Aadhaar DOB Update : ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చుకోవాలా? ఇకపై ఈ సర్టిఫికెట్ ఉన్నా ఓకే -ఏపీ సర్కార్ కీలక నిర్ణయం
Aadhaar DOB Update : ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్పునకు మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శుల సర్టిఫికెట్లతో పాటు ప్రభుత్వ ఆసుపత్రులు ఇచ్చే సర్టిఫికెట్ పరిగణనలోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ ఆదేశాలు జారీ చేసింది.
ఆధార్ కార్డుల్లో అడ్రస్, ఫోన్ నెంబర్, పేరులో తప్పులు సరిచేసుకునేందుకు యూఐడీఏఐ అవకాశం కల్పి్స్తుంది. పుట్టిన తేదీ మార్పులకు ప్రభుత్వ అధికారుల ధ్రువీకరణ అవసరం. తాజాగా ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ అప్డేట్ పై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఆధార్ కార్డుల్లో పుట్టిన తేదీ మార్పుల కోసం ప్రభుత్వ వైద్యులు జారీ చేసే ధ్రువీకరణ పత్రాలను అనుమతించాలని ప్రభుత్వం ఆదేశించింది. మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ కార్యదర్శులు జారీ చేసే సర్టిఫికెట్లు తరహాలో ప్రభుత్వ ఆసుపత్రులు ఇచ్చే క్యూఆర్ కోడ్ పత్రాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ అన్ని జిల్లాల సిబ్బందికి ఆదేశించింది.
మీ ఆధార్ కార్డు ఎక్కడెక్కడ వాడారో హిస్టరీ తెలుసుకోండి?
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ సేవలు, బ్యాంకు ఖాతా తెరిచేందుకు.. ఇలా ప్రతి దానికి ఆధార్ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. ప్రభుత్వ సేవలకు సంబంధించి ఆధార్ కార్డు కీలకంగా మారింది. ఇప్పుడు సిమ్ కార్డు తీసుకోవాలన్నా ఆధార్ కార్డు తప్పనిసరి అయ్యింది. ఇలా ప్రతీ చోట ఆధార్ వినియోగిస్తున్నారు. అయితే ఆధార్ నెంబర్ ఎక్కడిపడితే అక్కడ విచ్చలవిడిగా వాడుతుండడంతో కొన్నిసార్లు దుర్వినియోగం అవుతున్నాయనే అనుమానాలు ఉంటాయి. ఆధార్ కార్డు హిస్టరీ తెలుసుకుంటే...మీ అనుమతి లేకుండా ఎవరైనా మీ ఆధార్ నెంబర్ వినియోగించారో సులువుగా తెలుసుకోవచ్చు.
- ఆన్ లైన్ లో ఆధార్ హిస్టరీ తెలుసుకునేందుకు ఉడాయ్ పోర్టల్ https://uidai.gov.in/ కు వెళ్లాలి.
- హోంపేజీలో "My Aadhaar" ఆప్షన్‌లో 'Aadhaar services' సెక్షన్‌లోని 'Aadhaar Authentication History' ఆప్షన్ పై క్లిక్ చేయండి.
- ఆ తర్వతి పేజీలో లాగిన్‌పై క్లిక్ చేసి ఆధార్ నెంబర్, క్యాప్చా, ఓటీపీ ఎంటర్ చేయండి.
- ఆ తర్వాతి స్క్రీన్‌లో Authentication History కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ALL ఆప్షన్ ను ఎంచుకొని డేట్‌ని సెలెక్ట్ చేసుకోండి.
- ఆ తర్వాత Fetch Authentication History పై క్లిక్ చేయాలి.
- మీ ఆధార్ నెంబర్ ను గత ఆరు నెలలుగా ఎక్కడ ఓటీపీ, బయోమెట్రిక్, డెమోగ్రాఫిక్ ద్వారా వినియోగించారనే స్క్రీన్ పై కనిపిస్తుంది.
- ఆధార్ హిస్టర్ పీడీఎఫ్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
మీ ఆధార్ హిస్టరీని పరిశీలించి, మీకు తెలియకుండా ఎక్కడైనా మీ ఆధార్ వివరాలు వినియోగించారని తెలిస్తే వెంటనే 1947కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. లేదా యూఐడీఏఐ వెబ్ సైట్ లో కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఒకవేళ మీ ఆధార్ దుర్వినియోగం అయితే మై ఆధార్ యాప్ లేదా ఆన్ లైన్ లో బయోమెట్రిక్ లాక్ చేయండి. ఇలా లాక్ చేస్తే భవిష్యత్తులో మీ బయోమెట్రిక్ మీ ప్రమేయం లేకుండా ఎవరు ఉపయోగించేందుకు వీలుండదు.
సంబంధిత కథనం