AP Aarogyasri Services : అంతరాయం లేకుండా వైద్య సేవలు అందుతున్నాయి - ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రకటన-aarogyasri health care trust has released an advertisement on ap arogyasri services ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Ap Aarogyasri Services : అంతరాయం లేకుండా వైద్య సేవలు అందుతున్నాయి - ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రకటన

AP Aarogyasri Services : అంతరాయం లేకుండా వైద్య సేవలు అందుతున్నాయి - ఆరోగ్యశ్రీ ట్రస్టు ప్రకటన

Maheshwaram Mahendra Chary HT Telugu
May 24, 2024 08:02 PM IST

Aarogyasri Services in AP : ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలపై ఆరోగ్య శ్రీ ట్రస్ట్ స్పందించింది. వైద్య సేవల్లో అంతరాయం లేదనని తెలిపింది. ఈ మేరకు సీఈవో పేరుతో ప్రకటన విడుదలైంది.

ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు
ఏపీలో ఆరోగ్య శ్రీ సేవలు (https://www.ysraarogyasri.ap.gov.in/)

Aarogyasri Services in AP : ఆంధ్రప్రదేశ్ లో అందుతున్న ఆరోగ్య శ్రీ సేవలపై వైఎస్ఆర్ ఆరోగ్య శ్రీ ట్రస్టు ప్రకటన విడుదల చేసింది. రాష్ట్రంలో ఎక్కడా సేవలు ఆగిపోలేదని సీఈవో లక్ష్మీ షా స్పష్టం చేశారు.

 ఏపీనే కాకుండా ఇతర రాష్ట్రాల్లో కూడా సేవలు అందుతున్నాయని వెల్లడించింది. ట్రస్ట్ నుంచి 2023- 2024లో ఇప్పటివరకు రూ. 3,566.22 కోట్లు నెట్ వర్క్ ఆస్పత్రుల ఖాతాల్లో జమ చేసినట్లు వివరించింది.

ఆ ఆర్ఠిక సంవత్సరం మొదటి రెండు నెలలో ఇప్పటివరకు రూ. 366 కోట్లను జమ చేసినట్లు పేర్కొంది. రాష్ట్రంలో రోజుకూ సగటున 5349 మంది లబ్ధిదారులు ఈ స్కీమ్ కింద చికిత్స పొందుతున్నట్లు ప్రకటించింది.

గత రెండు రోజులుగా 13 వేలకు మందికిపైగా లబ్ధిదారులకు ఆరోగ్యశ్రీ స్కీమ్ కింద ట్రీట్మెంట్ పొందినట్లు ఆరోగ్య శ్రీ ట్రస్ట్ ప్రస్తావించింది. లబ్ధిదారులకు అంతరాయం లేకుండా సేవలు అందించాలన్న పిలుపునకు అన్ని నెట్ వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సానుకూలంగా స్పందిస్తున్నాయని క్లారిటీ ఇచ్చింది.

రాష్ట్రంలోని ప్రైవేట్ నెట్ వర్క్ ఆస్పత్రులు పెండింగ్ బిల్లుల కోసం డిమాండ్ చేస్తున్నాయి.  ఆరోగ్యశ్రీ సేవలను మే 22 నుంచి బంద్‌ చేస్తున్నట్లు ప్రకటించాయి. పెండింగ్‌ బిల్లులు చెల్లించే వరకు వైద్య సేవలు అందించమని నెట్ వర్క్ ఆసుపత్రులు స్పష్టం చేశాయి. ప్రభుత్వం రూ. 1500 కోట్లకు పైగా ఆరోగ్య శ్రీ నిధులు పెండింగ్‌లో పెట్టిందని, ఆ బిల్లులు చెల్లించే వరకు కొత్త కేసులు చేర్చుకోమని తెలిపాయి. ఆరోగ్య శ్రీ ట్రస్టు సీఈవో ఇప్పటి వరకూ రెండు దఫాలుగా చర్చలు జరిపగా… విఫలం అయ్యాయి.

 ప్రజలను ఇబ్బంది పెట్టకుండా సహకరించాలని ప్రైవేట్ ఆసుపత్రులను ఆరోగ్యశ్రీ సీఈవో లక్ష్మిషా  విజ్ఞప్తి కూడా చేశారు. ఆరోగ్య శ్రీ పథకం కింద పేద, మధ్యతరగతి ప్రజలకు ఉచిత వైద్యం అందించేందుకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పెండింగ్‌ బిల్లులపై ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ , స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌(ఆశా) మధ్య చర్చలు జరుగుతున్నాయని చెప్పారు.