Chittoor Crime : మూడేళ్ల చిన్నారిపై అఘాయిత్యం - ఆపై సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ..!
చిత్తూరు జిల్లాలో ఘోరం వెలుగు చూసింది. మూడేళ్ల చిన్నారిపై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతున్నట్లు సీఐ మహేశ్వర్ తెలిపారు.
చిత్తూరు జిల్లాలో ఘోర సంఘటన చోటు చేసుకుంది. మూడేళ్ల చిన్నారిపై యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ తరువాత బాలికను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు. ఈ విషయం బాలిక… తన తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదైంది.

సెల్‌ఫోన్‌లో చిత్రీకరణ..!
ఈ ఘటన చిత్తూరు జిల్లా నగరి మండలంలో జరిగింది. నాలుగు రోజుల క్రితం చోటు చేసుకున్నఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నగరి మండలంలోని ఒక గ్రామానికి చెందిన మూడేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన మోహన్ (26) అనే యువకుడు కన్నేశాడు. ఎవరూ లేని సమయంలో ఆ బాలికపై మోహన్ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అంతేకాకుండా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడు.
బాలిక ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో గురువారం బాలిక తల్లిదండ్రులు నగరి పోలీస్‌స్టేషన్‌ను ఆశ్రయించారు. తమ కుమార్తెపై మోహన్ అనే యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడని… అంతేకాకుండా సెల్‌ఫోన్‌లో రికార్డు చేశాడని ఫిర్యాదు చేశారు. పోలీసులు నిందితుడు మోహన్‌పై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. బాధిత చిన్నారిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పొక్సో కేసు నమోదు…
సీఐ మహేశ్వర్ స్పందిస్తూ…. మూడేళ్ల చిన్నారిపై మోహన్ అనే యువకుడు అఘాయిత్యం పాల్పడినట్లు ఫిర్యాదు అందిందని తెలిపారు. పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని… విచారణ చేస్తున్నట్లు చెప్పారు.
చిన్నారిపై అఘాయిత్యం జరిగిన సమాచారం అందుకున్న నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్… గురువారం రాత్రి బాధితురాలి తల్లిదండ్రులను పరామర్శించారు. చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడిన యువకుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం:
శ్రీకాకుళం జిల్లాలో ఎనిమిదేళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. బాలికకు తీవ్ర రక్తస్రావం కావడంతో కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలంలోని ఒక గ్రామంలోని జరిగింది.
ప్రాథమిక వివరాల ప్రకారం… ప్రభుత్వ పాఠశాలలో బాలిక నాలుగో తరగతి చదువుతోంది. ఆ ఎనిమిదేళ్ల చిన్నారిపై అదే గ్రామానికి చెందిన నారు ప్రసాద్ అనే 23 ఏళ్ల యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. బాలికకు తీవ్రంగా రక్తస్రావం జరగడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. దీంతో జె.ఆర్. పురం పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే పోలీసులు బాలికను వైద్య సేవల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
నిందితుడిపై ఎస్ఐ చిరంజీవి పోక్సో కేసు నమోదు చేశారు. అనంతరం నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. శ్రీకాకుళం డీఎస్పీ హెచ్ వివేకానంద కేసును విచారిస్తున్నారు.
రిపోర్టింగ్ : జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం