ప్ర‌యాణికులకు అలర్ట్ - 22 రైళ్ల‌కు అద‌న‌పు కోచ్‌లు, వివరాలివే-add extra coaches for 22 trains to facilitate waiting list passengers in waltair railway division ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  ప్ర‌యాణికులకు అలర్ట్ - 22 రైళ్ల‌కు అద‌న‌పు కోచ్‌లు, వివరాలివే

ప్ర‌యాణికులకు అలర్ట్ - 22 రైళ్ల‌కు అద‌న‌పు కోచ్‌లు, వివరాలివే

HT Telugu Desk HT Telugu
Jun 29, 2024 08:16 AM IST

ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్ లు అందుబాటులోకి రానున్నాయి. విశాఖ నుంచి వెళ్లే పలు రైళ్లకు ఈ అదనపు కోచ్ లు ఉండనున్నాయి. వీటి వివరాలను వాల్తేరు రైల్వే డివిజన్ అధికారులు పేర్కొన్నారు.

22 రైళ్ల‌కు అద‌న‌పు కోచ్‌లు
22 రైళ్ల‌కు అద‌న‌పు కోచ్‌లు

ప్ర‌యాణీకుల‌కు రైల్వే శాఖ శుభ‌వార్త చెప్పింది. వ‌చ్చే నెల‌లో ప్ర‌యాణికుల ర‌ద్దీ ఉండ‌టంతో 22 రైళ్ల‌కు ఏసీ, స్లీప‌ర్ అద‌న‌పు కోచ్‌ల‌ను పెంచారు. విశాఖ‌ప‌ట్నం నుంచి బ‌య‌లుదేరే రైళ్లు, అలాగే విశాఖ‌ప‌ట్నం వ‌చ్చి, వెళ్లే రైళ్లకు ఈ అద‌న‌పు కోచ్‌లను అందుబాటులోకి తెచ్చిన‌ట్లు వాల్తేర్ డివిజ‌న్ తెలిపింది. 

వెయిట్ లిస్ట్‌లో ఉన్న ప్ర‌యాణికులు ఆందోళ‌న చెంద‌న‌వ‌స‌రం లేదని పేర్కొంది. ఈ అద‌న‌పు కోచ్‌లు పెంచ‌డంతో వెయిట్ లిస్ట్ ప్ర‌యాణీకుల‌కు ఇబ్బందులు తప్పనున్నాయి. ప్రయాణికుల ఇబ్బందుల దృష్యా… అద‌న‌పు కోచ్‌ల‌ను పెంచామ‌ని వాల్తేర్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ కె సందీప్ తెలిపారు.

