Madanapalle Woman: బాబును చూడ్డానికి కాన్వాయ్ వెంట మహిళ పరుగులు, కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు-a woman ran along the convoy to see babu it was chandrababu who stopped the car and spoke ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Madanapalle Woman: బాబును చూడ్డానికి కాన్వాయ్ వెంట మహిళ పరుగులు, కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు

Madanapalle Woman: బాబును చూడ్డానికి కాన్వాయ్ వెంట మహిళ పరుగులు, కారు ఆపి మాట్లాడిన చంద్రబాబు

Sarath chandra.B HT Telugu
Jun 11, 2024 01:59 PM IST

Madanapalle Woman: ఎన్డీఏ పక్ష నాయకుడిగా ఎన్నికైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ చంద్రబాబు కాన్వాయ్‌ వెంట పరుగులు తీసింది.

చంద్రబాబును చూడ్డానికి కాన్వాయ్ వెంట పరుగులు తీస్తున్న  మదనపల్లికి చెందిన నందిని
చంద్రబాబును చూడ్డానికి కాన్వాయ్ వెంట పరుగులు తీస్తున్న మదనపల్లికి చెందిన నందిని

Madanapalle Woman: ఎన్డీఏ పక్ష నాయకుడిగా ఎన్నికైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన ఓ మహిళ చంద్రబాబు కాన్వాయ్‌ వెంట పరుగులు తీసింది. బాబును చూడాలి అంటూ కాన్వాయ్ వెంట మహిళ పరుగులు తీస్తుండటాన్ని గుర్తించిన టీడీపీ అధ్యక్షుడు వాహనాలను ఆపి ఆమెతో మాట్లాడారు.

yearly horoscope entry point

ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యేల సమావేశానికి వచ్చిన చంద్రబాబు నాయుడుని చూసేందుకు విజయవాడ ఏ కన్వెన్షన్ సెంటర్‌కు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. టిక్కిల్‌ రోడ్డులో పెద్ద ఎత్తున బారులు తీరారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు దారి పొడవునా స్వాగతం పలికారు.

ఎ కన్వెన్షన్ లో కూటమి సమావేశం అనంతరం ఉండవల్లి ప్రయాణమైన చంద్రబాబును చూసేందుకు మదనపల్లికి చెందిన నందిని అనే మహిళ కాన్వాయ్ వెంట పరుగులు పెట్టింది. ఆ మహిళను కారు లోంచి చూసిన చంద్రబాబు వెంటనే కాన్వాయ్ ను ఆపి....ఆ మహిళను దగ్గరకు పిలిచి మాట్లాడారు. తనది మదనపల్లి అని తన పేరు నందిని అని చెప్పిన ఆ మహిళ చంద్రబాబుపై అభిమానంతో చూడడానికి వచ్చాను అని చెప్పింది.

తనను చూసి ఎమోషన్ అయిన ఆ మహిళతో చంద్రబాబు మాట్లాడారు. సెక్యూరిటీని వారించి ఆమె వివరాలు తెలుసుకున్నారు. “మా కష్టం ఫలించి....మా కోరిక మేరకు మీరు సిఎం అయ్యారు సార్....ఒక్క సారి మీ కాళ్లు మొక్కుతాను అంటూ ఆ మహిళ అనగా... చంద్రబాబు సున్నితంగా వారించారు” ఆమెను ఆప్యాయంగా పలకరించి ఆమెతో ఫోటో దిగారు. తనకు జ్వరం ఉన్నా చూడాలని వచ్చానని నందిని చెప్పగా, ముందు ఆసుపత్రికి వెళ్లమని సూచించారు. ఆమె ఎక్కడ ఉంటారో తెలుసుకుని.... అవసరమైన వైద్యం సాయం చేయాలని పార్టీ నేతలకు చంద్రబాబు నాయుడు సూచించారు.

Whats_app_banner