AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ లు బదిలీ, సెర్ప్ సీఈవోగా వీరపాండ్యన్ నియామకం-amaravati ap govt transfers ias officers posted veerapandiyan as serp ceo ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Ias Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ లు బదిలీ, సెర్ప్ సీఈవోగా వీరపాండ్యన్ నియామకం

AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ లు బదిలీ, సెర్ప్ సీఈవోగా వీరపాండ్యన్ నియామకం

AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులను సీఎస్ బదిలీ చేశారు. ఈ మేరకు సీఎస్ నీరభ్ కుమార్ ఉత్తర్వులు ఇచ్చారు. జి. వీరపాండ్యన్ సెర్ప్(SERP) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమితులయ్యారు.

ఏపీలో భారీగా ఐఏఎస్ లు బదిలీ, సెర్ప్ సీఈవోగా వీరపాండియన్ నియామకం

AP IAS Transfers : ఏపీలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. శనివారం సాయంత్రం సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.

  • పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న సీహెచ్ శ్రీధర్ మైనారిటీ సంక్షేమ శాఖ కమిషనర్‌గా నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు సీహెచ్ శ్రీధర్ ను మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ, ఎండీగా పూర్తి అదనపు బాధ్యతను అప్పగించారు.
  • ఎం.వి. శేషగిరి బాబు స్టాంప్స్, రిజిస్ట్రేషన్స్ ఇన్‌స్పెక్టర్ జనరల్ గా నియమితులయ్యారు.
  • జి. రేఖా రాణి హ్యాండ్లూమ్స్ & టెక్స్‌టైల్స్‌ కమిషనర్ గా బదిలీ అయ్యారు.
  • పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న చెవ్వూరు హరి కిరణ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయన నేషనల్ హెల్త్ మిషన్ ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలో ఉంటారు.
  • జి. వీరపాండ్యన్ పంచాయత్ రాజ్ & గ్రామీణాభివృద్ధి శాఖలో సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (SERP) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా నియమించారు.
  • మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్ గా ఎం. హరినారాయణన్
  • భూ సర్వే, సెటిల్‌మెంట్ & ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌ లత్కర్ శ్రీకేష్ బాలాజీ రావు
  • బీసీ సంక్షేమశాఖ డైరెక్టర్‌ గా డాక్టర్ మల్లికార్జున, వెనుకబడిన తరగతుల కోఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ వీసీ, ఎండీగా అదనపు బాధ్యతలు
  • ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (APSWREIS) సెక్రటరీగా ప్రసన్న వెంకటేష్
  • ఏపీ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్‌ వీసీ, ఎండీగా గిరీషా
  • ఏపీ మార్క్‌ఫెడ్ ఎండీగా మంజీర్ జిలానీ, శాప్ ఎండీగా అదనపు బాధ్యతలు
  • బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ డైరెక్టర్‌గా కృతికాకు అదనపు బాధ్యతలు
  • ఏపీసీపీడీసీఎస్ సీఎండీగా రవి సుభాష్
  • ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా లక్ష్మీ షా, ఎన్టీఆర్ వైద్యసేవ సీఈవోగా అదనపు బాధ్యతలు
  • మహిళా, శిశుసంక్షేమశాఖ డైరెక్టర్‌గా ఎం.వేణుగోపాల్‌రెడ్డి
  • ఎక్సెజ్‌శాఖ ప్రొహిబిషన్ డైరెక్టర్‌గా నిషాంత్‌కుమార్
  • సాంఘిక, సంక్షేమశాఖ డైరెక్టర్‌గా లావణ్య వేణి
  • ఏపీఐఐసీ ఎండీగా అభిషిక్త్ కిషోర్ , ఏపీటీడీసీ ఎండీగా అదనపు బాధ్యతలు
  • ఆర్‌ అండ్‌ ఆర్ కమిషనర్‌గా రామసుందర్‌రెడ్డి
  • ట్రాన్స్‌కో జాయింట్ ఎండీగా కీర్తి చేకూరి
  • స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీగా గణేష్‌కుమార్
  • విశాఖ మున్సిపల్ కమిషనర్‌గా సంపత్‌కుమార్
  • గుంటూరు మున్సిపల్ కమిషనర్‌గా దినేష్‌కుమార్
  • విజయవాడ మున్సిపల్ కమిషనర్‌గా ధ్యానచంద్ర
  • తిరుపతి మున్సిపల్ కమిషనర్‌గా నారపురెడ్డి మౌర్య
  • కడప మున్సిపల్ కమిషనర్‌గా ఎన్.తేజ్ భరత్
  • రాజమహేంద్రవరం మున్సిపల్ కమిషనర్‌గా కేతన్ గార్గ్
  • పల్నాడు జిల్లా జేసీగా సూరజ్ ధనుంజయ్
  • గుంటూరు జిల్లా జేసీగా అమిలినేని భార్గవతేజ
  • తూ.గో.జిల్లా జేసీగా హిమాన్షు కోహ్లి
  • కోనసీమ జిల్లా జేసీగా నిశాంతి
  • కాకినాడ జిల్లా జేసీగా గోవిందరావు
  • ఏపీ మారీటైమ్‌ బోర్డ్‌ సీఈవోగా ప్రవీణ్ ఆదిత్య
  • సీసీఎల్‌ఏ జాయింట్ సెక్రటరీగా మాపూర్ అజయ్‌కుమార్‌
  • జీసీసీ ఎండీగా కల్పన కుమారి
  • కేఆర్‌పురం ఐటీడీఏ పీవోగా హరిత
  • కాకినాడ మున్సిపల్‌ కమిషనర్‌గా భావన
  • కడప మున్సిపల్ కమిషనర్‌గా తేజ్‌భరత్
  • సీఆర్‌డీఏ అదనపు కమిషనర్లుగా ప్రవీణ్ చంద్, మల్లారపు నవీన్
  • నంద్యాల జేసీగా విష్ణుచరణ్
  • ఎన్టీఆర్‌ జిల్లా జేసీగా నిధి మీనా,
  • రంపచోడవరం ఐటీడీఏ పీవోగా సింహాచలం
  • తిరుపతి జేసీగా శుభం భన్సాల్
  • నెల్లూరు మున్సిపల్ కమిషనర్‌గా సూర్యతేజ
  • సీతంపేట ఐటీడీఏ పీవోగా రాహుల్‌కుమార్ రెడ్డి
  • ఆర్థిక శాఖ డిప్యూటీ సెక్రటరీగా మారుల్ కౌమర్
  • శ్రీకాకుళం జేసీగా అహ్మద్‌ ఖాన్
  • కడప జేసీగా అతిథిసింగ్
  • మదనపల్లి సబ్‌ కలెక్టర్‌గా మేఘా స్వరూప్
  • పార్వతీపురం ఐటీడీఏ పీవోగా సేదుమాధవన్
  • ఏలూరు జేసీగా ధాత్రిరెడ్డి
  • అన్నమయ్య జిల్లా జేసీగా ఆదర్శ్ రాజేంద్రన్
  • అల్లూరి జిల్లా జేసీగా అభిషేక్‌గౌడ

సంబంధిత కథనం