Chandrababu Assets: చంద్ర బాబు ఆస్తుల్లో 82శాతం కుటుంబ సంపదే, మన్మోహన్ ఆర్థిక విధానాలతో భారీగా లాభపడిన బాబు-82 of chandra babus assets are family wealth huge profit from manmohans economic policies ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Chandrababu Assets: చంద్ర బాబు ఆస్తుల్లో 82శాతం కుటుంబ సంపదే, మన్మోహన్ ఆర్థిక విధానాలతో భారీగా లాభపడిన బాబు

Chandrababu Assets: చంద్ర బాబు ఆస్తుల్లో 82శాతం కుటుంబ సంపదే, మన్మోహన్ ఆర్థిక విధానాలతో భారీగా లాభపడిన బాబు

Bolleddu Sarath Chandra HT Telugu
Jan 02, 2025 12:10 PM IST

Chandrababu Assets: దేశంలోనే అత్యంత ధనిక సీఎంగా చంద్రబాబు నాయుడు నిలవడం వెనుక మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక సంస్కరణలు ఉన్నాయని హెరిటేజ్‌ సంస్థ చెబుతోంది. సరళీకృత ఆర్థిక విధానాలు, సంస్కరణలతో హెరిటేజ్ లాభాల బాటపట్టడం వల్ల, కుటుంబ వాటాలతో కలిపి బాబు ఆదాయం పెరిగిందని పిటిఐ కథనం పేర్కొంది.

చంద్రబాబు ఆస్తుల విలువ పెరగడానికి కారణం అదే...
చంద్రబాబు ఆస్తుల విలువ పెరగడానికి కారణం అదే... (HT_PRINT)

Chandrababu Assets: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఉన్న రూ.931 కోట్ల సంపదలో 82 శాతం మన్మోహన్ హయాంలోని రిటైల్ కంపెనీలో కుటుంబ వాటాలేనని, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుకు ఉన్న రూ.931 కోట్ల సంపదలో 82 శాతం రిటైల్ కంపెనీలో కుటుంబ వాటాలని హెరిటేజ్ వివరిస్తోంది.

yearly horoscope entry point

మూడు దశాబ్దాల క్రితం మన్మోహన్ సింగ్ భారత ఆర్థిక వ్యవస్థలో సరళీకృత విధానాలు ప్రారంభించిన సమయంలో ఏర్పాటు చేసిన డెయిరీ ప్రొడక్ట్ రిటైలింగ్ సంస్థలో నారా చంద్రబాబు నాయుడి కుటుంబానికి ఉన్న వాటాల కారణంగా సంక్రమించినవేనని పేర్కొన్నారు.

1992లో ఏర్పాటైన పాల, పాల ఉత్పత్తుల రిటైలర్ హెరిటేజ్ ఫుడ్స్ లిమిటెడ్ లో చంద్రబాబుకు ప్రస్తుతం ఎలాంటి వాటాలు లేనప్పటికీ, ఆయన సతీమణి భువనేశ్వరి నారాకు 24.37 శాతం వాటా ఉంది.

ఇటీవల రూ.931 కోట్లకు పైగా ఆస్తులతో దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రిగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదికలో చంద్రబాబు నిలిచారు.

ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆస్తుల విలువపై హెరిటేజ్ ఫుడ్స్ అధికారులు వివరణ ఇచ్చారు. హెరిటేజ్‌ సంస్థ ప్యూర్-ప్లే డైలీ ప్రొడక్ట్ రిటైలర్ అని, ఆ సంస్థ ఎప్పుడూ మౌలిక సదుపాయాలు వంటి క్రోనీ క్యాపిటలిస్ట్ రంగంలో లేదని వివరించారు.

ప్రభుత్వ సబ్సిడీ, ఇతర మద్దతు లభించని రిటైల్ సంస్థ తన ఉత్పత్తులను ప్రజలు అంగీకరిస్తేనే మార్కెట్‌లో ఎదగగలదని చంద్రబాబు నాయుడు కేవలం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఈ సంస్థను ఏర్పాటు చేశారని హెరిటేజ్ అధికారులు వివరించారు. తర్వాత కాలంలో హెరిటేజ్ సంస్థ స్టాక్ ఎక్స్ఛేంజీల్లో లిస్ట్ కావడంతో దాని విలువ పెరిగిందని తెలిపారు.

