Eluru Crime News : ఏలూరులో దారుణం - యువతి గొంతుకోసి హత్య, పైగా మెడ కోసుకున్న యువకుడు
Eluru District Crime News : ఏలూరులో దారుణం వెలుగు చూసింది. యువతికి గొంతుకోసి చంపేసిన యువకుడు..పైగా ఆత్మహత్యయత్నం చేశాడు.
Eluru District Crime News: ఏలూరు జిల్లా సత్రంపాడులో దారుణం వెలుగు చూసింది. యువతిపై కత్తితో ఓ యువకుడు దాడికి దిగాడు. గొంతుకోసి హత్య చేశాడు. పైగా అతను కూడా కత్తితో మెడ కోసుకున్నాడు. అతడి పరిస్థితి విషమంగా ఉండగా…. ఆస్పత్రికి తరలించారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
విద్యుత్ సబ్ స్టేషన్ లోనే రాసలీలలు…
ఏలూరు జిల్లాలో విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాసలీలలు బయపడ్డాయి. విధుల సమయంలో ఓ మహిళతో అసభ్యకరరీతిలో ఉద్యోగి దొరికిపోయాడు. తరచూ విద్యుత్ అంతరాయం కలుగుతుందని సబ్ స్టేషన్ కు వచ్చిన స్థానికులకు ఉద్యోగి రాసలీలలు కనిపించాయి. దీంతో వాళ్లు పై అధికారులకు ఫిర్యాదు చేశారు.
అసలేం జరిగింది….?
జంగారెడ్డిగూడెం పరిధిలోని పర్రెడ్డిగూడెం విద్యుత్ సబ్‌స్టేషన్ లో గంగు మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి షిఫ్ట్ ఆపరేటర్‌గా చేస్తున్నాడు. తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని, ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్నామని స్థానికులు సబ్ స్టేషన్ కు ఫోన్ చేశారు. అయితే ఫోన్ చేసిన ఎవరూ తీయకపోవడంతో కొందరు బుధవారం తెల్లవారుజామున స్థానికులు సబ్ స్టేషన్ కు వెళ్లారు.
డ్యూటీ సమయంలో మహేశ్వర్ రెడ్డి మద్యం తాగి ఓ మహిళతో సన్నిహితంగా ఉండటాన్ని గమనించిన స్థానికులు చూసి ఫొటోలు, వీడియోలు తీశారు. విద్యుత్ సబ్ స్టేషన్ లో ఇలాంటి పనులేంటని అతడిని ప్రశ్నించారు. విద్యుత్ ఆపరేటర్ మహేశ్వర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపిన ఉన్నతాధికారులు మహేశ్వర్ రెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేశారు.