Aadhaar Update : ఆధార్ అప్‌డేట్ చేసుకున్నారా? డిసెంబర్ 14 వరకు ఫ్రీ అప్ డేట్ గడువు పొడిగింపు
Aadhaar Update : ఆధార్ అప్డేట్ గడువును డిసెంబర్ 14 వరకు పొడిగింది యూఐడీఏఐ. పదేళ్లకు ఒకసారి ఆధార్ లో సమాచారాన్ని అప్ డేట్ చేసుకోవాలని కేంద్రం సూచించింది. ఆధార్ వివరాలు ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకు కేంద్రం గడువునిచ్చింది.
ఆధార్ అప్‌డేట్ చేసుకున్నారా? ఒకవేళ చేసుకోకపోతే, ఇప్పుడు చేసుకోండి. డిసెంబర్ 14 వరకు గడువు పొడిగించారు. ప్రభుత్వ పథకాల నుంచి బ్యాంకు ఖాతా తెరవడం వరకు ఆధార్ కార్డు కీలకం అయిపోయింది. ఇప్పుడు ప్రతి చిన్న పనికి ఆధార్ తప్పనిసరి అయిపోయింది. సిమ్ కార్డు తీసుకోవడం నుంచి స్కూల్ అడ్మిషన్, ప్రభుత్వ పథకాల వరకు ఆధార్ లేకుండా ఏ పని అవ్వటం లేదు. కనుక అటువంటి ఆధార్ అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి.
అయితే ఎంతో మంది పదేళ్లు దాటినా ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవడం లేదు. చిరునామా, ఫొటోలను అప్ డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు. ఈ నేపథ్యంలో పదేళ్లు దాటిన ఆధార్ సమాచారాన్ని ఫ్రీగా అప్ డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకు కేంద్రం గడువునిచ్చింది. ఇదే చివరి గడువు కావొచ్చని ప్రచారం జరుగుతోంది. మై ఆధార్ పోర్టల్లో లాగిన్ అయి అప్‌డేట్ చేసుకోండి.
తొలిత సెప్టెంబర్ 14 వరకు గడువు ఇచ్చిన యూఐడీఏఐ, దాన్ని డిసెంబర్ 14 వరకు పొడిగించింది. ఆధార్ అప్‌డేట్ కోసం వసూలు చేసే సాధారణ ఫీజును సైతం ఈ సర్వీస్ కోసం మాఫీ చేసింది. అంటే ఆధార్ తీసుకుని పదేళ్ల పైబడిన ఆధార్ కార్డుదారులు ఆధార్‌ను అప్‌డేట్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ సర్వీసును ఇప్పుడు ఈ ఉచిత సర్వీసునుక మరొక నెల రోజులు పెంచింది.
ఆధార్‌ను ఎలా అప్‌డేట్ చేసుకోవాలి?
ఉచితంగా ఆధార్ అప్‌డేట్ సర్వీస్‌ను ఉపయోగించుకోవడానికి ఆన్‌లైన్‌లో లేదా ఆఫ్ లైన్ సర్వీస్‌ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఆన్‌లైన్ సర్వీస్‌ణు మీ మొబైల్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లో నుంచి కూడా చేసుకోవచ్చు. దీనికి మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్, తగిన ధ్రువీకరణ పత్రాలు, మీ ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ ఉంటే సరిపోతుంది.
ముందుగా మీ ఫోన్, ల్యాప్‌టాప్, కంప్యూటర్‌లో https://uidai.gov.in/ ఓపెన్ చేయాలి. లేదా mAadhaar యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకుని ఓపెన్ చేయాలి. తరువాత ఇందులో మీకు నచ్చిన భాషను ఎంపిక చేసుకోవాలి. వెబ్‌సైట్‌లో అయితే mAadhaar ట్యాబ్‌లోని ‘Document Update’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ Click Submit పైన క్లిక్ చేయాలి. ఇక్కడ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ అడిగిన బాక్స్‌లో ఆధార్ నెంబర్, క్యాప్చా, ఓటీపీతో లాగిన్ అవ్వాలి.
ఆ తరువాత అక్కడ అడ్రస్ వివరాలు అప్‌డేట్ చేసుకోవాలి. మీరు అందించిన వివరాలు అన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి. అన్ని వివరాలు సరిగా ఉన్నట్లు నిర్ధారించుకున్న తరువాత అడిగిన వద్ద మీ అడ్రస్‌కి సంబంధించిన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. ఈ సర్వీస్ UIDAI పూర్తిగా ఉచితంగా ఆఫర్ చేస్తుంది.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం