Travels Bus Accident: దగదర్తి వద్ద కంటైనర్‌ను ఢీకొట్టి ట్రావెల్ బస్సు బోల్తా.. డ్రైవర్ మృతి
Travels Bus Accident: నెల్లూరు జిల్లా దగదర్తి వద్ద జరిగిన ప్రమాదంలో విజయవాడ వెంకటరమణ ట్రావెల్స్‌కు చెందిన బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందారు. మరో పదిమంది ప్రయాణికులకు గాయపడ్డారు.
Travels Bus Accident: విజయవాడ-చెన్నై జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ట్రావెల్స్ బస్సు డ్రైవర్ మృతి చెందాడు. మరో పదిమందికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి చెన్నైవెళుతోన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగదర్తి వద్ద అదుపు తప్పింది. డివైడర్ మీదుగా రోడ్డు అవతల వైపుకు వెళ్లి ఎదురుగా వస్తోన్న కంటైనర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్ స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయాడు.
జాతీయ రహదారిపై కంటైనర్‌ను లారీ ఢీకొని బోల్తాపడటంతో అందులో ప్రయాణిస్తున్న వారికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుంచి చెన్నైకి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు దగదర్తి మండలం సున్నపుబట్టి సమీపంలో ప్రమాదానికి గురైంది. ఈ బస్సులో విజయవాడ నుంచి చెన్నై వెళుతోన్న 35 మంది ప్రయాణికులు ఉన్నారు.
ప్రమాదంలో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రయాణికుల్లో 10 మంది ప్రయాణికులకి తీవ్ర గాయాలు అయ్యాయి. వారిలో ఒక మహిళ పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రుల్ని నెల్లూరు పోలీసులు ఆస్పత్రికి తరలించారు.విజయవాడకు చెందిన వెంకటరమణ ట్రావెల్స్ బస్సులో 35మంది చెన్నైకు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు.
బాపట్ల జిల్లాలో ట్యాంకర్ దగ్ధం…
బాపట్ల జిల్లా మేదరమెట్లలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చెన్నై జాతీయ రహదారిపై ట్యాంకర్ దగ్ధమైంది. మేదరమెట్ల జాతీయ రహదారిపై ఎదురుగా వస్తున్న లారీని ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు.