ACB Raids In Ap: అవినీతిపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఏసీబీ దాడులతో కలకలం-a series of complaints against corrupt employees acb raids on corrupt staff ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  A Series Of Complaints Against Corrupt Employees, Acb Raids On Corrupt Staff

ACB Raids In Ap: అవినీతిపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. ఏసీబీ దాడులతో కలకలం

HT Telugu Desk HT Telugu
May 30, 2023 07:43 AM IST

ACB Raids In Ap: ఏపీలో ఏసీబీ సోదాలు కలకలం రేపుతున్నాయి. గత కొద్ది రోజులుగా నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఏసీబీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. జగనన్నకు చెబుదాం కాల్ సెంటర్‌ను ప్రారంభించిన తర్వాత అవినీతి అధికారులపై బాధితుల ఫిర్యాదులు పెరిగిపోయాయి.

ఒకే రోజు ఏసిబి ట్రాప్‌లో ఐదుగురు
ఒకే రోజు ఏసిబి ట్రాప్‌లో ఐదుగురు

ACB Raids In Ap: ప్రభుత్వం చెల్లించే జీతాలు సరిపోవన్నట్లు లంచాల కోసం అమాయకుల్ని వేధిస్తున్న అవినీతి జలగలపై ఏపీ ఏసీబీ కొరడా ఝుళిపిస్తోంది. ఇటీవల కొద్ది వారాలుగా ఏసీబీ క్రియాశీలకంగా వ్యవహరిస్తోంది. కొన్నేళ్లుగా ఏసీబీ కార్యకలాపాలు స్తబ్దుగా ఉన్నా నెలన్నర వ్యవధిలో పెద్ద సంఖ్యలో ఏసీబీ ట్రాప్‌ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.

ట్రెండింగ్ వార్తలు

సోమవారం ఒక్క రోజే ఐదుగురిని ఏసీబీ వలపన్ని పట్టుకుంది. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల అక్రమాలు, లంచాల కోసం వేధింపుల వ్యవహారంపై ఏసీబీకి నేరుగా వస్తున్న ఫిర్యాదులతో పాటు ముఖ్యమంత్రికి నేరుగా ఫిర్యాదు చేసే అవకాశం అందుబాటులోకి రావడంతో జనం లంచగొండి అధికారుల్ని పట్టించడానికి ధైర్యం చే్తున్నారు.

ఏసిబి 14400 కాల్ సెంటర్, ఏసిబి మొబైల్ యాప్ ద్వారా అవినీతి అధికారులపై వచ్చిన ఫిర్యాదులతో రెవెన్యూ, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్‌మెంట్ సర్వీసెస్, పంచాయతీ రాజ్ కు చెందిన ఐదు గురు అధికార్లను 4 కేసుల్లో లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులను అవినీతి నిరోధక శాఖ DG శంఖబ్రత భాగ్చి పర్యవేక్షిస్తున్నారు.

నిషేధిత జాబితా నుంచి తొలగించడానికి…

విశాఖపట్నం జిల్లా, బుచ్చిరాజు పాలెంకు చెందిన బాధితుడు కే. విశ్వేశ్వరరావుకు చెందిన ఆస్తుల్ని నిషేధిత ఆస్తుల నుండి ఆస్తిని తొలగించడం కోసం అధికారిక సహాయం చేయడానికి రూ.30వేల రూపాయలను లంచంగా డిమాండ్ చేశారు. లంచం ఇస్తేనే నిషేధిత ఆస్తుల జాబితా నుండి ఆస్తిని తొలగిస్తానని విశాఖపట్నం జిల్లా, విశాఖపట్నం రూరల్ ఆఫీసు వి‌ఆర్‌ఓ జామి రాము భాదితుడిని డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఏ‌సి‌బి అధికారులు రోజు బాధితుడి వద్ద నుండి వి‌ఆర్‌ఓ జామి రాము 10,000 రూపాయలను లంచంగా తీసుకుంటుండగా విశాఖపట్నం అవినీతి నిరోధక శాఖ ఆధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అంగన్వాడీ అయా నియామకానికి లంచం…

