Telugu News  /  Andhra Pradesh  /  Air India Express Launch Vijayawada To Sharjah Direct Flight From October 31
ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం (HT_PRINT)

Air India Express Flight : విజయవాడ టూ షార్జా డైరెక్ట్ ఫ్లైట్.. ఎప్పటి నుంచి అంటే

30 October 2022, 18:56 ISTHT Telugu Desk
30 October 2022, 18:56 IST

Vijayawada To Sharjah Flight : ఇకపై విజయవాడ టూ షార్జా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు అందుబాటులోకి వస్తున్నాయి. అక్టోబర్ 31వ తేదీ నుంచి ఈ సర్వీసు ఉంటుంది.

ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుండి షార్జా(Vijayawada To Sharjah)కు అక్టోబర్ 31 నుండి నేరుగా అంతర్జాతీయ విమానా(International Flight)న్ని ప్రారంభించనుంది. అక్టోబర్ 31న 06.35 గంటలకు బయలుదేరుతుంది. విజయవాడ-షార్జా సెక్టార్‌కు ప్రారంభ ఛార్జీలు రూ. 13,669 నుండి ప్రారంభమవుతాయి. షార్జా-విజయవాడ(Sharjah To Vijayawada)కు ఎమిరేట్స్‌ దిర్హమ్స్‌ 399(దాదాపు రూ.8,946) నుండి ఉంటాయి.

ట్రెండింగ్ వార్తలు

యూఏఈ(UAE) ముఖ్యంగా దుబాయ్‌, నార్త్రన్‌ ఎమిరేట్స్‌ వెళ్లే ప్రయాణికులకు విజయవాడ టూ షార్జా డైరెక్ట్‌ ఫ్లైట్ ఉపయోగపడుతుందని..ఎయిర్‌ ఇండియా ఎక్స్‌ప్రెస్‌ సీఈఓ అలోక్‌ సింగ్‌ చెప్పారు. షార్జాతో పాటు మస్కట్‌, కువైట్‌లకు కూడా తమ సంస్థ విజయవాడ(Vijayawada) నుంచి నేరుగా విమాన సర్వీసులు నడుపుతుందన్నారు.

'విజయవాడ టూ షార్జా మధ్య ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్(Air India Express) తొలి అంతర్జాతీయ సర్వీస్‌ను ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం. కరోనా తర్వాత, భారతదేశం-గల్ఫ్ విమానయాన రంగం మంచి రికవరీని చూసింది. UAEకి ముఖ్యంగా దుబాయ్, నార్తర్న్ ఎమిరేట్స్‌కు ప్రయాణించే వారికి, షార్జాకు నేరుగా సర్వీస్ వలన భారీ ప్రయోజనం ఉంటుంది.' అని అలోక్‌ సింగ్‌ అన్నారు.

ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విజయవాడలో, వెలుపల అంతర్జాతీయ సర్వీసులను అందిస్తున్న విమానయాన సంస్థ. షార్జాతో పాటు, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విజయవాడ నుండి మస్కట్, కువైట్‌లకు B737-800 NG ఎయిర్‌క్రాఫ్ట్‌తో ప్రయాణిస్తుంది. సౌకర్యవంతమైన సీట్లు, ప్రీ-ఆర్డర్ చేసిన హాట్ మీల్స్‌తో పాటు కొనుగోలు-ఆన్-బోర్డ్ మీల్ సర్వీస్ ఉంది. మొబైల్ ఛార్జింగ్ కోసం ఇన్-సీట్ పవర్ అందిస్తుంది.

మరోవైపు హైదరాబాద్‌ టూ థాయ్‌లాండ్‌(Hyderabad To Thailand) మధ్య రద్దు చేసిన ప్యాసింజర్‌, కార్గో విమాన సేవలను థాయ్‌ ఎయిర్‌వేస్‌(Thai Airways) అక్టోబర్ 30 నుంచి మెుదలు అయ్యాయి. కరోనా కారణంగా హైదరాబాద్‌, బ్యాంకాక్‌ మధ్య నిలిపివేసిన ప్యాసింజర్‌, కార్గో సేవలను రెండు సంవత్సరాల తర్వాత ప్రారంభిస్తున్నామని థాయ్‌ కాన్సులేట్‌ జనరల్‌ నిటిరూగ్‌ ఫోన్‌ప్రాసెర్ట్‌ చెప్పారు. విమాన సర్వీసుల ప్రారంభంతో ఔషధాల వంటి కీలకమైన ఉత్పత్తులు, పర్యాటకుల రవాణా ఊపందుకుంటుందని తెలిపారు.