AP EAPCET 2024 Results : ఏపీ ఈఏపీసెట్ ఫలితాలు వచ్చేస్తున్నాయ్, జూన్ మొదటి వారంలో విడుదలకు ఛాన్స్!
AP EAPCET 2024 Results : ఏపీ ఈఏపీసెట్ ఫలితాలపై అప్డేట్ వచ్చింది. జూన్ మొదటి వారంలో ఫలితాలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
AP EAPCET 2024 Results : ఏపీ ఈఏపీసెట్-2024 ఫలితాలపై అప్డేట్ వచ్చింది. జూన్ మొదటి వారంలో ఫలితాల విడుదలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తుందని సమాచారం. ఈఏపీసెట్ ఫలితాల విడుదలతో పాటు కౌన్సెలింగ్ షెడ్యూల్ ను అధికారులు ప్రకటించనున్నారు. ఫలితాల విడుదల అనంతరం విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/EAPCET లో రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
ఏపీలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కాకినాడ జేఎన్టీయూ ఈఏపీ సెట్‌ను నిర్వహించింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో మే 16 నుంచి 23 వరకు పరీక్షలు నిర్వహించారు. ప్రాథమిక కీ లు కూడా అందుబాటులోకి వచ్చాయి. అభ్యర్థుల అభ్యంతరాల స్వీకరణ ప్రక్రియ కూడా మే 26వ తేదీతో పూర్తి అయ్యింది. ఫలితాలను ప్రకటించేందుకు ఏపీ ఉన్నత విద్యామండలి కసరత్తు చేస్తోంది.
ఏపీ ఈఏపీసెట్‌కు సంబంధించి ఇంజినీరింగ్ విభాగానికి అన్ని సెషన్లలో కలిపి 2,74,213 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 2,58,373 మంది పరీక్ష రాశారు. 15,840 మంది గైర్హాజరు అయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 94.22 శాతం మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో అన్ని సెషన్లకు 88,638 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 80,766 మంది హాజరయ్యారు. అగ్రి, ఫార్మసీ విభాగాల్లో 7872 మంది గైర్హాజరయ్యారు. అగ్రికల్చర్, ఫార్మసీ విభాగంలో 91.12 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈఏపీ సెట్ 2024 మొత్తం 3,39,139 మంది పరీక్షకు హాజరయ్యారు. 93.47 శాతం మంది పరీక్షకు హాజరైనట్లు ఈఏపీసెట్ కన్వీనర్ ప్రొ.కె. వెంకటరెడ్డి తెలిపారు.
ఫలితాలు ఇలా చెక్ చేసుకోవచ్చు
Step 1: అభ్యర్థులు AP EAPCET 2024 అధికారిక వెబ్‌సైట్- https://cets.apsche.ap.gov.in/ పై క్లిక్ చేయండి.
Step 2: AP EAPCET ఫలితాలు 2024 లింక్‌పై క్లిక్ చేయాలి.
Step 3: మీ రిజిస్ట్రేషన్, హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేయండి.
Step 4: స్క్రీన్ పై మీ మార్కులు, ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
Step 5 : ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
మే 30న ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలు విడుదల
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి నిర్వహించిన ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాల విడుదల తేదీలు ఖరారయ్యాయి. ఈ నెల 30 ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్రంలో ఎంసీఏ, ఎంబీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన ఐసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు, పాలిటెక్నిక్ డిప్లొమా చేసిన విద్యార్థులకు బీటెక్, బీఎస్సీ (గణితం) విద్యార్థులకు లేటరల్ ఎంట్రీతో బీటెక్, బీఫార్మసీ సెకండియర్ లో ప్రవేశానికి నిర్వహించిన ఈసెట్ ఫలితాలన మే 30న విడుదల చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు. ఫలితాల విడుదల అనంతరం కౌన్సెలింగ్ తేదీలు వెల్లడించనున్నారు.
ఏపీ ఐసెట్, ఈసెట్ ఫలితాలను https://cets.apsche.ap.gov.in/APSCHE/APSCHEHome.aspx అధికారిక వెబ్‌సైట్ లో విద్యార్థులు చెక్ చేసుకోవచ్చు. విద్యార్థులు తమ స్కోర్ కార్డ్ కమ్ ర్యాంకు కార్డును వెబ్‌సైట్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ నంబర్, ఐసెట్ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదు చేసి ఫలితాలు పొందవచ్చు. విభాగాల వారీగా స్కోర్, మొత్తం మార్కులు, ర్యాంకులు విడుదల చేయనున్నారు.
సంబంధిత కథనం