1990 దశకం ప్రారంభంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరు రాష్ట్రంలోనే అత్యధికంగా పాలను ఉత్పత్తి చేసే జిల్లాగా ఉండేదని, 1992లో పాల మిగులు ఉండడంతో పాల రైతులకు మార్కెటింగ్ సంక్షోభం ఏర్పడిందని హెరిటేజ్ ప్రతినిధులు పిటిఐకు వివరించారు.

1991-92లో అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్ ఆర్థిక వ్యవస్థను సరళీకరించి, ప్రైవేటు మూలధనానికి అనేక రంగాలను తెరిచారని పాడి పరిశ్రమను కూడా సరళీకరించి, పాల ప్రాసెసింగ్, మార్కెటింగ్ లో పెట్టుబడులు పెట్టేందుకు ప్రైవేటు పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించారని గుర్తు చేశారు. .

ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న చంద్రబాబు నాయుడు 1992లో రూ.50 లక్షల ప్రారంభ పెట్టుబడితో హెరిటేజ్ ఫుడ్స్ ను స్థాపించి చిత్తూరులో హెరిటేజ్ ఫుడ్ తొలి పాల శీతలీకరణ యూనిట్ ను ఏర్పాటు చేశారని ఇందుకోసం బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి రుణాలు తీసుకున్నామని, తొలినాళ్లలో చంద్రబాబు నాయుడు రెండేళ్ల పాటు హెరిటేజ్ ఫుడ్స్ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్నారని వారు తెలిపారు.

1994లో చంద్రబాబు నాయుడు తొలిసారి మంత్రి అయినప్పుడు ఆ పదవికి రాజీనామా చేయడంతో ఆయన భార్య ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా, ఆ తర్వాత మేనేజింగ్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టారని పేర్కొన్నారు.

హెరిటేజ్ ఫుడ్స్ 1994లో లిస్ట్ అయినప్పుడు దాని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.25 కోట్లుగా ఉంది. కంపెనీ పెరిగే కొద్దీ ఎంసీఏపీ పెరిగిందని, విస్తరణ కార్యకలాపాల కోసం బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇతర జాతీయ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించామని, కొవిడ్ తర్వాత హెరిటేజ్ ఫుడ్స్‌ రుణ రహిత సంస్థగా అవతరించినట్టు పేర్కొన్నారు.

ప్రస్తుతం హెరిటేజ్ ఫుడ్స్ మొత్తం మార్కెట్ విలువ రూ.4400 కోట్లు, ఆదాయం రూ.3750 కోట్లు, భారతదేశంలోని 12 రాష్ట్రాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోందని దీని ఆస్తి విలువ రూ.600 కోట్లు ఉందని తెలిపారు. . ఇది నాణ్యమైన పాల ఉత్పత్తులతో పాటు పంపిణీ వారి బలంగా ఉన్నాయని చెప్పారు.

ప్రస్తుతం ఈ వ్యాపారాన్ని మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న భువనేశ్వరి నారా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చంద్రబాబు నాయుడు కోడలు నారా బ్రాహ్మణి నిర్వహిస్తున్నారు. స్టాన్ ఫోర్డ్ బిజినెస్ స్కూల్ లో గ్రాడ్యుయేట్ అయిన నారా లోకేష్ సతీమణి బ్రాహ్మణి ప్రముఖ అంతర్జాతీయ డెయిరీ కంపెనీల్లో పనిచేశారని హెరిటేజ్ ప్రతినిధులు వివరించారు. చంద్రబాబు నాయుడు ఆస్తుల విలువలో హెరిటేజ్‌ వాటాలను లెక్కించడం వల్లే ఆదాయంలో అగ్రస్థానంలో ఉన్నారని పేర్కొన్నారు. .

Whats_app_banner