Minor Girl Rape: కృష్ణా జిల్లాలో ఘోరం...ఐదేళ్ల చిన్నారిపై దివ్యాంగుడి అత్యాచారం…
Minor Girl Rape: రాష్ట్రంలో చిన్నారులపై దాడులు ఆగడం లేదు. రోజుకోక ఘటన వెలుగులోకి వస్తుంది.తాజాగా కృష్ణా జిల్లాలో ఘోరమైన ఘటన వెలుగు చూసింది.అభంశుభం తెలియని ఐదేళ్ల చిన్నారిపై దివ్యాంగుడు అత్యాచారానికి ఒడిగట్టాడు.నిందితుడికి బాధిత కుటుంబమే రోజూ అన్నం పెడుతున్నా కృతజ్ఞత లేకుండా ప్రవర్తించాడు.
Minor Girl Rape: దివ్యాంగుడు కదా అని మానవత్వంతో భోజనం పెడుతుంటూ అతను మాత్రం ఆ ఇంట్లో బాలికపై అత్యాచారానికి పాల్పడటం అందరిని కలిచి వేసింది. కృష్ణాజిల్లా గుడివాడలో ఓ దివ్యాంగుడిని చేరదీస్తే ఆ కుటుంబంలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వారింటి వద్దే భోజనం తిని, వారి కుమార్తెపైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. బాలిత తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.
ఈ ఘటన కృష్ణా జిల్లా గుడివాడలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుడివాడ పట్టణంలో ఒక కాలనీలో నివాసం ఉంటున్న దంపతులకు ఐదుగురు ఆడపిల్లలు ఉన్నారు. ఆ దంపతులు వివిధ పనులు చేసుకుంటూ పిల్లలను సాకుతున్నారు. అయితే వారికి ఇంటికి ఎదురుగా ఎండూరి జోజిబాబు అనే 42 ఏళ్ల వ్యక్తి ఉంటున్నాడు. దివ్యాంగుడిగా ఉన్న ఆయన రైసు మిల్లులో ముఠా కార్మికుడిగా పని చేస్తూ జీవిస్తున్నాడు.
దివ్యాంగుడు కావడంతో ఆయన ఈ దంపతులే అన్నం పెడుతూ మానవత్వంతో వ్యవహరించేవారు. శనివారం సాయంత్రం జోజిబాబు ఇంట్లోకి వచ్చాడు. అప్పుడు ఇంట్లో ఎవరూ లేరు. అప్పటికే ఐదేళ్ల చిన్నారి టీవీ చూస్తూ నిద్రపోయింది. కామంతో కళ్లు మూసుకుపోయిన జోజిబాబు మానవత్వాన్ని మరిచి నిద్రలో ఉన్న చిన్నారిపై దారుణానికి ఒడిగట్టాడు. అయితే సరుకుల కోసం షాప్‌కు వెళ్లిన చిన్నారి అక్క అప్పుడే ఇంటికి చేరుకుంది. ఆమె చెల్లిపై జరుగుతున్న ఈ అఘాయిత్యాన్ని చూసి కేకలు వేసింది. చెల్లిపై అ దారుణానికి పాల్పడుతున్న ఆయనను గట్టిగా నెట్టేసింది.
దీంతో కామంధుడు జోజిబాబు అక్కడి నుంచి పరారయ్యాడు. పనులపై వెళ్లిన తల్లిదండ్రులు ఇంటికి చేరుకున్నాక, బాలిక జరిగిన విషయమంతా చెప్పింది. దీంతో తండ్రి గుడివాడ టూ టౌన్ పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఆదివారం చిన్నారిని వైద్య పరీక్షల కోసం గుడివాడ ప్రాంతీయ ఆసుప్రతికి తరలించారు. అనంతరం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ ఎండీ అబ్దుల్ సుబాన్ మాట్లాడుతూ నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని తెలిపారు.
బాలికపై అత్యాచార ఘటన తెలియగానే విచారణ చేపట్టడం ప్రారంభించామని డీఎస్పీ అబ్దుల్ సుబాన్ తెలిపారు. అన్నం పెట్టే ఇంట్లో ఇలాంటి అకృత్యానికి పాల్పడడం అమానవీయమని పేర్కొన్నారు. నిందితుడిపై పోక్సో కేసు దర్యాప్తు అనంతరం చర్యలు ఉంటాయని తెలిపారు. చిన్నారులపై దాడులకు పూనుకుంటూ చర్యలు తప్పవని హెచ్చరించారు. మరోవైపు బాలిక కుటుంబ సభ్యులు, బంధువులు నిందితుడిపై కఠిన చర్యలకు డిమాండ్ చేస్తున్నారు.
(జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)