Cannabis Plantation Crushed : 7500 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం.., 1,32,000 కిలోలు సీజ్-7500 acres cannabis plantation crushed and 132000 kgs seized in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  Andhra Pradesh  /  7500 Acres Cannabis Plantation Crushed And 132000 Kgs Seized In Andhra Pradesh

Cannabis Plantation Crushed : 7500 ఎకరాల్లో గంజాయి పంట ధ్వంసం.., 1,32,000 కిలోలు సీజ్

HT Telugu Desk HT Telugu
Nov 16, 2022 05:33 PM IST

AP DGP On Cannabis : ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి తోటలను భారీ ఎత్తును ధ్వంసం చేశామని డీజీపీ రాజేంద్రనాథ్ చెప్పారు. వందల సంఖ్యల్లో కేసులు నమోదయ్యాయని, పెద్ద ఎత్తున గంజాయి సీజ్ చేశామన్నారు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో గంజాయిపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గతేడాది నుంచి ప్రత్యేక డ్రైవ్(Special Drive) ద్వారా రాష్ట్రంలో 7500 ఎకరాల్లో గంజాయి సాగును ధ్వంసం చేసినట్లు డీజీపీ(DGP) రాజేంద్రనాథ్ తెలిపారు. పోలీసుల కృషితో రాష్ట్రంలో ఇప్పటివరకు 1,599 కేసులు నమోదు చేశామని, 1,32,000 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని ప్రకటనలో తెలిపారు. ప్రత్యామ్నాయ సాగు వైపు వెళ్లేలా పోలీసులు అవగాహన కల్పిస్తున్నారన్నారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ వ్యవహారంలో ఇప్పటివరకు నమోదైన కేసుల గురించి డీజీపీ(DGP) పేర్కొంటూ.. దేశంలోని 12 రాష్ట్రాలకు చెందిన నిందితులను పోలీసులు గుర్తించినట్లు తెలిపారు. నిందితులు ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో త్వరలో అరెస్టు చేస్తామని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలపై సుదీర్ఘంగా మాట్లాడి, పోలీసు(Police)ల ప్రణాళికలు, సంసిద్ధత గురించి వివరించారు.

రాష్ట్రాల సమస్యలపై డీజీపీ మాట్లాడుతూ.. సరిహద్దు గంజాయి, ఎర్రచందనంపై త్వరలో తిరుపతి(Tirupati)లో పోలీసు సదస్సు నిర్వహించబోతున్నట్లుగా తెలిపారు. ఆంధ్రా-ఒరిస్సా(Andhra Odisha) సరిహద్దు ప్రాంతాల్లో మావోయిస్టు కార్యకలాపాలు ఇంకా కొనసాగుతున్నాయని, వాటిని అరికట్టేందుకు పోలీసులు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

ప్రస్తుతం ఆంధ్రా-ఒరిస్సా సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టు(Maoist) ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు డీజీపీ తెలిపారు. ఇటీవల ప్రతిపక్షనేత, మాజీ సీఎం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై జరిగిన దాడిపై డీజీపీని ప్రశ్నించగా.. ఈ కేసులో విచారణ జరుగుతోందని చెప్పారు. ఈ ఘటనపై మాట్లాడుతూ..'చంద్రబాబు నాయుడుపై ఎవరో రాయి విసిరారు. ఆయన భద్రతా సిబ్బందికి గాయాలయ్యాయి. నిందితుడిని ఇంకా గుర్తించలేదు.' అన్నారు.

పెరుగుతున్న సైబర్ నేరాలపై(Cyber Crimes) డీజీపీ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ క్రైమ్ ఫిర్యాదులపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతపురం పోలీస్ ట్రైనింగ్ సెంటర్(Police Training Centres) ఈ శిక్షణను నిర్వహిస్తోంది. సైబర్ ఫిర్యాదుల విషయంలో జరిగే ప్రక్రియ గురించి డీజీపీ మరింత వివరించి, సైబర్ క్రైమ్‌కు సంబంధించిన కేసులను విడిగా నమోదు చేస్తున్నట్టుగా చెప్పారు. పోలీసులు ముందుగా అనుకున్న విధానంలో స్టాండర్డ్ ఆపరేటింగ్ సిస్టమ్‌తో కేసుల్లో ముందుకు వెళతారని చెప్పారు.

అవగాహన పెంచడం గురించి ఆలోచిస్తున్ననామని డీజీపీ రాజేంద్రనాథ్ చెప్పారు. వివిధ కార్యక్రమాలు, పోస్టర్ల ద్వారా నకిలీ రుణ యాప్‌(Loan Apps)లు, వివిధ సైబర్ నేరాల గురించి ప్రజలకు తెలియజేయాలని డీజీపీ పేర్కొన్నారు. పోలీసుశాఖలో సరిపడా సిబ్బందిపై డీజీపీ మాట్లాడుతూ.. 6500 మంది సిబ్బంది నియామకానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందన్నారు. త్వరలో నియామకాలకు జరుగుతాయన్నారు.

IPL_Entry_Point