AP Inter Results Update : ఏపీ ఇంటర్ విద్యార్థులకు అలర్ట్, ఈ నెల 15న ఫలితాలు?
AP Inter Results Update : ఏపీ ఇంటర్ ఫలితాలపై బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ నెల 15న ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రాథమికంగా తెలిపారు.
AP Inter Results Update : ఏపీ ఇంటర్ ఫలితాలపై(AP SSC Results 2024) అప్డేట్ వచ్చింది. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ ఏడాది ముందుగానే ఫలితాలు విడుదల చేయనున్నట్లు సమాచారం అందుతోంది. ఫలితాల విడుదల విద్యాశాఖ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. మార్చి నెలలోనే ఇంటర్, పదో తరగతి పరీక్షలు ముగిశాయి. ఇప్పటికే ఇంటర్ మొదటి, రెండో సంవత్సర జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తైందని విద్యాశాఖ అధికారులు తెలిపారు. దీంతో ఏప్రిల్ 15న ఇంటర్ ఫస్టియర్AP Inter 1st Year Results), సెకండియర్ ఫలితాలను(AP Inter 2nd Year Results) ఒకేసారి విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు మొత్తం 9,99,698 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఫలితాల విడుదల అనంతరం ఇంటర్ విద్యార్థులు https://bieap.apcfss.in/Index.do లో చెక్ చేసుకోవచ్చు.

ఈసీ ఆమోదం రాగానే ఫలితాలు విడుదల
ఇంటర్ ఫలితాల (AP Inter Results 2024)కోసం ఎదురు చూస్తున్న విద్యార్ధులపై ఎన్నికల ప్రభావం ఉండకుండా, ఎన్నికలకు ముందే ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. రాష్ట్రంలో ఎన్నికల కోడ్(Election Code) అమల్లో ఉండటంతో ఫలితాల వెల్లడిపై ఈసీ ఆమోదం తప్పనిసరి. దీంతో విద్యాశాఖ ఈ మేరకు ఈసీ ఆమోదం కోరినట్లు తెలుస్తోంది. ఫలితాల విడుదలతో రాజకీయ నాయకులు ప్రమేయం ఉండదు కాబట్టి...ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులే ఈసారి ఫలితాలు విడుదల చేయనున్నారు. గత ఏడాది ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలను ఏప్రిల్ 26న విడుదల చేశారు. మే 6న పదోతరగతి(AP 10th Results) ఫలితాలు విడుదల చేశారు. జవాబు పత్రాల మూల్యాంకనం కోసం 23 వేల మంది అధ్యాపకులను ఇంటర్ బోర్డు వినియోగించింది. ఇప్పటికే ఇంటర్ స్పాట్ వాల్యూయేషన్ ముగిసినట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
ఏపీ ఇంటర్ ఫలితాల కోసం ఇలా చెక్ చేయండి
Step 1 : విద్యార్థులు bie.ap.gov.inలో BIEAP అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్లండి.
Step 2 : హోమ్ పేజీలో AP ఇంటర్ 1వ, 2వ సంవత్సరం ఫలితాల లింక్ పై క్లిక్ చేయండి.
Step 3 : లాగిన్ పేజీలో అభ్యర్థులు హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి సబ్మిట్ చేయండి
Step 4 : అభ్యర్థి ఫలితాలను స్క్రీన్‌పై చూడవచ్చు.
Step 5 : మీ రిజెల్ట్స్ డౌన్‌లోడ్ చేసుకోండి, భవిష్యత్తు ప్రయోజనాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.
ఏపీ పదో తరగతి ఫలితాలు
ఏపీలో పదో తరగతి పరీక్షలను (AP SSC Exams)6,30,633 మంది విద్యార్ధులు రాశారు. ప్రస్తుతం పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్(Spot Valuation) 26 జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్నారు. మొత్తం 47,88,738 జవాబు పత్రాల వేల్యూయేషన్ కోసం 25 వేలమంది ఉపాధ్యాయులను నియమించారు. గతంలో వాల్యూయేషన్‌లో రకరకాల సమస్యలు తలెత్తడంతో ఈ ఏడాది ప్రతి కేంద్రంలో గరిష్టంగా 900 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఏప్రిల్ 1వ తేదీన తేదీన ప్రారంభమైన పదో తరగతి మూల్యాంకనం దాదాపుగా పూర్తికావచ్చిందని అధికారులు తెలిపారు. పదో తరగతి ఫలితాలను (AP 10th Results 2024)ఏప్రిల్ చివరి వారం లేదా మే మొదటి వారంలో విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ఏపీ పదో తరగతి ఫలితాలను https://www.bse.ap.gov.in/ లో చూడొచ్చు.
సంబంధిత కథనం