Aadhaar Bank Account Link : ఆధార్ కార్డు-బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్, ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు-aadhaar card bank account linking status checking how to link bank account ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Aadhaar Bank Account Link : ఆధార్ కార్డు-బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్, ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు

Aadhaar Bank Account Link : ఆధార్ కార్డు-బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్, ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు

Aadhaar Bank Account Link : ప్రభుత్వ పథకాలు, ఇతర ప్రయోజనాలు పొందేందుకు ఆధార్-బ్యాంక్ ఖాతా లింకింగ్ కీలకంగా మారింది. మీ ఆధార్ నెంబర్ కు ఏ బ్యాంకు అకౌంట్ లింక్ అయ్యి ఉందో? ఆన్ లైన్, ఆఫ్ లైన్ విధానాల్లో సులభంగా తెలుసుకోవచ్చు.

ఆధార్ కార్డు-బ్యాంక్ అకౌంట్ లింకింగ్ స్టేటస్, ఇలా ఈజీగా చెక్ చేసుకోవచ్చు

Aadhaar Bank Account Link : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలు అమలుచేస్తున్నాయి. లబ్దిదారులకు నేరుగా ఖాతాల్లో నగదు జమచేస్తున్నాయి. ఈ ప్రక్రియను సులభతరం చేసేందుకు బ్యాంకు ఖాతాను ఆధార్ తో అనుసంధానం చేయడం తప్పనిసరి చేసింది కేంద్రం. బ్యాంకు లావాదేవీల భద్రత, ఇతర ఆర్థిక ప్రయోజనాలు కోసం ఆధార్, బ్యాంక్ ఖాతా లింక్ ఉపయోగపడుతుంది.

సంక్షేమ పథకాలు, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ ఫర్, స్కాలర్‌షిప్‌లు, పెన్షన్‌లతో సహా అనేక ప్రభుత్వ రాయితీలు, ప్రయోజనాలను పొందేందుకు ఆధార్ నెంబర్, బ్యాంక్ ఖాతాతో లింక్ చేయడం తప్పనిసరి. మీ మొబైల్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా బ్యాంక్ ఖాతా లింకింగ్ కు ఆన్‌లైన్‌లో తనిఖీ చేసుకోవచ్చు.

మీ ఆధార్ కార్డుకు ఏ బ్యాంక్ ఖాతా లింక్ అయ్యిందో ఉడాయ్(UIDAI) వెబ్ సైట్ లేదా మై ఆధార్ మొబైల్ యాప్ లేదా యూఎస్ఎస్డీ కోడ్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా చెక్ చేసుకోవచ్చు.

UIDAI వెబ్‌సైట్‌ ద్వారా ఆధార్-బ్యాంక్ ఖాతా లింక్ తనిఖీ

  • ఉడాయ్ వెబ్‌సైట్‌ https://uidai.gov.in/ పై క్లిక్ చేయండి.
  • "మై ఆధార్" పై క్లిక్ చేయండి
  • "బ్యాంక్ సీడింగ్ స్టేటస్" పై క్లిక్ చేయండి
  • మీ ఉడాయ్ ఖాతాలోకి లాగిన్ అవ్వండి
  • మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్, ఓటీపీని నమోదు చేయండి
  • మీ ఆధార్‌తో లింక్ అయిన బ్యాంక్ ఖాతా డిస్ ప్లే అవుతుంది.

USSD కోడ్‌ ద్వారా బ్యాంక్ ఖాతా లింక్

  • మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ నుంచి 9999*1# కు కాల్ చేయండి
  • మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను నమోదు చేయండి
  • మీ ఆధార్ నంబర్‌ను తిరిగి నమోదు చేసి "సెండ్" పై క్లిక్ చేయండి
  • బ్యాంక్ ఖాతా లింకింగ్ పూర్తయినట్లయితే, మీ బ్యాంక్ ఖాతా మొబైల్ స్క్రీన్‌లో కనిపిస్తుంది.

మై ఆధార్ యాప్ ద్వారా

  • myAadhaar యాప్ లో 'లాగిన్' క్లిక్ చేయండి. ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేసి, 'సెండ్ ఓటీపీ'పై క్లిక్ చేయండి.
  • మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి 'లాగిన్' బటన్‌ను క్లిక్ చేయండి.
  • ఆ తర్వాత 'బ్యాంక్ సీడింగ్ స్టేటస్' ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
  • మీ ఆధార్ కార్డ్‌తో లింక్ అయిన అన్ని బ్యాంక్ ఖాతాలను వీక్షించవచ్చు.

ఎస్ఎంఎస్ విధానం ద్వారా లింక్ చేసుకునేందుకు

  • UID<స్పేస్>ఆధార్ నంబర్>ఖాతా నంబర్> టైప్ చేయండి
  • 567676 కు SMS పంపడం ద్వారా బ్యాంక్ ఖాతా సీడింగ్ తెసుకోవచ్చు.
  • మీ లింకింగ్ ప్రక్రియ పూర్తైతే మీ బ్యాంక్ నుంచి SMS వస్తుంది.

బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ చేసుకునేందుకు మీ బ్యాంక్ ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్, బ్యాంక్ శాఖను సందర్శించవచ్చు.