Whatsapp Governance: జూన్‌ నాటికి ఏపీలో వాట్సాప్‌ లో 500రకాల పౌరసేవలు.. 100రోజుల్లో ఏఐ సేవలు షురూ..-500 types of civic services on whatsapp in ap by june ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Whatsapp Governance: జూన్‌ నాటికి ఏపీలో వాట్సాప్‌ లో 500రకాల పౌరసేవలు.. 100రోజుల్లో ఏఐ సేవలు షురూ..

Whatsapp Governance: జూన్‌ నాటికి ఏపీలో వాట్సాప్‌ లో 500రకాల పౌరసేవలు.. 100రోజుల్లో ఏఐ సేవలు షురూ..

Sarath Chandra.B HT Telugu

Whatsapp Governance: ఏపీలో ఈ ఏడాది జూన్ 30నాటికి 500 రకాల ప్రభుత్వ సేవలను మనమిత్రలో వాట్సాప్ ద్వారా అందిస్తామని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రకటించారు. వాట్సాప్‌ పౌర సేవలు సమర్ధవంతంగా ప్రజలకు సేవల్ని అందిస్తున్నట్టు చెప్పారు.

ఏపీ అసెంబ్లీలో నారా లోకేష్‌

Whatsapp Governance: చంద్రబాబునాయుడు సింగపూర్ సిటిజన్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రేరణ పొంది ఈ-సేవ సర్వీసులను ఎలక్ట్రిసిటీ బిల్ తో ప్రారంభించారని వాటిని క్రమంగా అనేకరకాల సేవలకు విస్తరించారని తర్వాత మీ సేవగా మారిందని నారా లోకేష్‌ అసెంబ్లీలో వివరించారు. వాట్సాప్‌ మనమిత్ర సేవల్ని 500 సేవలకు అందించనున్నట్టు ప్రకటించారు.

యువగళం పాదయాత్రలో తెలుసుకున్నానని గ్రామ గ్రామాన ప్రజలను కలిసినపుడు ఆఫీసుల ముందు పడిగాపులు పడాల్సి వస్తోందని తనకు చెప్పారని బటన్ నొక్కితే సినిమా టిక్కెట్లు, స్విగ్గీ ఫుడ్, నిత్యావసర వస్తువులు, ట్యాక్సీ వంటి అన్ని సేవలు ఇంటికి వస్తున్నపుడు ప్రభుత్వ సేవలు ఎందుకు రావడం లేదని ప్రజలు నన్ను ప్రశ్నించడంతో వాట్సాప్‌ గవర్నెన్స్‌ ఆలోచన వచ్చినట్టు చెప్పారు.

ఆఫీసులకు వెళితే డబ్బులు ఇవ్వాల్సి వస్తుందని, గంటల తరబడి నిలబడాల్సి వస్తుందని సామాన్య ప్రజలు అక్కడకు వెళ్లడానికి ఇష్టపడటం లేదని ఆఫీసులకు వెళితే మెరుగైన సేవలు అందకపోగా, లేనిపోని సమస్యలు వస్తాయని భావించే వారన్నారు.

గవర్నెన్స్ లో కీలక సంస్కరణలకు మనమిత్రతో నాంది

ధనవంతులకు, పేదలకు తేడాలేకుండా నాణ్యమైన విద్య అందిస్తున్న తరహాలోనే ప్రభుత్వ సేవలు అందరికీ సమంగా అందించాల్సి ఉందని ఇందుకోసం వాట్సాప్‌ ద్వారా సుపరిపాలనపై అధ్యయనం చేసినట్టు చెప్పారు,

విజిబుల్ గవర్నెన్స్ - ఇన్విజిబుల్ గవర్నమెంట్ నినాదం ద్వారా ప్రజల చేతిలో పరిపాలన ఉండాలన్నది తన ఆకాంక్ష అన్నారు. బేసిక్ సర్వీసెస్, వివిధరకాల సర్టిఫికెట్లను అధికారుల పాత్ర లేకుండా చేయాలనే ఆలోచనతో, కొత్త యాప్ తో అవసరం లేకుండా అందరికీ అందుబాటులో ఉన్నవాట్సాప్ ద్వారా మనమిత్ర పేరుతో ప్రజలచేతిలోకి పాలన తెచ్చే లక్ష్యంతో సేవలు ప్రారంభించినట్టు చెప్పారు.

పౌరసేవలకు గేమ్ ఛేంజర్‌గా మనమిత్ర పేరుతో సేవలకు శ్రీకారం చుట్టామని ప్రస్తుతం 200 సేవలను మనమిత్ర ద్వారా అందిస్తున్నామన్నారు. ఇతర దేశాల్లో విధానాలను తెలసుకున్నపుడు ఎస్తోనియాలో ఈ గవర్నెన్స్ చాలా ముందుకు తీసుకెళ్లారని సింగపూర్ లో స్మార్ట్ నేషన్ ఇనిషియేటివ్ కింద ఎఐ పవర్ తో సేవలు అందిస్తున్నారని, యుఎఇ లాంటి దేశాలు వాట్సాప్ ఆధారిత సేవలు అంద జేస్తున్నారని గవర్నెన్స్ లో విప్లవాత్మక సంస్కరణల అమలులో వాట్సాప్ గవర్నెన్స్ కీలక పాత్ర వహిస్తుందని మేం బలంగా నమ్ముతున్నామని చెప్పారు.

ఈనెలాఖరుకు మనమిత్ర ద్వారా 300 రకాల సేవలు

రాబోయేరోజుల్లో వాయిస్ అనేబుల్ చేసి ఎఐని అనుసంధానంతో ఇంకా మెరుగైన సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు. మనమిత్రకు సంబంధించి సెప్టెంబర్ 19, 2024న మెటాతో సమావేశమై, అక్టోబర్ 22, 2024న ఎంఓయు చేసుకున్నామన్నారు.

జనవరి 30, 2025కి 150 రకాల ప్రభుత్వ సేవలు (రెవిన్యూ సర్టిఫికెట్, ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లింపు, గ్రీవెన్స్ సేవలు వంటివి) మనమిత్రలో ప్రారంభించామని ఈనెలాఖరుకు 300రకాల ప్రభుత్వ సేవలు వాట్సాప్ ద్వారా అందుబాటులోకి తేబోతున్నట్టు చెప్పారు.

ఎఐ చాటాబాట్ కూడా ఉపయోగించి మెరుగైన సేవలు ప్రజలకు అందించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. మనమిత్ర సేవలు 3 కేటగిరిల్లో అందించాలని నిర్ణయించామన్నారు. . ఒకటి ప్రజలకు నేరుగా అందించే సేవలు, 2వది హ్యుమన్ ఇంటర్వెన్స్ ద్వారా, 3వది సంస్కరణలను అమలు చేయడం ద్వారా సేవలు. ఇటీవల కదిరికి వెళ్లినపుడు ఒకసారి సర్టిఫికెట్ ఇచ్చాక మళ్లీమళ్లీ ప్రజలు ప్రభుత్వ కార్యాలయాలకు ఎందుకురావాలని అడిగా, ఎటువంటి కొర్రీలు లేకుండా పర్మినెంట్ సర్టిఫికెట్ ఇవ్వాలని నిర్ణయించాం. క్లిష్టతరమైన సేవలను చట్టాలను సవరించి సర్వీసులను అందుబాటులోకి తెస్తామన్నారు. .

క్యూఆర్ కోడ్, ఎఐ అనేబుల్ తో మెరుగైన సేవలు

నూతన విధానంలో వివిధ రకాల సర్టిఫికెట్లు ట్యాంపరింగ్ కు ఆస్కారం లేకుండా క్యూఆర్ కోడ్ అనేబుల్ సర్టిఫికెట్లు అందజేస్తామని సెక్యూరిటీ పేపర్ పేరుతో పెద్ద ఎత్తున ప్రభుత్వ విభాగాల్లో డబ్బు ఖర్చవుతోందని క్యూఆర్ కోడ్ అనేబుల్ తో ఆ డబ్బు ఆదా అవుతుందని చెప్పారు.

ఏపీపీఎస్సీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో చాలా సమయం తీసుకుంటున్నట్లు మా పరిశీలనలో తెలిసిందని నూతన విధానంలో క్యూఆర్ కోడ్ ద్వారా వెరిఫికేషన్ సులభతరం చేస్తామన్నారు. పేమెంట్స్ అన్నీ ఇంటిగ్రేట్ చేసి ఒకే ప్లాట్ ఫాంపైకి తెచ్చామని రాబోయే రోజుల్లో మరింత సులతరంగా ఎఐ చాట్ బాట్ ద్వారా బస్ టిక్కెట్లు, ఇతర సేవలను కేవలం వాయిస్ కాల్ తో అందేలా చేస్తామన్నారు.

Sarath Chandra.B

TwittereMail
శరత్‌ చంద్ర హిందుస్తాన్ టైమ్స్‌ తెలుగు న్యూస్‌ ఎడిటర్‌గా ఉన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాలో వివిధ హోదాల్లో 2001 నుంచి పని చేస్తున్నారు. జర్నలిజంలో నాగార్జున యూనివర్శిటీ నుంచి పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేశారు. గతంలొ ఈనాడు, ఎన్‌టీవీ, టీవీ9, హెచ్‌ఎంటీవీ, టీవీ5లలో వివిధ హోదాలలో విజయవాడ, హైదరాబాద్‌, ఢిల్లీలలో పనిచేశారు. 2022లో హెచ్‌టీ తెలుగులో చేరారు. ఇక్కడ ఏపీ తెలంగాణకు సంబంధించిన వర్తమాన అంశాలు, బ్యూరోక్రసీ, రాజకీయ వార్తలు, క్రైమ్ వార్తలను అందిస్తారు.

సంబంధిత కథనం