కృష్ణా జిల్లా, మోపిదేవి, పెదకల్లెపల్లి గ్రామానికి చెందిన బాధితురాలు పి. లావణ్య ను అంగన్వాడీ ఆయగా నియమించి, రికార్డుల్లో ఎలాంటి ప్రతికూల వ్యాఖ్యలు రాయకుండా ఉండటానికి, విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారని ధృవీకరించడానికి రూ.10,000/- రూపాయలను లంచం డిమాండ్ చేశారు. లంచం ఇస్తేనే పని చేస్తానని కృష్ణా జిల్లా, మోపిదేవి మండలం ICDS సూపర్వైజర్ గ్రేడ్-II డొక్కు వెంకట పద్మావతి బాధితురాలిని డిమాండ్ చేయడంతో బాధితురాలు అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న ఏ‌సి‌బి అధికారులు ఈ రోజు భాదితురాలు వద్ద నుండి ICDS సూపర్వైజర్ గ్రేడ్-II డొక్కు వెంకట పద్మావతి 10,000 రూపాయలను లంచం తీసుకుంటుండగా విజయవాడ అవినీతి నిరోధక శాఖ ఆధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

బిల్లులు ప్రాసెస్ చేయడానికి….

శ్రీ పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా, గుడ్లూరు మండలం, గుడ్లూరు గ్రామానికి చెందిన భాదితుడు మాధవరెడ్డి కట్టించిన గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం, వై‌ఎస్‌ఆర్ హెల్త్ క్లినిక్ ల బిల్లులను ప్రాసెస్ చేసేందుకుగాను రూ. 27వేల రూపాయలను లంచం ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తానని కావలి పంచాయతీ రాజ్ జూనియర్ అకౌంటెంట్ చిలకపాటి మనోజ్ కుమార్ డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆశ్రయించాడు. దీనిపై కేసు కేసు నమోదు చేసుకున్న ఏ‌సి‌బి అధికారులు ఈ రోజు బాధితుడి వద్ద నుండి పంచాయతీ రాజ్ జూనియర్ అకౌంటెంట్ మనోజ్ కుమార్ రూ.27వేలు రూపాయలను లంచంగా తీసుకుంటుండగా నెల్లూరు అవినీతి నిరోధక శాఖ ఆధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

ఇంటి నిర్మాణానికి లంచం…

తిరుపతి జిల్లా, తడ మండలం, కడలూరు గ్రామానికి చెందిన బాధితుడు తొగూరు ప్రవీణ్ కుమార్ ఇంటి నిర్మాణం కోసం 20 చెట్లు నరికి తీసుకెళ్ళటానికి రెవిన్యూ అధికారులు రూ.10వేల లంచం డిమాండ్ చేశారు. లంచం ఇస్తేనే చెట్లు నరికి తీసుకెళ్లడానికి అనుకూలంగా నివేదికను ఇస్తామని మెలిక పెట్టారు. సర్వే రిపోర్ట్ ఇవ్వడానికి తిరుపతి జిల్లా, తడ మండలం రి-సర్వే డిప్యూటీ తహశీల్దార్ నెల్లిపూరి అనిత బాధితుడిని లంచం డిమాండ్ చేయడంతో అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఆశ్రయించాడు.

ఈ వ్యవహారంపై కేసు కేసు నమోదు చేసుకున్న ఏ‌సి‌బి అధికారులు బాధితుడి వద్ద నుండి రి-సర్వే డిప్యూటీ తహశీల్దార్ నెల్లిపూరి అనిత, విలేజ్ రెవిన్యూ అసిస్టెంట్ శంకర్ రూ.10వేల రూపాయలను లంచంగా తీసుకుంటుండగా తిరుపతి అవినీతి నిరోధక శాఖ ఆధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నాలుగు కేసుల్లో అరెస్టైన నిందితుల్ని అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరు పరుచనున్నట్లు వెల్లడించారు.

IPL_Entry_Point