Special Trains : కుంభమేళా యాత్రికులకు గుడ్‌న్యూస్‌.. ఏపీ నుంచి 8 స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలు ఇవే-8 special trains from ap for kumbh mela pilgrims ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Special Trains : కుంభమేళా యాత్రికులకు గుడ్‌న్యూస్‌.. ఏపీ నుంచి 8 స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలు ఇవే

Special Trains : కుంభమేళా యాత్రికులకు గుడ్‌న్యూస్‌.. ఏపీ నుంచి 8 స్పెషల్ ట్రైన్స్.. పూర్తి వివరాలు ఇవే

HT Telugu Desk HT Telugu
Published Feb 07, 2025 11:41 AM IST

Special Trains : మ‌హా కుంభ‌మేళాకు వెళ్లే యాత్రికుల‌కు, భక్తులకు ఇండియ‌న్‌ రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ప్ర‌యాగ్‌రాజ్‌లో జ‌రుగుతున్న‌ మహా కుంభమేళాకు.. విశాఖ‌ప‌ట్నం, గుంటూరు, తిరుప‌తి నుంచి వివిధ జిల్లాల మీదుగా స్పెష‌ల్‌ ట్రైన్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

స్పెషల్ ట్రైన్స్
స్పెషల్ ట్రైన్స్

ఏపీ నుంచి కుంభమేళాకు వెళ్లే భక్తులకు రైల్వే శాఖ శుభవార్త చెప్పింది. విశాఖ‌ప‌ట్నం నుంచి నాలుగు స్పెష‌ల్ రైళ్లు, గుంటూరు, తిరుప‌తి నుంచి రెండేసి చొప్పున స్పెషల్ రైళ్ల‌ను న‌డ‌ప‌డాలని నిర్ణ‌యించింది. ఈ రైళ్ల స‌దుపాయాన్ని వినియోగించుకోవాల‌ని ప్ర‌యాణికుల‌కు ఇండియ‌న్ రైల్వే విజ్ఞప్తి చేసింది.

1. రైలు నెంబ‌ర్ 08530 విశాఖ‌ప‌ట్నం-పండిట్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ జంక్ష‌న్‌ స్పెషల్ రైలును అందుబాటులోకి తీసుకుకొచ్చారు. ఈ రైలు ఫిబ్ర‌వ‌రి 20, 27 తేదీల్లో సాయంత్రం 5.35 గంటలకు విశాఖ‌ప‌ట్నం నుండి బయలుదేరుతుంది. ఫిబ్ర‌వ‌రి 22, మార్చి తేదీల్లో 29 తెల్ల‌వారుజామున 4.30 గంటలకు పండిట్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ జంక్ష‌న్‌కు చేరుకుంటుంది.

2. రైలు నెంబ‌ర్ 08529 పండిట్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ జంక్ష‌న్‌ -విశాఖ‌ప‌ట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకుకొచ్చారు. ఈ రైలు ఫిబ్ర‌వరి 22, మార్చి 1 తేదీల్లో రాత్రి 8.10 గంటలకు పండిట్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ జంక్ష‌న్‌ నుండి బయలుదేరుతుంది. ఫిబ్ర‌వ‌రి 24, మార్చి 3 తేదీల్లో తెల్ల‌వారు జామున 3.25 గంటలకు విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటుంది.

ఈ రైళ్లు సింహాచ‌లం, కొత్త‌వ‌ల‌స జంక్ష‌న్‌, విజ‌య‌న‌గరం జంక్ష‌న్‌, బొబ్బిలి జంక్ష‌న్‌, పార్వతీపురం త‌దిత‌ర స్టేష‌న్ల మీదుగా ప్ర‌యాగ్ రాజ్ చేరుకుంటాయి. ఈ రైళ్లలో ఫ‌స్ట్ ఏసీ కోచ్‌-1, సెకెండ్ ఏసీ కోచ్ -1, థ‌ర్డ్ ఏసీ కోచ్‌-1, థ‌ర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లు -4, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -8, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్-1, జనరేటర్ మోటార్ కార్-1 కోచ్‌లు ఉంటాయి.

3. రైలు నెంబ‌ర్ 08562 విశాఖ‌ప‌ట్నం-గోర‌ఖ్‌పూర్‌ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకుకొచ్చారు. ఈ రైలు ఫిబ్ర‌వరి 16 తేదీన‌ రాత్రి 10.20 గంటలకు విశాఖ‌ప‌ట్నం నుండి బయలుదేరుతుంది. ఫిబ్ర‌వ‌రి 18న తేదీన రాత్రి 8.25 గంటలకు గోర‌ఖ్‌పూర్‌ రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటుంది.

4. రైలు నెంబ‌ర్ 08561 గోర‌ఖ్‌పూర్‌-విశాఖ‌ప‌ట్నం స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకుకొచ్చారు. ఈ రైలు ఫిబ్ర‌వరి 19 తేదీన మ‌ధ్యాహ్నం 2.20 గంటలకు గోర‌ఖ్‌పూర్‌ నుండి బయలుదేరుతుంది. ఫిబ్ర‌వ‌రి 21న తేదీన మ‌ధ్యాహ్నం 12.15 గంటలకు విశాఖ‌ప‌ట్నం రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటుంది.

