AP EAPCET Counselling : ఏపీ ఈఏపీసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం, ముఖ్య తేదీలివే-amaravati ap eapcet engineering final schedule counselling july 23 to july 27th ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Eapcet Counselling : ఏపీ ఈఏపీసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం, ముఖ్య తేదీలివే

AP EAPCET Counselling : ఏపీ ఈఏపీసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం, ముఖ్య తేదీలివే

Bandaru Satyaprasad HT Telugu
Jul 23, 2024 04:20 PM IST

AP EAPCET Final Counselling : ఏపీ ఈఏపీసెట్-2024 ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ఈ నెల 27 వరకు నిర్వహించనున్నారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్, ఫీజు చెల్లింపు, వెబ్ ఆప్షన్లు, వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులు తెలిపారు.

ఏపీ ఈఏపీసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం, ముఖ్య తేదీలివే
ఏపీ ఈఏపీసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం, ముఖ్య తేదీలివే

AP EAPCET Final Counselling : ఏపీ ఈఏపీసెట్- 2024 ఇంజినీరింగ్ చివరి విడత కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇవాళ్టి(జులై 23) నుంచి ప్రారంభం అయ్యింది. అధికారిక వెబ్ సైట్ https://eapcet-sche.aptonline.in/EAPCET/ లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం అయ్యిందని అధికారులు తెలిపారు. ఈఏపీసెట్ లో అర్హత సాధించిన ఇంజినీరింగ్ అభ్యర్థులకు నేటి నుంచి ఈ నెల 27 వరకు రిజిస్ట్రేషన్, వెబ్ కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుందని అధికారులు ప్రకటించారు.

రిజిస్ట్రేషన్, ప్రాసెసింగ్ ఫీజు, ఆన్‌లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు జులై 25 చివరి తేదీగా నిర్ణయించారు. ఆన్ లైన్ లో అప్‌లోడ్ చేసిన సర్టిఫికెట్లను జులై 26 తేదీ లోపు నోటిఫైడ్ హెల్ప్‌లైన్ సెంటర్లలో వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అర్హులైన అభ్యర్థులు జులై 24 నుంచి జులై 26 వరకు వెబ్ఆప్షన్‌లను నమోదు చేసుకోవాలి. వెబ్ ఆప్షన్ల మార్పునకు జూలై 27న అవకాశం కల్పిస్తారు.

ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు ఇంటర్మీడియట్ / CBSE / ICSE / NATIONAL OPEN SCHOOL / APOSS ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు.. ఇంటర్ లో ఎంపీసీ సబ్జెక్టులలో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఓసీ విద్యార్థులు 44.5 శాతం, రిజర్వుడు కేటగిరీలు(బీసీ, ఎస్సీ, ఎస్టీ) అభ్యర్థులు 39.5 శాతం గ్రూప్ సబ్జెక్టులలో మార్కులు పొందాల్సి ఉంటుంది.

  • ఆన్‌లైన్‌లో ప్రాసెసింగ్ ఫీజు చెల్లింపు : జులై 23 నుంచి జులై 25 వరకు
  • హెల్ప్ లైన్ సెంటర్లలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్(ఆఫ్‌లైన్)/ఆన్‌లైన్ : జులై 23 నుంచి జులై 26 వరకు
  • వెబ్ ఆప్షన్ల ఎంపిక : జులై 24 నుంచి జులై 26 వరకు
  • వెబ్ ఆప్షన్ల ఎంపిక మార్పు : జులై 27
  • సీట్ల కేటాయింపు : జులై 30
  • కాలేజీల్లో రిపోర్టింగ్ : జులై 31 నుంచి ఆగస్టు 03 వరకు

ఏపీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ ఎలా దరఖాస్తు చేసుకోవాలి

  • ఏపీ ఈఏపీసెట్ అధికారిక వెబ్‌సైట్‌ eapcet-sche.aptonline.in పై క్లిక్ చేయండి.
  • హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.
  • అభ్యర్థులు ఈఏపీసెట్ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి సబ్మిట్ చేయండి.
  • రిజిస్ట్రేషన్ ఫామ్ పూర్తి చేసి ఫీజు చెల్లించండి.
  • అవసరమైన సర్టిఫికెట్లను అప్‌లోడ్ చేయండి.
  • సబ్మిట్ పై క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ ను డౌన్‌లోడ్ చేయండి.
  • తదుపరి అవసరాల కోసం అప్లికేషన్ హార్డ్ కాపీని ప్రింట్ తీసుకోండి.

వెబ్ కౌన్సెలింగ్ కోసం ప్రాసెసింగ్ ఫీజు రూ.1200 (ఓసీ/బీసీ అభ్యర్థులకు), రూ. 600(ఎస్సీ, ఎస్టీలకు). అభ్యర్థులు వెబ్‌సైట్‌లో క్రెడిట్ కార్డ్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్ లో పేమంట్ చెల్లించవచ్చు. అభ్యర్థులు మరిన్ని వివరాలు AP EAPCET అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం