AP New Governor: ఏపీ కొత్త గవర్నర్ గా అబ్దుల్ నజీర్
New Governor of Andhra Pradesh: ఏపీ కొత్త గవర్నర్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన విడుదలైంది.
Andhra Pradesh Governor: ఏపీకి కొత్త గవర్నర్ రానున్నారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్‌ను ఏపీ గవర్నర్‌గా నియమించినట్లు రాష్ట్రపతి భవన్ నుంచి ప్రకటన విడుదలైంది. ప్రస్తుత గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ను ఛతీస్ ఘడ్ గవర్నర్ గా నియమించారు. వీరితో పాటు పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లతో పాటు పలువురిని బదిలీ చేశారు.
పలు రాష్ట్రాల గవర్నర్లు మార్పు..
జార్ఖండ్ రాష్ట్ర గవర్నర్ గా రాధాకృష్ణన్ నియమించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా లెఫ్టినెంట్ జనరల్ కైవల్యను సిక్కిం గవర్నర్ గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్యను నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా శివప్రతాప్ శుక్లాను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇక అసోం గవర్నర్ గా గులాబ్ చంద్ కటారియాను నియమించారు. ప్రస్తుతం ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న సుశ్రీ అనసూయఉకే మణిపూర్ గవర్నర్ గా నియమితులయ్యారు. ప్రస్తుతం మణిపూర్ గవర్నర్ గా ఉన్న గణేశన్ నాగాలాండ్ గవర్నర్ గా బదిలీ అయ్యారు.
బిహార్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న సాగు చౌహన్ ను మేఘాలయ గవర్నర్ గా నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ బిహర్ గవర్నర్ గా, మహారాష్ట్ర గవర్నర్ గా జార్ఖండ్ గవర్నర్ రమేష్ బైస్ ను నియమించారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బి.డి మిశ్రాను లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. మహారాష్ట్ర గవర్నర్ గా భగత్ సింగ్ కోష్యారీ , లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ రాధాకృష్ణన్ మాథుర్ రాజీనామాలను రాష్ట్రపతి ఆమోదించారు.