Tirupati: ఆరు నెలల కిందట చెల్లితో.. ఇప్పుడు అక్కతో.. అంతలోనే ఊహించని ట్విస్ట్!-a married lady and young man committed suicide in tirupati district ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Tirupati: ఆరు నెలల కిందట చెల్లితో.. ఇప్పుడు అక్కతో.. అంతలోనే ఊహించని ట్విస్ట్!

Tirupati: ఆరు నెలల కిందట చెల్లితో.. ఇప్పుడు అక్కతో.. అంతలోనే ఊహించని ట్విస్ట్!

HT Telugu Desk HT Telugu
Aug 24, 2024 02:23 PM IST

Tirupati: రోజురోజుకూ మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. కొందరు యువతీ యువకులు వాయివరస లేకుండా ప్రవర్తిస్తున్నారు. కన్నవారికి చెడ్డపేరు తీసుకొస్తున్నారు. తాజాగా తిరుపతి జిల్లాలో సభ్య సమాజం తలదించుకొనే ఘటన వెలుగులోకి వచ్చింది.

ఆరు నెలల కిందట చెల్లితో.. ఇప్పుడు అక్కతో.. అంతలోనే ఊహించని ట్విస్ట్
ఆరు నెలల కిందట చెల్లితో.. ఇప్పుడు అక్కతో.. అంతలోనే ఊహించని ట్విస్ట్ (AP Police)

తిరుప‌తి జిల్లాలో ఓ యువకుడు ఆరు నెలల్లోనే తొలిత‌ చెల్లి, త‌రువాత అక్క‌తో పరారయ్యాడు. యువ‌కుడు అక్కచెల్లెల్లిద్దరికి వ‌రుస‌కు తమ్ముడు అవుతాడు. ఇటీవల ఆ యువకుడు పెళ్లైన అక్కతో పారిపోయాడు. శుక్ర‌వారం మ‌ధ్యాహ్నం ఆ యువ‌కుడు, సదరు వివాహిత ఇద్ద‌రూ తిరుమల శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గంలో ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ ఘ‌ట‌న స్థానికంగా చర్చనీయాశంగా మారింది.

చిత్తూరు ప‌ట్ట‌ణం కొంగారెడ్డిప‌ల్లిలో రాధిక‌ (25 తన భర్త, పిల్లలతో కలిసి జీవిస్తోంది. భ‌ర్త తాపీ మేస్త్రీగా పనిచేస్తున్నారు. అయితే.. ఈనెల 21న రాధిక ఎదురింట్లో ఉన్న యువ‌కుడు స‌తీష్‌ (19)తో క‌లిసి పారిపోయింది. దీంతో త‌న భార్య క‌నిపించ‌లేదని.. రాధిక భ‌ర్త స్థానిక‌ ఎన్ఆర్‌పేట పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు.

రెండు రోజుల తర్వాత రాధిక త‌న భ‌ర్త‌కు ఫోన్ చేసింది. పిల్లలతో చివరిసారిగా మాట్లాడాలని కోరింది. తాను శ్రీ‌వారి మెట్టు న‌డక మార్గంలో ఉన్నాన‌ని.. పిల్లలను తీసుకురావాలని అభ్యర్థించింది. అందుకు అంగీకరించిన రాధిక భర్త.. పిల్ల‌ల‌కు ఇద్దరం కావాల‌ని.. ఎలాంటి అఘాయిత్యానికి పాల్పడవద్దని సూచించారు. వెంట‌నే బైక్‌పై బ‌య‌లుదేరాడు. ఆయన అక్క‌డికి చేరురునే స‌రికి.. ఊహించని ఘటన జరిగింది.

తిరుమ‌ల‌కు వెళ్లే శ్రీ‌వారి మెట్టు న‌డ‌క మార్గం 450వ మెట్టు వ‌ద్ద.. రాధిక, సతీష్ ఇద్ద‌రూ పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు. పురుగుల మందు తాగ‌డంతో సొమ్మసిల్లి ప‌డిపోయారు. గ‌మనించిన కొంత మంది భక్తులు.. టీటీడీ భ‌ద్ర‌తా సిబ్బందికి స‌మాచారం ఇచ్చారు. భద్రతా సిబ్బంది వారిని కొండ పైనుంచి కింద‌కు దించారు. చికిత్స నిమిత్తం 108 వాహ‌నంలో రుయా ఆసుపత్రికి తరలించారు. ప్ర‌స్తుతం వారిద్ద‌రి ఆరోగ్య ప‌రిస్థితి బాగానే ఉంద‌ని వైద్యులు చెప్పారు.

స‌తీష్ ఆరు నెల‌ల కిందటే.. రాధిక చెల్లితో ప‌రార‌య్యాడు. ఈ విష‌యాన్ని రాధిక భ‌ర్త గ్రామపెద్దల వ‌ద్ద పెట్టాడు. దీనిపై గొడవ జరిగింది. దీంతో సతీష్ రాధిక భర్తను బెదిరించాడు. మీ ఇంటి అంతు చూస్తాన‌ని.. హెచ్చరించాడు. ఈ క్ర‌మంలో త‌న భార్య‌ను ట్రాప్ చేసి.. సతీష్ ఈ పని చేశాడని రాధిక భర్త ఆరోపిస్తున్నారు. దీనిపై పోలీసులు కేసు న‌మోదు చేసి విచార‌ణ జ‌రుపుతున్నారు.

( రిపోర్టింగ్- జ‌గదీశ్వ‌ర‌ రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు ప్రతినిధి )