అదనపు కోచ్ సర్వీసులు  - వివరాలివే

 • విశాఖపట్నం-కిరండూల్ ప్యాసింజర్ (08551)రైలుకు 2024 జూలై 1 నుండి 2024 జూలై 31 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌తో పెంచుతున్నారు. కిరండూల్-విశాఖపట్నంప్యాసింజర్‌ (08552)రైలుకు 2024 జూలై 2 నుండి 2024 ఆగ‌స్టు 1 వ‌ర‌కు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌తో పెంచనున్నారు.
 • విశాఖపట్నం-నాందేడ్ ఎక్స్‌ప్రెస్ (20811)రైలుకు 2024 జూలై 2 నుండి 2024 జూలై 31 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌, ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్‌ పెంచుతున్నారు. నాందేడ్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (20812)రైలుకు 2024 జూలై 3 నుండి 2024 ఆగ‌స్టు 1 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌, ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్‌ పెరుగుతుంది.
 • విశాఖపట్నం-గుణుపూర్ ప్యాసింజర్ (08522) స్పెషల్ రైలుకు 2024 జూలై 1 నుండి 2024 జూలై 31 వరకు 3 ఏసీ క్లాస్, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌తో పెంచుతున్నారు. గుణుపూర్-విశాఖ ప్యాసింజర్ (08521) స్పెషల్ రైలుకు 2024 జూలై 1 నుండి 2024 జూలై 31 వరకు 3 ఏసీ క్లాస్, ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ ఉండనుంది.
 • విశాఖపట్నం-అమృత్‌సర్ హిరాకుడ్ ఎక్స్‌ప్రెస్ (20807)రైలుకు 2024 జూలై 2 నుండి 2024 జూలై 3 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌, ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్‌ పెంచుతున్నారు. అమృత్‌సర్ హిరాకుడ్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ (20808)రైలుకు 2024 జూలై 6 నుండి 2024 ఆగ‌స్టు 3 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌, ఒక స్లీప‌ర్ క్లాస్ కోచ్‌  పెరగనుంది.
 • భువనేశ్వర్-ఎస్ఎంవీ బెంగళూరు సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (12845)రైలుకు 2024 జూలై 7 నుండి 2024 జూలై 28 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ పెంచుతున్నారు. ఎస్ఎంవీ బెంగళూరు-భువనేశ్వర్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (12846) రైలుకు 2024 జూలై 8 నుండి 2024 జూలై 29 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ పెరగనుంది.
 • భువనేశ్వర్-జీఎంఆర్ చెన్నై సెంట్రల్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (12830)రైలుకు 2024 జూలై 4 నుండి 2024 జూలై 25 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ పెంచుతున్నారు. జీఎంఆర్ చెన్నై సెంట్రల్-భువనేశ్వర్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (12829)రైలుకు 2024 జూలై 5 నుండి 2024 జూలై 26 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ పెరగుతుంది.
 • భువనేశ్వర్-తిరుపతి సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22871) రైలుకు 2024 జూలై 7 నుండి 2024 జూలై 28 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ పెంచుతున్నారు. తిరుపతి-భువనేశ్వర్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22872) రైలుకు 2024 జూలై 8 నుండి 2024 జూలై 29 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ పెంచుతున్నారు.
 • భువనేశ్వర్-పూణె సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22882) రైలుకు 2024 జూలై 2 నుండి 2024 జూలై 30 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ పెంచుతున్నారు. పూణె - భువనేశ్వర్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (22881) రైలుకు 2024 జూలై 4 నుండి 2024 ఆగ‌స్టు 1 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ పెంచనున్నారు.
 • భువనేశ్వర్- పుదుచ్చేరి సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (12898) రైలుకు 2024 జూలై 2 నుండి 2024 జూలై 30 వరకు ఒక స్లీప‌ర్‌ క్లాస్ కోచ్‌ పెంచుతున్నారు. పుదుచ్చేరి-భువనేశ్వర్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (12897) రైలుకు 2024 జూలై 3 నుండి 2024 జూలై 31 వరకు ఒక స్లీప‌ర్‌ క్లాస్ కోచ్‌ పెరుగుతుంది.
 • భువనేశ్వర్- రామేశ్వరం సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (20896) రైలుకు 2024 జూలై 5 నుండి 2024 జూలై 26 వరకు ఒక స్లీప‌ర్‌ క్లాస్ కోచ్‌ పెంచుతున్నారు. రామేశ్వరం-భువనేశ్వర్ సూప‌ర్ ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్ (20895) రైలుకు 2024 జూలై 7 నుండి 2024 జూలై 28 వరకు ఒక స్లీప‌ర్‌ క్లాస్ కోచ్‌ పెంచుతున్నారు.
 • పూరీ-యశ్వంత్‌పూర్ గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్ (22883) రైలుకు 2024 జూలై 5 నుండి 2024 జూలై 26 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ పెంచుతున్నారు. 

యశ్వంత్‌పూర్-పూరీ గరీబ్రత్ ఎక్స్‌ప్రెస్ (22884) రైలుకు 2024 జూలై 6 నుండి 2024 జూలై 27 వరకు 3 ఏసీ ఎకానమీ క్లాస్ కోచ్‌ పెంచుతున్నారు. ఈ సేవలను ప్రజలు వినియోగించుకోవాలని కె. సందీప్ కోరారు.

రిపోర్టింగ్ - జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.

WhatsApp channel