Adani Scholarship: విద్యార్థులకు అదానీ సంస్థ స్కాలర్‌షిప్, ఏడాదికి రూ.3.5 లక్షల వరకు-అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా-adani gyan jyoti scholarship 2024 professional course students are eligible apply online ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Adani Scholarship: విద్యార్థులకు అదానీ సంస్థ స్కాలర్‌షిప్, ఏడాదికి రూ.3.5 లక్షల వరకు-అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా

Adani Scholarship: విద్యార్థులకు అదానీ సంస్థ స్కాలర్‌షిప్, ఏడాదికి రూ.3.5 లక్షల వరకు-అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా

Adani Gyan Jyoti Scholarship : వృతి విద్యా కోర్సుల్లో జాయిన్ అయిన మొదటి సంవత్సరం విద్యార్థులకు అదానీ సంస్థ రూ.3.5 లక్షల వరకు స్కాలర్ షిప్ అందిస్తుంది. ఏపీ, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్ గడ్ రాష్ట్రాల విద్యార్థులు ఈ స్కాలర్ దరఖాస్తుకు అర్హులు. దరఖాస్తులకు అక్టోబర్ 7 చివరి తేదీ.

విద్యార్థులకు అదానీ సంస్థ స్కాలర్‌షిప్, ఏడాదికి రూ.3.5 లక్షలు-అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా

Adani Gyan Jyoti Scholarship : అదానీ సంస్థ 2024-25 విద్యాసంవత్సరానికి పేద విద్యార్థులకు స్కాలర్ షిప్ లు అందిస్తోంది. అదానీ జ్ఞాన్ జ్యోతి స్కాలర్‌షిప్ పేరిట ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల విద్యార్థులకు ఏడాదికి రూ.3,50,000 వరకు స్కాలర్ షిప్ అందిస్తుంది. బీఏ ఎకనామిక్స్, బీఎస్సీ ఎకనామిక్స్, బ్యాచిలర్ ఆఫ్ ఎకనామిక్స్, బీఈ, బీటెక్, 5-ఇయర్ ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఎంటెక్, ఎంబీబీఎస్, ఎల్ఎల్బీ కోర్సులు చదివే మొదటి సంవత్సరం విద్యార్థులు ఈ స్కాలర్ షిప్ నకు అర్హులు. ఈ స్కాలర్ షిప్ నకు ఎంపికైన విద్యార్థులు ఏడాదికి రూ.3,50,000 వరకు ఆర్థిక సాయం పొందవచ్చు. అర్హులైన విద్యార్థులు అక్టోబర్ 7వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

అదానీ జ్ఞాన్ జ్యోతి స్కాలర్‌షిప్ ఇంజినీరింగ్ విద్యార్థులకు

ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు దరఖాస్తుకు అర్హులు. ఈ రాష్ట్రాల విద్యార్థులు భారతదేశంలోని ఏ రాష్ట్రంలోనైనా చదువుకుంటున్నా వారు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుదారులు తప్పనిసరిగా వృత్తిపరమైన ఇంజినీరింగ్ డిగ్రీ కోర్సు, బీఈ/బీటెక్ లేదా 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిగ్రీ ఎంటెక్ మొదటి సంవత్సరంలో జాయిన్ అయ్యి ఉండాలి. విద్యార్థులు 2023 తర్వాత హయ్యర్ సెకండరీ/ప్రీ యూనివర్శిటీ/ఇంటర్మీడియట్/CBSE/ISC లేదా సమానమైన బోర్డు పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్ర లేదా జాతీయ స్థాయి నిర్వహించిన అడ్మిషన్ పరీక్షలలో సాధించిన మెరిట్ ర్యాంక్ ఆధారంగా కోర్సులో జాయిన్ అయ్యి ఉండాలి.

విద్యార్థులు తప్పనిసరిగా జేఈఈ ఆల్ ఇండియా లెవల్ లో 40,000 లోపు ర్యాంక్‌ని పొంది ఉండాలి. స్కాలర్ కు దరఖాస్తు చేసుకునే విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.4,50,000 మించకూడదు. అదానీ గ్రూప్ ఉద్యోగుల పిల్లలు ఈ స్కాలర్ కు అర్హులు కాదు. బీఈ, బీటెక్, బీఆర్క్ డిప్లొమా కోర్సుల్లో లేటరల్ బెసిస్ చేరిన విద్యార్థులకు అర్హత లేదు. అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ. 2,50,000 వరకు ట్యూషన్ ఫీజు స్కాలర్ షిప్ రూపంలో అందిస్తారు.