ఈ రైళ్లు కొత్త‌వ‌ల‌స జంక్ష‌న్‌, విజ‌య‌న‌గరం జంక్ష‌న్‌, శ్రీకాకుళం, ప‌లాస‌ త‌దిత‌ర స్టేష‌న్ల మీదుగా ప్ర‌యాగ్ రాజ్ చేరుకుంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల‌లో ఫ‌స్ట్ ఏసీ కోచ్‌-1, సెకెండ్ ఏసీ కోచ్ -1, థ‌ర్డ్ ఏసీ కోచ్‌-1, థ‌ర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లు -4, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -8, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్-1, జనరేటర్ మోటార్ కార్-1 ఉంటాయి.

5. రైలు నెంబ‌ర్ 07081 గుంటూరు-ఆజంగ‌ఢ్‌ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకుకొచ్చారు. ఈ రైలు ఫిబ్ర‌వరి 14 తేదీన రాత్రి 11 గంటలకు గుంటూరు నుండి బయలుదేరుతుంది. ఫిబ్ర‌వ‌రి 16న తేదీన సాయంత్రం 5.15 గంటలకు ఆజంగ‌ఢ్‌ రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటుంది.

6. రైలు నెంబ‌ర్ 07082 ఆజంగ‌ఢ్‌-విజ‌య‌వాడ‌ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకుకొచ్చారు. ఈ రైలు ఫిబ్ర‌వరి 16 తేదీన రాత్రి 7.45 గంటలకు ఆజంగ‌ఢ్‌ నుండి బయలుదేరుతుంది. ఫిబ్ర‌వ‌రి 18న తేదీన ఉద‌యం 7.30 గంటలకు విజ‌య‌వాడ‌ రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటుంది. ఈ రైలు గుంటూరు వ‌ర‌కు వెళ్ల‌దు. విజ‌య‌వాడ‌లోనే ఆగిపోతుంది.

ఈ స్పెష‌ల్ రైళ్లు విజ‌య‌వాడ‌, ఖ‌మ్మం, డోర్న‌క‌ల్, మ‌హ‌బుబాబాద్‌, వ‌రంగల్‌ , రామ‌గుండం, మంచిర్యాల‌, సిర్‌పూర్ కాగజ్‌నగ‌ర్‌ త‌దిత‌ర స్టేష‌న్ల మీదుగా ప్ర‌యాగ్ రాజ్ చేరుకుంటాయి. ఈ ప్రత్యేక రైళ్ల‌లోసెకెండ్ ఏసీ కోచ్ -1, థ‌ర్డ్ ఏసీ కోచ్‌-2, థ‌ర్డ్ ఏసీ ఎకానమీ కోచ్‌లు -4, స్లీపర్ క్లాస్ కోచ్‌లు -8, జనరల్ సెకండ్ క్లాస్ సిట్టింగ్ కోచ్‌లు-4, సెకండ్ క్లాస్ కమ్ లగేజ్/ డిసేబుల్డ్ కోచ్-1, జనరేటర్ మోటార్ కార్-1 ఉంటాయి.

7. రైలు నెంబ‌ర్ 07107 తిరుప‌తి-బనార‌స్‌ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైలును అందుబాటులోకి తీసుకుకొచ్చారు. ఈ రైలు ఫిబ్ర‌వరి 8, 15, 22 తేదీల్లో రాత్రి 8.55 గంటలకు తిరుప‌తి నుండి బయలుదేరుతుంది. ఫిబ్ర‌వ‌రి 10, 17, 24 తేదీల్లో మ‌ధ్యాహ్నం 3.45 గంటలకు బనార‌స్‌ రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటుంది. ఈ రైలు గూడురు, నెల్లూరు, ఒంగోలు, చీరాల‌, తెనాలి, విజ‌య‌వాడ‌, ఏలూరు, తాడేప‌ల్లి గూడెం, నిడ‌ద‌వోలు, రాజ‌మండ్రి, సామార్ల‌కోట‌, అన్న‌వ‌రం, ఎల‌మంచిలి, అన‌కాప‌ల్లి, దువ్వాడ‌, పెందుర్తి, కొత్త‌వ‌లస‌, విజ‌య‌న‌గ‌రం, బొబ్బిలి, పార్వ‌తీపురం స్టేష‌న్‌ల మీదుగా బనార‌స్ చేరుకుంటుంది.

8. రైలు నెంబ‌ర్ 07108 బనార‌స్‌-విజ‌య‌వాడ‌ స్పెషల్ ఎక్స్‌ప్రెస్‌ను అందుబాటులోకి తీసుకుకొచ్చారు. ఈ రైలు ఫిబ్ర‌వరి 10, 17, 24 తేదీల్లో సాయ‌త్రం 5.30 గంట‌ల‌కు బ‌నార‌స్‌ నుండి బయలుదేరుతుంది. ఫిబ్ర‌వ‌రి 12, 19, 26 తేదీల్లో ఉద‌యం 5.30 గంటలకు విజ‌య‌వాడ‌ రైల్వే స్టేష‌న్‌కు చేరుకుంటుంది. ఈ రైలు తిరుప‌తి వైపు వెళ్ల‌దు. పార్వతీపురం, బొబ్బిలి, విజ‌య‌గ‌నరం, కొత్త‌వ‌లస‌, పెందుర్తి, దువ్వాడ‌, అనకాప‌ల్లి, ఎల‌మంచిలి, అన్న‌వ‌రం, సామ‌ర్ల‌కోట‌, రాజ‌మండ్రి, నిడ‌ద‌వోలు, తాడేప‌ల్లి గూడెం, ఏలూరు స్టేష‌న్ మీదుగా విజ‌య‌వాడ చేసుకుంటుంది.

(రిపోర్టింగ్- జ‌గ‌దీశ్వ‌ర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner