుకోవాలని నిర్ణయం తీసుకున్నానని తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని సైతం ఏర్పాటు చేశానన్నారు. వీలైనంత త్వరగా తన దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.

గత వైసీపీ పాలనలో ప్రజాదర్బార్ నిర్వహిస్తారని ప్రజలు ఎదురుచూశారని కానీ ఎప్పుడు అలాంటి కార్యక్రమాలు నిర్వహించలేదని మంత్రి లోకేశ్ ఆరోపించారు. గ్రామ, వార్డు సచివాలయాలు అందుబాటులో ఉన్నా ప్రజా సమస్యలు పరిష్కారం కాలేదన్నారు. సచివాలయాల్లో ఫిర్యాదు చేస్తే సరిపోతుందని గత ప్రభుత్వం చెప్పందన్నారు. తాము స్వయంగా ఎన్నుకున్న ప్రజాప్రతినిధిని కలిసి తమ సమస్యలు విన్నవించే పరిస్థితి గతంలో లేకుండా పోయిందన్నారు. ప్రజా సమస్యలను నేరుగా ఎమ్మెల్యేకు చెప్పుకుంటే త్వరగా పరిష్కారమవడంతో పాటు ఆ సమస్య ప్రభుత్వం దృష్టికి వెళ్తుందని ప్రజలు ఆశపడతారన్నారు. కానీ వైసీపీ ప్రభుత్వం సచివాలయాల్లో ఫిర్యాదు చేయాలని చెప్పడంతో ప్రజల సమస్యలు ఎమ్మెల్యేలకు తెలిసేవి కావన్నారు.

రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందూస్థాన్ టైమ్స్ తెలుగు

WhatsApp channel

సంబంధిత కథనం