ఎంబీబీఎస్ విద్యార్థులకు

ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌ల అభ్యర్థులు అర్హులు. ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం విద్యార్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

దరఖాస్తుదారులు 2023 తర్వాత హయ్యర్ సెకండరీ/ప్రీ యూనివర్శిటీ/ఇంటర్మీడియట్/CBSE/ISC లేదా సమానమైన బోర్డు అర్హత పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి. రాష్ట్ర లేదా జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలలో సాధించిన మెరిట్ ర్యాంక్ ఆధారంగా ఎంబీబీఎస్ సీటు పొంది ఉండాలి. నీట్ ఆల్ ఇండియా స్థాయిలో 15,000లోపు ర్యాంకు పొంది ఉండాలి. దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం రూ. 4,50,000 మించకూడదు. బీడీఎస్ విద్యార్థులు అర్హులు కాదు. అర్హులైన విద్యార్థులకు సంవత్సరానికి రూ.3,50,000 వరకు ట్యూషన్ ఫీజు అందిస్తారు.

  • ఎకనామిక్స్ విద్యార్థులకు ఏడాది రూ.50,000 వరకు ట్యూషన్ ఫీజు
  • న్యాయ విద్యార్థులకు అదానీ జ్ఞానజ్యోతి స్కాలర్‌షిప్ ద్వారా ఏడాదికి రూ.1,80,000 వరకు ట్యూషన్ ఫీజు
  • సీఏ విద్యార్థులకు స్కాలర్‌షిప్ ద్వారా ఏడాదికి రూ. 70,000 వరకు ట్యూషన్ ఫీజు
  • కోర్సులను బట్టి అర్హతలు నిర్ణయించారు. దరఖాస్తుకు ముందు అధికారిక వెబ్ సైట్ లో వివరాలు ఒకసారి చదవండి.

దరఖాస్తుకు కావాల్సిన సర్టిఫికెట్లు

  • ఆధార్ కార్డు/ఓటర్ ఐడీ/డ్రైవింగ్ లైసెన్స్/పాన్ కార్డు
  • ప్రస్తుత విద్యా సంవత్సరం కళాశాల/సంస్థలో చేరినట్లు రుజువు (ఫీజు రసీదు/అడ్మిషన్ లెటర్/సంస్థ గుర్తింపు కార్డు/బోనఫైడ్ సర్టిఫికేట్)
  • కుటుంబ ఆదాయ రుజువు లేదా సాలరీ స్లిప్‌లు (గత 3 నెలలుగా) లేదా IT రిటర్న్ ఫారమ్, కుటుంబ ఆదాయ ధృవీకరణ పత్రం
  • గత సంవత్సరం మార్క్ షీట్
  • దరఖాస్తుదారుడి బ్యాంక్ ఖాతా వివరాలు
  • ఇటీవలి ఫొటో
  • 12వ తరగతి మార్క్ షీట్
  • అడ్మిషన్ టెస్ట్ ర్యాంక్ కార్డు
  • సీటు కేటాయింపు కౌన్సెలింగ్ లెటర్
  • కాలేజీ కోర్సు ఫీజు
  • తల్లిదండ్రుల లేదా సంరక్షకుల డిక్లరేషన్

స్కాలర్ షిప్ నకు ఎలా దరఖాస్తు చేసుకోవచ్చు?

  • విద్యార్థి ముందుగా https://www.buddy4study.com/page/adani-gyan-jyoti-scholarship?cuid=tt_AGSP1_20240823_1 ఈ లింక్ పై క్లిక్ చేసి తమ కోర్సు విభాగంలో 'Apply Now' బటన్ పై క్లిక్ చేయాలి.
  • మీ రిజిస్టర్డ్ ఐడీతో Buddy4Studyకి లాగిన్ చేయండి. 'దరఖాస్తు ఫారమ్ పేజీ'లో ఓపెన్ అవుతుంది.
  • తొలిసారి Buddy4Study ఓపెన్ చేస్తే మీ ఈ-మెయిల్/మొబైల్ నంబర్ తో రిజిస్టర్ చేసుకోండి.
  • లాగిన్ అయ్యాక ‘అదానీ జ్ఞాన్ జ్యోతి స్కాలర్‌షిప్ 2024-25’ దరఖాస్తు ఫారమ్ పేజీ ఓపెన్ అవుతుంది.
  • అప్లికేషన్ ప్రాసెస్‌ను ప్రారంభించడానికి 'అప్లికేషన్ ప్రారంభించు' అనే బటన్‌పై క్లిక్ చేయండి.
  • ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో విద్యార్థికి సంబంధించిన వివరాలను నమోదు చేయండి. అక్కడ అడిగిన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
  • కండీషన్స్ ను అంగీకరించి, ‘ప్రివ్యూ’పై క్లిక్ చేయండి.
  • మీరు దరఖాస్తు ఇచ్చిన వివరాలన్నీ ప్రివ్యూ స్క్రీన్‌పై చెక్ చేసుకుని, అన్ని సరిగ్గా ఉండే సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.

సంబంధిత కథనం