Industrialist Murder: మనుమడిగా చూడలేదు.. బెగ్గర్ అంటూ అవమానించాడు, అందుకే హత్య చేశానన్న నిందితుడు..-accused of being insulted by being called a beggar thats why he committed murder ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Industrialist Murder: మనుమడిగా చూడలేదు.. బెగ్గర్ అంటూ అవమానించాడు, అందుకే హత్య చేశానన్న నిందితుడు..

Industrialist Murder: మనుమడిగా చూడలేదు.. బెగ్గర్ అంటూ అవమానించాడు, అందుకే హత్య చేశానన్న నిందితుడు..

Sarath Chandra.B HT Telugu

Industrialist Murder: హైదరాబాద్‌లో హత్యకు గురైన పారిశ్రామికవేత్త జనార్ధనరావు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. తాతపై పగతో రగిలిపోయిన మనుమడు పథకం ప్రకారం హత్యకు పాల్పడ్డాడు. 72సార్లు కత్తితో పొడిచి చంపేసినట్టు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

పారిశ్రామికవేత్త హత్య కేసులో సంచలన విషయాలు

Industrialist Murder: హైదరాబాద్‌లో హత్యకు గురైన ప్రముఖ వెల్జన్ గ్రూప్ ఛైర్మన్‌ వీసీ జనార్థన్‌ రావు హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. హత్యకు పాల్పడిన నిందితుడు డ్రగ్‌ ఎడిక్ట్‌ అని భావించినా వైద్య పరీక్షల్లో అలాంటి ఆనవాళ్లేమి దొరకలేదు. మానసిక ఆరోగ్యం కూడా సక్రమంగానే ఉన్నట్టు గుర్తించారు. తరచూ అవమానించడంతోనే పగతో రగిలిపోయి హత్యకు పాల్పడినట్టు రిమాండ్‌ రిపోర్ట్‌లో పేర్కొన్నారు.

కృష్ణా జిల్లాకు చెందిన వీసీ జనార్థనరావు హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. పారిశ్రామిక వేత్తగా, వితరణశీలిగా సమాజంలో గుర్తింపు పొందారు. ఆస్తుల పంపకం విషయంలో చిన్న కుమార్తె కుమారుడిని కంపెనీ డైరెక్టర్‌ చేయడం, మరో మనుమడి నిర్లక్ష్యం చేయడం హత్యకు కారణంగా గుర్తించారు. హత్య చేసిన కిలారి కీర్తి తేజ పోలీసుల విచారణలో పలు విషయాలు వెల్లడించారు. తనను బెగ్గర్ అంటూ అవమానించినందుకే చంపేసినట్టు పేర్కొన్నారు.

84ఏళ్ల వీసీ జనార్థన్‌ రావు రెండు వారాల క్రితం హైదరాబాద్‌లోని తన నివాసంలో హత్యకు గురయ్యారు. సొంత మనుమడు కీర్తి తేజ కత్తితో పొడిచి చంపేశాడు. అడ్డొచ్చిన తల్లిపై కూడా కత్తితో దాడి చేశాడు. హత్యకు ముందు మృతుడి చిన్న కుమార్తె కుమారుడిని కంపెనీ డైరెక్టర్‌గా నియమించారు.దీనిపై కీర్తి తేజ పగతో రగిలిపోయాడు.

ఇంట్లో తనను హీనంగా చూస్తుండటం, తరచూ అవమానించడం ఇంట్లో, ఆఫీసులో అందరి ముందూ తాత తనను తీవ్రంగా అవమానించే వాడని అందుకే హత్య చేసినట్టు నిందితుడు కిలారు కీర్తితేజ పోలీసుల ఎదుట అంగీకరించాడు. హ‍త్య తర్వాత కత్తితో పాటు రక్తం మరకలు ఉన్న దుస్తుల్ని తగలబెట్టినట్టు తెలిపాడు. సగం కాలిన కత్తిని పోలసులు స్వాధీనం చేసుకున్నారు. ఐదు రోజుల పాటు విచారించిన పోలీసులు అతని నుంచి పలు కీలక విషయాలు రాబట్టారు.

హత్య చేయడానికి ఇన్‌స్టా మార్ట్‌లో కత్తిని కొనుగోలు చేసి తాత దగ్గరకు వెళ్లినట్టు అంగీకరించాడు. బెగ్గర్ అంటూ ప్రతిరోజూ తాత అవమానించేవాడని, ఏ రోజూ తనను సొంతమనిషిగా చూడలేదని, ఆఫీసుకు వెళ్తే అక్కడ కూడా తనను అవమానించేవాడని కీర్తితేజ పోలీసులకు వివరించాడు.

తాత తనను తిడుతుండటంతో ఆఫీసు సిబ్బందికి కూడా తనను లోకువగా చూశారని, ఆస్తి పంపకాలు, కంపెనీ పదవుల్లో కూడా తనకు అన్యాయం చేశారని వీటి వల్లే హత్యకు పాల్పడ్డానని కీర్తితేజ వెల్లడించాడు. హత్య జరిగిన రోజు ఆస్తి పంపకాల విషయంలో తమ మధ్య గౌడవ జరిగిందని.. దీంతో హత్య చేయాలని నిర్ణయించుకున్నట్టు వివరించాడు. ఇన్స్టామార్ట్ నుంచి కత్తిని కొనుగోలు చేశానని పోలీసులకు చెప్పాడు.

హత్య తర్వాత పరారైన కీర్తితేజను అరెస్టు చేసిన పోలసులు డ్రగ్స్ ఏమైనా తీసుకున్నాడనే అనే అనుమానంతో రక్త నమునాలు సేకరించి పరీక్షల కోసం పంపారు. పరీక్షల్లో ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడైంది. దాడిని అడ్డుకునే ప్రయత్నం చేసిన కీర్తితేజ తల్లి సరోజినిదేవి కోలుకోవడంతో ఆమెను ఇంటికి పంపించి వేశారు. పంజాగుట్ట పోలీసులు హత్య జరిగిన సమయంలో ఘటనలపై న్యాయమూర్తి ముందు హాజరు పర్చడంతో వాంగ్మూలం నమోదు చేశారు. సరోజినిదేవి వివాహం తర్వాత భర్తతో విభేదాలు రావడంతో విడిపోయారు. ఆమె కుమారుడు కీర్తితేజ.. తాతపై ద్వేషం పెంచుకుని చివరికి ప్రాణాలు తీసినట్టు గుర్తించారు.

హత్యకు గురైన వీసీ జనార్థన్‌ రావు పెద్ద ఎత్తున దాన ధర్మాలు చేశారు. విజయవాడ సమీపంలో కమ్మ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు వసతి గృహం నిర్మాణానికి  భారీ విరాళాన్ని అందించేందుకు సమ్మతించిన కొద్ది రోజుల్లోనే హత్యకు గురయ్యారు. 

శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం